Home
News

Elyments Super App లాంచ్!!! ఒక యాప్‌లోనే అనేక ఫీచర్స్...

ఇండియాలో 59 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన తరువాత ఇప్పుడు కొత్తగా ఎలిమెంట్స్ అనే భారతీయ సోషల్ మీడియా యాప్ ను ప్రారంభించారు. ఈ 'సూపర్ యాప్' అనేక మొబైల్ యాప్ లు అందిస్తున్న చాలా రకాల ఫీచర్లను ఒకే ప్లాట్‌ఫామ్‌లో మిళితం చేసి అందిస్తుంది. ఈ మిళితంలో సోషల్ నెట్‌వర్కింగ్, ఇన్‌స్టంట్ మెసేజింగ్, వీడియో చాట్‌ మరియు వాయిస్ కాల్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఎలిమెంట్స్ యాప్ ఎందుకు?

ఎలిమెంట్స్ యాప్ ఎందుకు?

భారతదేశం మరియు చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్తత కారణంగా భారతీయులలో చైనా మీద తీవ్ర ఆగ్రహం ఉంది. ఇప్పుడు చైనా ఉత్పత్తులు మరియు యాప్ లపై నిషేధం ప్రకటించింది. అప్పటి నుండి ప్రజలు చైనా యొక్క యాప్ లను డౌన్‌లోడ్ చేయడం మానివేశారు. అలాగే ఎక్కువ మంది భారతీయులు ఇతర దేశాల యాప్ లను డౌన్‌లోడ్ చేసి ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నారు. చైనీస్ యాప్ లు ప్రజల డేటాను లీక్ చేయగలవని లోగో అభిప్రాయపడింది. అంతే కాదు ఈ యాప్ ల తయారీకి మిలియన్ల ఖర్చు అవుతాయి.

 

"ఆత్మనీర్భర్ భారత్" నినాదం

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఆత్మనీర్భర్ భారత్' (సెల్ఫ్ రెలియంట్ ఇండియా) అనే మెసేజ్ ను గట్టిగా సమర్థిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలిమెంట్స్ సూపర్ యాప్ ను ప్రారంభించడంతో ఈ దిశలో ఒక భారీ ప్రయత్నానికి అడుగును వేశారు. ఇండియాలోని సుమారు 1,000 మందికి పైగా ఐటి నిపుణులు కలిసి ఈ యాప్ ను అభివృద్ధి చేశారు.

ఎలిమెంట్స్ యాప్ లాంచ్

ఎలిమెంట్స్ యాప్ లాంచ్

భారతీయ సోషల్ మీడియా ఎలిమెంట్స్ యాప్ ను జూలై 5 న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మన దేశ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. దీనిని డెవలపర్లు ‘మొదటి సోషల్ నెట్‌వర్కింగ్ సూపర్ యాప్' గా పిలిచారు. లాంచ్ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ స్వావలంబన ప్రయోజనం చేకూర్చడానికి మరియు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, మానవ వనరులను సుసంపన్నం చేయడం మరియు బలమైన సరఫరా గొలుసులను నిర్మించడం ద్వారా దేశ ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుచేయవచు అని తెలిపారు.

ఎలిమెంట్స్ యాప్ ఫీచర్స్

ఎలిమెంట్స్ యాప్ ఫీచర్స్

ఎలిమెంట్స్ అనేది సమగ్ర సోషల్ నెట్‌వర్కింగ్ యాప్. అంటే చాలా రకాల యప్ల సమ్మేళనం. ఇది మీకు అవసరమైన ప్రతిది కూడా అందుబాటులో ఉంచగల ఒక-స్టాప్-యాప్. దీని ద్వారా స్నేహితులతో కనెక్ట్ అవ్వడం మరియు వారితో సంభాషించడం, కొత్త అప్ డేట్ లను పంచుకోవడం, వ్యక్తులతో నెట్‌వర్క్ చేయడం, ఎటువంటి డిస్టమెన్సు లేని వాయిస్ మరియు వీడియో కాల్‌లు చేయడం వంటి ఫీచర్లతో ఎలిమెంట్స్‌ యాప్ లభిస్తుంది.

ఎలిమెంట్స్ యాప్ గురించి ముఖ్యమైన సమాచారం

ఎలిమెంట్స్ యాప్ గురించి ముఖ్యమైన సమాచారం

> ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లుగా పనిచేస్తున్న వెయ్యి మందికి పైగా ఐటి నిపుణులు కలిసి ఈ 'ఎలిమెంట్స్' యాప్‌ను రూపొందించారు.

> ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం కోసం గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యొక్క యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.

> డెవలపర్‌ల ప్రకారం ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు "ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి మరియు స్థానికంగా షాపింగ్ చేయడానికి" కూడా ఒకే యాప్‌లో అనుమతి లభిస్తుంది.

 

ఎలిమెంట్స్ యాప్ స్పెక్స్

ఎలిమెంట్స్ యాప్ స్పెక్స్

> ఈ యాప్ సోషల్ మీడియా కంటెంట్ ఫీడ్, చాట్ ఇంటర్ఫేస్ మరియు ఆడియో మరియు వీడియో కాల్స్ చేయడం వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది.

> వినియోగదారుల యొక్క పూర్తి డేటా ఇండియాలో స్టోర్ చేయబడుతుంది. అలాగే యూజర్ యొక్క డేటా యూజర్ అనుమతి లేకుండా మూడవ పార్టీతో షేర్ చేయబడదు.

 

ఎలిమెంట్స్ యాప్ ఫౌండర్

ఎలిమెంట్స్ యాప్ ఫౌండర్

> ఈ యాప్‌లో గల మరొక అద్భుతమైన ఫీచర్ ఏమిటంటే ఆడియో-వీడియో కాల్‌లను మరియు ప్రైవేట్ చాట్ కనెక్షన్‌ను ఉచితంగా అనుమతించడం.

> ఇది ‘మేడ్ ఇన్ ఇండియా' యాప్ కావడంతో ఎలిమెంట్స్ యాప్ పూర్తిగా ఎనిమిది భారతీయ భాషల్లో లభిస్తాయి.


> ఈ యాప్ ఇప్పటికే 500,000 సార్లు డౌన్‌లోడ్ చేయబడింది మరియు ఇది సగటున 4.4 స్టార్ రేటింగ్‌ను కూడా పొందింది.

> శ్రీ శ్రీ తత్వ, భారతదేశ ఆరోగ్యం & సంరక్షణ మరియు ఎఫ్‌ఎంసిజి బ్రాండ్ ఎలిమెంట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా తన ఇ-కామర్స్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇది యాప్‌లోని క్యూరేటెడ్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో భాగం అవుతుంది.

 

More from GizBot

Best Mobiles in India

English summary
India Made Social Media App ''Elyments'' Super App Launched: Know the Founder and Company Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X