రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం

Posted By:

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో విజయాన్ని అందుకుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం అర్థరాత్రి 11.41నిమిషాలకు ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టంతో కూడిన పీఎస్ఎల్ వీ-సీ22 వాహన నౌకను అంతరిక్షంలోకి పంపారు. నిరంతరాయంగా 64.30 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగాక ఈ ఉపగ్రహం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ తాజా ఆవిష్కరణతో అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ మరో అడుగు ముందుకేసినట్లయింది. ప్రాంతీయ నేవిగేషన్ వ్యవస్థను దిగ్విజయంగా రోదసీలోకి పంపిన ఇస్రో తన ఖాతాలో మరో ఘనతను సొంతం చేసుకుంది. నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎస్ఎన్ఎస్ఎస్ -1)ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో బెంగుళూరులోని శాటిలైట్ సెంటర్లో రూపొందించారు. బరువు 1425 కిలోలు.

ఉపయోగాలు ఎన్ని..?

ఈ ఉపగ్రహం విలువైన సమాచారాన్ని దేశానికి అందించగలదు. విపత్తులు ఇంకా దాడులకు సంబంధించి భద్రతా బలగాలు ముందస్తుగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ శాటిలైట్ వాహనాలు, నౌకలు ఇంకా విమానాల గమనాన్ని ఎప్పటికప్పుడు కచ్చితంగా తెలుపుతుంది. ఈ తరహా పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న ఇతర దేశాలు కమ్యూనికేషన్ పరంగా మరింత ముందంజలో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో అంతరిక్ష పరిశోధకులు అవిశ్రాంతంగా పనిచేసి చోదక వ్యవస్థకు మార్గదర్శిగా ఉపయోగపడే స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఈ తొలి ఉపగ్రహాన్ని (ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఏ) విజయవంతంగా ప్రయోగించారు.

రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం

పిఎస్ఎల్వీ సి22 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని మోసుకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది. దీంతో మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని నిర్వహిస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్‌సహా శాస్త్రవేత్తల వదనాల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన దరహాసం చోటుచేసుకుంది. అందరిలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం

ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎ ఉపగ్రహం ఎత్తు1.50 మీటర్లు, వెడల్పు 1.58 మీటర్లు, బరువు 1425 కిలోలు..

రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం

ఈ ఉపగ్రహం విలువైన సమాచారాన్ని దేశానికి అందించగలదు. విపత్తులు ఇంకా దాడులకు సంబంధించి భద్రతా బలగాలు ముందస్తుగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ శాటిలైట్ వాహనాలు, నౌకలు ఇంకా విమానాల గమనాన్ని ఎప్పటికప్పుడు కచ్చితంగా తెలుపుతుంది.

రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం

రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం

రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం

రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం

రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం

రోదసీలోకి తొలి భారతీయ దిక్సూచి ఉపగ్రహం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot