భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత... సైబర్ అటాక్‌లకు అవకాశం.. ఎలా సురక్షితంగా ఉండాలి..?
గత నెలలో పహల్గాం ఉగ్రదాడిలో 26 మందిని ఉగ్రమూకలు పొట్టన పెట్టుకున్నాయి. అయితే అదే సమయంలో ఉగ్రదాడికి దీటైన సమాధానం చెబుతామంటూ భారత ప్రభుత్వం తెలిపింది. చెప్పినట్లుగానే పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. అప్పటి నుంచి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తూ సరిహద్దు వెంట కాల్పులు జరుపుతోంది.
దీంతోపాటు యుద్ధ విమానాలతో భారత్‌లో దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. ఈ దాడులను భారత్ సైన్యం తిప్పికొడుతోంది. అయితే నేరుగా తలపడేంత శక్తి సామర్థ్యాలు లేని పాకిస్థాన్.. భారత ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఆన్‌లైన్ వేదికగా ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వేదికగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న దాయాది దేశం.. హ్యాకింగ్ ప్రయత్నాలు చేస్తోంది.

సైబర్ దాడులు :
భారతీయ సంస్థలు, ప్రజలే టార్గెట్ గా సైబర్ దాడులు చేయిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ వంటి అనేక ఆర్థిక వ్యవస్థలపై వివిధ మార్గాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా CERT-In సూచనలతో బాంబే స్టాక్ ఎక్స్చేంజీ అప్రమత్తం అయింది. కీలక సూచనలు చేసింది.
అసలు ఏంటీ మాల్వేర్ :
డాన్స్ ఆఫ్ ది హిల్లరీ మాల్వేర్ (Dance of hillary malware) ద్వారా పాకిస్థాన్ ఆధారిత హ్యాకర్లు భారత సంస్థలు, ప్రజలపై హ్యాంకింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, మెయిల్, వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఈ మాల్వేర్ ను వ్యాప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
సరిహద్దులకు సమీపంలోని :
ఈ ప్లాట్‌ఫామ్స్‌లోని కొన్ని వీడియో, డాక్యుమెంట్స్ ను ఓపెన్ చేస్తే అందులోని మాల్వేర్ ఫోన్‌లోని బ్యాంకింగ్ సహా ఇతర సున్నితమైన వివరాలు కాజేస్తుందని సైబర్ భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా పాక్ సరిహద్దుకు సమీపంలోని బ్యాంకులు ఇప్పటికే సైబర్ సెక్యూరిటీపై చర్యలు తీసుకున్నాయి.
ఈ మాల్వేర్ ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ ను దొంగిలించే సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మరియు సీక్రెట్ డేటాను కూడా లీక్ చేయగలదు. మరియు ఫోన్లు, కంప్యూటర్‌లను రిమోట్‌గా కంట్రోల్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :
- సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేందుకు బలమైన పాస్‌వర్డ్ లను క్రియేట్ చేసుకోవాలి. అక్షరాలు, నంబర్లు, ప్రత్యేక గుర్తులను కలిగి ఉండేలా చూడాలి.
- స్మార్ట్‌ఫోన్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. కంప్యూటర్‌లతోపాటు యాప్స్‌ను కూడా అప్‌డేట్ చేసుకోవాలి.
- టూ స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
- సోషల్ మీడియాతోపాటు ఈ మెయిల్‌కు వచ్చిన ఎటువంటి అనుమానాస్పద లింక్స్‌ను క్లిక్ చేయవచ్చు.
- వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఆటో డౌన్‌లోడ్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
- యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని, అప్‌డేట్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications








