భళా భారత బాలిక.. మేధస్సులో నవ్వే గ్రేట్!!

Posted By:

లండన్: భారతీయ సంతతికి చెందిన పన్నెండేళ్ల నేహా రాము మేధస్సు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే ఎక్కువ. ఐన్‌స్టీన్, హాకింగ్ మేధో స్థాయి 160. నేహారాము మేథో స్థాయి వీరికంటే రెండు పాయింట్లు ఎక్కువ అంటే 162 పాయింట్లు. తెలివితేటలు లెక్కించేందుకు ఐన్‌స్టీన్‌ను ప్రమాణంగా తీసుకుంటారు. ఇటీవలి కాలంలో ఐక్యూలో ఐన్‌స్టీన్‌నే మించిపోయే చిన్నారుల సంఖ్య బాగా పెరుగుతోంది.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి ఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గత అక్టోబర్‌లో ఒలీవియా మానింగ్ అనే బాలిక 162 ఐక్యూతో మేధావుల క్లబ్ మెన్సా‌లో చోటు సాధించింది. తాజాగా బ్రిటన్‌లో ఉంటున్న నేహారాము ఈ ఘనత సాధించింది. నేహా తల్లిదండ్రులు మునిరాజు, జయశ్రీ ఇద్దరూ కంటి వైద్యులే. యుకెలోని మెన్స్ నిర్వహించే ఐఐఐబి పరీక్షలో ఆమె ఈ స్కోరు సాధించింది.

నేహా ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు కింగ్ స్టన్‌కు వలస వెళ్లారు. నేహా సాధించిన విజయంతో ఆమె తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. నేహాను చూసి తాము గర్వపడుతున్నామని, ఈ సంతోషం మాటల్లో చెప్పలేమంటున్నారు. ఆమె మేధస్సును తల్లిదండ్రులు మొదట్లో గుర్తించలేదు. ఓ పరీక్షలో ఆమె 280కి 280 మార్కులు సాధించింది.

భళా భారత బాలిక.. మేధస్సులో నవ్వే గ్రేట్!!

అప్పటి నుండి తల్లిదండ్రులు ఆమె మేధస్సుపై దృష్టి సారించారు. హారీపోటర్ వీరాభిమాని అయిన నేహాకు ఈత కొట్టడం సరదా. మెన్సా పరీక్ష చాలా కష్టమని, అందులో అంత స్కోరు సాధిస్తానని తాను ఊహించలేదని, సోమవారం ఫలితాలు చూసి ఆశ్చర్యపోయానని, సంతోషంగా ఉందని నేహా రాము అన్నారు. కాగా, ఐన్‌స్టీన్ తన జీవిత కాలంలో ఎప్పుడూ ఇలాంటి మేధోస్థాయి పరీక్షలు ఎదుర్కోలేదు. అయితే ఆయన మేధోస్థాయి 160 వరకు ఉంటుందనేది అంచనా మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot