అమెరికాను అధిగమించిన ఇండియా..... ఓ లుక్ వేయండి
ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇప్పుడు అమెరికా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కంటే పెద్దదిగా ఉంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2019 లో ఇండియా మొదటిసారిగా 158 మిలియన్ యూనిట్ లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా చేరుకుంది.

భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధి మిడ్-టైర్ విభాగంలో అందరి కంటే ముందుంది. ఈ విభాగంలో ఎక్కువగా చైనా బ్రాండ్లు గ్రేడ్ ఫీచర్స్ మరియు సామర్థ్యాలతో దూకుడుగా అనేక ఫ్లాగ్‌షిప్‌లను ప్రవేశపెట్టాయి. ఇండియాలో చైనా బ్రాండ్ల యొక్క మార్కెట్ వాటా 2019 లో 72% రికార్డు స్థాయిలో ఉంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యధిక లాభాలు పొందినవారు మరియు నష్టపోయినవారు ఎవరు అని తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అగ్రస్థానంలో షియోమి
షియోమి 2019 నాల్గవ త్రైమాసికంలో సంవత్సరానికి 7% మరియు 2019 సంవత్సరం మొత్తానికి 5% వృద్ధిని సాధించింది. ఆఫ్‌లైన్ ఛానల్ విస్తరణ మరియు రెడ్‌మి నోట్ సిరీస్ యొక్క బలమైన పనితీరు సంస్థ యొక్క వృద్ధికి బాగా సహాయపడింది. 2019 లో షియోమి సంస్థ తన ఇంటి మార్కెట్ అయిన చైనాను అధిగమించి ఇండియాలో అతిపెద్ద మార్కెట్‌ను తయారుచేసుకున్నది. అయితే కంపెనీ వృద్ధి మాత్రం సంవత్సరంలో ఒకే అంకెకు పడిపోయింది.

ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 2వ స్థానంలో వివో
2019 నాల్గవ త్రైమాసికంలో ఇండియాలో అధికంగా వివో సంస్థ లాభం పొందినది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ల లాభాలలో ఈ సంస్థ రెండవ స్థానంలో ఉంది. ఇది 2019 లో సంవత్సరానికి 76% మరియు క్యూ 4 2019 లో సంవత్సరానికి 134% వృద్ధి చెందింది. ఈ వృద్ధి ఎక్కువగా కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్ సిరీస్ నుండి వచ్చింది. వివో రూ.15 వేల నుండి రూ.20 వేల విభాగంలో స్మార్ట్‌ఫోన్లను తయారుచేసింది. ఎస్-సిరీస్ వృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించింది. Z మరియు U సిరీస్‌లతో సంస్థ తన ఆన్‌లైన్ పరిధిని మరింత విస్తరించింది.

రియల్‌మి
2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి. ఇది క్యూ 2 2019 లో X2 ప్రోతో ప్రీమియం మార్కెట్లో ప్రవేశించింది. భారతదేశంలో 2019 లో అత్యంత విజయవంతమైన బ్రాండ్ గా రియల్‌మి ఉంది. కేవలం 2019 లో కంపెనీ భారతదేశంలో 255% వృద్ధిని సాధించింది. సంవత్సరంలో రియల్‌మి యొక్క వృద్ధి దూకుడుగా వెళ్ళే మార్కెట్ వ్యూహంతో నడిచింది. ఇది శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభించింది. క్యూ 4 2019 లో కంపెనీ తన X2 ప్రో ఫోన్ తో మంచి లాభాలను ఆర్జించింది.

ఆపిల్
2019 లో స్పష్టమైన విజేతగా నిలిచిన మరో సంస్థ ఆపిల్. కౌంటర్ పాయింట్ ప్రకారం క్యూ 4 2019 లో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో కుపెర్ట్నో దిగ్గజం ఒకటి. ఐఫోన్ XR యొక్క ధరల తగ్గింపులు మరియు ఐఫోన్ 11 యొక్క తక్కువ ధర పాయింట్ కంపెనీ బలమైన అమ్మకాలను సాదించడానికి సహాయపడింది. వాస్తవానికి ఆపిల్ ఐఫోన్ 11 యొక్క సరసమైన ధర పండుగ సీజన్లో మరియు ప్రారంభ త్రైమాసికంలో మార్కెట్ వాటా అభివృద్ధికి సహాయపడింది.

వన్‌ప్లస్
వన్‌ప్లస్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బలమైన బ్రాండ్ ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. అయితే రియల్‌మి, షియోమి యొక్క పోకో మరియు వివో యొక్క iQOO ప్రీమియం విభాగంలో స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాయి కావున వన్‌ప్లస్ తీవ్ర పోటీని ఎదుర్కోవచ్చు. ఐఫోన్‌ల తక్కువ ధర పాయింట్లు కూడా కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.

శామ్‌సంగ్
శామ్‌సంగ్ 2019 సంవత్సరంలో ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన 2 వ స్థానాన్ని నిలుపుకోగలిగింది. 2019 చివరి త్రైమాసికంలో వివో ఆ స్థానాన్ని భర్తీ చేసింది. 2019 నాల్గవ త్రైమాసికంలో కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం దక్షిణ కొరియా దిగ్గజం 3 వ స్థానానికి పడిపోయింది. అయితే ఈ సంస్థ యొక్క ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో బలమైన స్థానాన్ని కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications








