ఇండియాలో ఇంటర్నెట్ వేగం ఎంతో తెలుసుకోండి !

Written By:

ఇండియాలో ఇంటర్నెట్ వాడుతున్న యూజర్లకు ఇంటర్నెట్ స్పీడ్‌ను అంచనా వేసే సంస్థ ఓక్లా ఓ శుభవార్తను అందించింది. నవంబరు మాసానికి సగటు మొబైల్‌ ఇంటర్‌నెట్‌వేగం దాదాపు రెట్టింపు అయిందని ఇది భారతీయ వినియోగదారులకు శుభవార్తేనని తెలిపింది. కాగా మొబైల్‌ ఇంటర్‌నెట్‌ స్పీడ్‌లో భారత్‌ 109వ స్థానంలో నిలిచింది. బ్రాండ్‌ బ్యాండ్‌ స్పీడ్లో 76వ స్థానంలో నిలిచింది.

4,000mAh, సెల్ఫీ ప్లాష్ స్మార్ట్‌ఫోన్ రూ. 6,999కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సగటు మొబైల్‌ డోన్‌లోడ్‌ స్పీడ్‌ ..

గ్లోబల్ ఇండెక్స్ స్పీడ్ టెస్ట్ నవంబర్‌ నెల గణాంకాలను ఓక్లా విడుదల చేసింది. దీని ప్రకారం సగటు మొబైల్‌ డోన్‌లోడ్‌ స్పీడ్‌ 7.65 ఎంబీపీఎస్‌ గా నిలిచింది.

బ్రాడ్‌ బ్యాండ్‌ వేగం 76 వ స్థానంలో..

ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌ బ్యాండ్‌ వేగం 76 వ స్థానంలో ఉంది. ఈ సగటు జనవరి నాటికి 12.12 పాయింట్లు ఉంటే, నవంబరులో 18.82 పాయింట్లుగా నిలిచిందని ఓక్లా తెలిపింది.

133 దేశాల్లో..

మొత్తం 133 దేశాల్లో మొబైల్ నెట్ వేగాన్ని విశ్లేషిస్తూ వెబ్ సేవల సంస్థ ఓక్లా ఈ విషయాన్ని వెలువరించింది.

అగ్రస్థానంలో నార్వే

కాగా ఈ జాబితాలో అగ్రస్థానంలో నార్వే నిలిచింది. నార్వేలో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ సగటు డౌన్‌లోడ్ వేగం 62.66 ఎంబీపీఎస్ గా ఉంది.

ల్యాండ్ లైన్ , బ్రాడ్ బ్యాండ్ సేవలకు వచ్చేసరికి..

ఇక ల్యాండ్ లైన్ , బ్రాడ్ బ్యాండ్ సేవలకు వచ్చేసరికి 153. 85 స్పీడ్ తో సింగపూర్ ప్రధమ స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో నెదర్లాండ్స్ ( 53.01ఎంబిపిఎస్) మూడవ స్థానంలో ఐస్ ల్యాండ్ ( 52. 78ఎంబిపిఎస్) నాలుగవ స్థానంలో సింగపూర్ ( 51. 50ఎంబిపిఎస్) నిలిచాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
India ranks 109th in mobile internet speed and 76th in fixed broadband Read more New at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot