India pak conflict భారత్, పాక్ మధ్య ఘర్షణ వాతావరణం.. శాంసంగ్ కీలక నిర్ణయం..!
India Pak Conflict : పహల్గాం ఉగ్రదాడిలో భారత్‌కు చెందిన 26 మంది మరణించారు. దీనికి భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్‌తో (Operation Sindoor) గట్టి సమాధానం పంపింది. అయితే అప్పటి నుంచి పాకిస్థాన్ సరిహద్దు వెంట కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు మరణిస్తున్నారు. దీంతోపాటు జమ్మూ సహా ఇతర సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు చేస్తోంది. దీనికి భారత సైన్యం కూడా గట్టి సమాధానం ఇస్తోంది. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు రాష్ట్రాల్లో అనేక ఎయిర్‌పోర్టులను మూసేవేశారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. దీంతోపాటు పాక్ దాడులకు భారత్ ఎప్పటికప్పుడు దీటుగా బదులిస్తోంది. దీంతోపాటు ప్రజల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.

ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఈ నెల 13 వ తేదీన నిర్వహించాలని భావించిన శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్‌ను (Samsung Galaxy S25 Edge launch Event cancel) రద్దు చేసినట్లు తెలిపింది. అయితే ఈవెంట్‌ను వర్చువల్‌గా నిర్వహించడం లేదా మరో తేదీకి మార్చడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నట్లు తెలిపారు. గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. శాంసంగ్ నుంచి నిన్న ఈ ఫోన్ విడుదల పై ప్రకటన వెలువడింది. ఈ ఫోన్ కేవలం 5.84mm థిక్‌నెస్‌తో అల్ట్రా స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌లలో అత్యంత సన్నని ఫోన్ ఇదేనని తెలుస్తోంది. మరియు కేవలం 162 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.65 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ పొందుతుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత శాంసంగ్ One UI 7 ను కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఈ అల్ట్రా స్లిమ్ స్మార్ట్‌ఫోన్ 200MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ తోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్ 25W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 3900mAh బ్యాటరీతో పనిచేస్తుందని సమాచారం. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
* శాంసంగ్ మే 8 వ తేదీన గెలాక్సీ F56 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫోన్ కేవలం 7.2mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంది. మరియు ప్రారంభ ధర రూ.25999 గా ఉంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ ఫోన్ Exynos 1480 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో రెండు కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు 12MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ కెమెరా విభాగం Object Eraser మరియు Edit Suggestions వంటి AI ఎడిటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








