వంటల బామ్మని ఇక చూడలేము

అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలియని బామ్మా తనదైన స్టైల్ లో వంటలు చేస్తూ భారత దేశంలోనే గాక ప్రపంచం నలుమూలల ఫాన్స్ ను చేసుకుంది 106 ఏళ్ళ మస్తానమ్మా.

|

అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలియని బామ్మ తనదైన స్టైల్ లో వంటలు చేస్తూ భారత దేశంలోనే గాక ప్రపంచం నలుమూలల ఫాన్స్ ను చేసుకుంది 106 ఏళ్ళ మస్తానమ్మా...బీబీసీ సైతం తన ఇంటర్వ్యూ కోసం వెతుకుంటూ వచ్చేలా చేసింది ఈ 106 ఏళ్ళ బామ్మ.... గుంటూరు జిల్లా కి చెందిన మస్తానమ్మ సోమవారం కాలం చెందారు...

 

గూగుల్ మ్యాప్స్ ద్వారా దొంగతనం చేస్తున్న హైటెక్ దొంగ, వింటే ఆశ్చర్యపోతారుగూగుల్ మ్యాప్స్ ద్వారా దొంగతనం చేస్తున్న హైటెక్ దొంగ, వింటే ఆశ్చర్యపోతారు

ఇంతకీ ఎవరు ఈ మస్తానమ్మా..?

ఇంతకీ ఎవరు ఈ మస్తానమ్మా..?

మస్తానమ్మ సొంతూరు గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని గుడివాడ గ్రామం.పదకొండేళ్ల వయసులోనే మస్తానమ్మ కు పెళ్లైంది. తన భర్త ఇరవైరెండేళ్లకే దూరమయ్యాడు. అప్పట్నుంచీ వ్యవసాయ కూలీగా చేస్తూ ఉన్న ఒక్క కొడుకుని పెంచింది. పొలం పనులకెళితే వచ్చే కూలి డబ్బులూ, వృద్ధాప్య పింఛనుతోనే పూరి గుడిసెలోనే ఒంటరిగా ఉంటుంది.

నానమ్మ చేతి వంటను రుచిచూసిన లక్ష్మణ్ కు ఒక ఆలోచన వచ్చింది....

నానమ్మ చేతి వంటను రుచిచూసిన లక్ష్మణ్ కు ఒక ఆలోచన వచ్చింది....

నానమ్మ చేతి వంటను రుచిచూసిన లక్ష్మణ్ కు ఒక ఆలోచన వచ్చింది. తన నానమ్మ వంటలను యూట్యూబ్‌లో పెడితే ఎలా ఉంటుంది అనుకున్నాడు.వెంటనే ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు.

‘కంట్రీ ఫుడ్స్’...
 

‘కంట్రీ ఫుడ్స్’...

2017లో ‘కంట్రీ ఫుడ్స్' పేరుతో యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించి తన నానమ్మ వంటలను పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు .

పుచ్చకాయ చికెన్‌కు...

పుచ్చకాయ చికెన్‌కు...

యూట్యూబ్ లో ‘కంట్రీ ఫుడ్స్' చానెల్స్ కి 1,217,556 సుబ్స్క్రైబ్ర్లు ఉన్నారు. మస్తానమ్మ చేసిన వంటల్లో పుచ్చకాయ చికెన్‌కు భారీ స్పందన వచ్చింది. ఇప్పటి వరకు యుట్యూబ్ లో ఆ వీడియోకు 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

 ఇతర దేశాలలో  కూడా  అభిమానులు...

ఇతర దేశాలలో కూడా అభిమానులు...

మస్తానమ్మ వంటలకు కేవలం భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా అభిమానులున్నారు. యూఎస్, యూకే, కొలంబియా, పాకిస్థాన్‌కు చెందిన ఎంతో మంది ఎన్ఆర్ఐలు మస్తానమ్మ వంటలను ఇష్టపడుతున్నారు. ఆమెకు బహుమతులు కూడా పంపారు.వారు పంపిన డబ్బు తోనే తన 106 పుట్టిన రోజు కూడా జరుపుకుంది.

 

 

 

 

 

Best Mobiles in India

English summary
India’s Oldest YouTuber And Our Favourite Chef Granny, 107-Yr-Old Mastanamma Passes Away.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X