ఇండియాలోని టాప్ 5 హ్యాకర్స్ గురించి తెలుసా ?

By Anil

  ప్రపంచ ఆన్ లైన్ బద్దత్రనే ప్రశ్నిస్తున్నఏకైక పదం హ్యాకింగ్.హ్యాకింగ్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వైట్ హ్యాట్ హ్యాకింగ్ రెండవది బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్.చట్ట వ్యతిరేకంగా కేవలం తమ సొంత ప్రయోజనాలు కోసం హ్యాకింగ్ చేసేవారిని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు.వీరు చేసే హ్యాకింగ్ వల్ల ప్రజలకు నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు.ఇలాంటి వారిని కనుక్కోవడానికి వీరి బారి నుంచి వివిధ సంస్థల సమాచారాన్ని కాపాడడానికి ఉపయోగపడేవారీ ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ వీరు చేసే ప్రతి పని ప్రజలకు ఏదో ఒక రకంగా ఉపయోగపడేల ఉంటుంది.ఈ శీర్షిక లో భాగంగా ఇండియాలో ఉన్న టాప్ 5 ఎథికల్ హకెర్స్ గురించి మీకు తెలుపుతున్నాము.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Manan Shah

  వడోదరకు చెందిన Manan Shah డ్రాప్ అవుట్ విద్యార్థి. తన 16 సంవత్సరాల వయసులోనే Windows Black Xp అనే సాఫ్ట్ వేర్ ను 9 వెర్షన్లలో తయారు చేసాడు. ఈ సాఫ్ట్ వేర్ ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 లక్షలు మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందుకు గాను limca బుక్ అఫ్ రికార్డ్స్ లో కూడా స్థానాన్ని సంపాదించాడు. తన 18 సంవత్సరాల వయసులో ఇండియన్ ఫాస్టెస్ట్ ఓవర్ క్లాకింగ్ PC ను తయారు చేసాడు.20 సంవత్సరాల వయసుకే పేస్ బుక్,గూగుల్,డ్రాప్ బాక్స్,నోకియా ,పే పల్ ,యాపిల్,మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు చెందిన అప్లికేషన్స్ లలో లోపాలు గుర్తించి వాటి సమాచారాన్ని వాటి సంస్థలకు అందించాడు . తన 21 సంవత్సరాల వయసులో Avalance గ్లోబల్ సొల్యూషన్స్ అనే కంపెనీ ను స్థాపించి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 500 కు పైగా కంపెనీలకు సైబర్ సెక్యూరిటీస్ సేవలను అందిస్తున్నాడు.

  Kanishk Sajnani

  రెండు సంవత్సరాల క్రిందట AIR INDIA వెబ్ సైట్ లోని చిన్న లోపం వల్ల ఢిల్లీ నుండి Sanfransisco కు ఉండే లక్ష నలబై వేల రూపాయల ఫ్లైట్ టికెట్ ను కేవలం ఒక్క రూపాయి కె బుక్ చేసాడు. అలా AIR INDIA కంపెనీ లోని వెబ్ సైట్ లోపాలను ఆ కంపెనీ ప్రతినిధులకు ఈ మెయిల్ ద్వారా తెలియజేసాడు. విషయం తెలుసుకున్న AIR INDIA కంపెనీ తమ కంపెనీ వెబ్ సైట్ లోని లోపాలను సరి చేసింది.అంతే కాకుండా ఇతనికి తమ కంపెనీ యొక్క ఐటీ డిపార్ట్మెంట్ లో ఇంటర్న్ షిప్ కూడా ఆఫర్ చేసింది. ఆ తరువాత Spice Jet యొక్క వెబ్ సైట్ ను హ్యాక్ చేసి అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ కు ఉండే ఐదు వేళా రూపాయల టికెట్ ను కేవలం పది రూపాయలకే బుక్ చేసాడు. Spice Jet కంపెనీ వెబ్ సైట్ లోని లోపల గురించి ఆ కంపెనీ ప్రతినిధులకు మెయిల్ చేసిన వారి నుంచి సరైన స్పందన రాలేదు దీంతో ఇతను బుక్ చేసిన టికెట్ ను క్యాన్సిల్ చేసాడు విచిత్రం ఏంటంటే టికెట్ ను క్యాన్సిల్ చేసుకునేందుకు గాను Spice Jet కంపెనీ ఇతనికి రెండు వేల రూపాయిల రిఫండ్ అమౌంట్ ను కూడా తిరిగి ఇచ్చింది. ఆ తరువాత క్లియర్ ట్రిప్ వంటి ఎన్నో రకాల వెబ్ సైట్ లను హ్యాక్ చేసి ఫ్లైట్ hotels లాంటివి ఈనో ఫ్రీ గా బుక్ చేసాడు. ఇలా కేవలం సరదా కోసం అనేక వెబ్ సైట్ లను హ్యాక్ చేసి వాటిలో ఉన్న లోపాలను వాటి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళవాడు.

  Ankith Fadia

  ఎథికల్ హ్యాకర్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు కలిగి 27 సంవత్సరాలకే హ్యాకింగ్ పై 16 పుస్తకాలను రాసి Mtv లో యూత్ కి ఇంటర్నెట్ గురించి టిప్స్ అందించే షో కి హోస్ట్ గా పని చేసిన ఘనత ఇతనిది. 10 సంవత్సరాల వయసులో ఇతని తల్లితండ్రులు ఇతనికి కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు. ఆలా కంప్యూటర్ పై ఏర్పడిన ఇష్టం 14 సంవత్సరాలకే ఎథికల్ హ్యాకింగ్ పై పుస్తకాలు రాసే వరకు తీసుకొని వెళ్ళింది. 16 సంవత్సరాలే పోలీస్ డిపార్ట్మెంట్ కు ట్రైనీ గా మారాడు. 18 సంవత్సరాలకే సొంత ఎథికల్ హ్యాకింగ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించి ఇప్పటి వరకు 25,000 మందిని ఎథికల్ హ్యాకింగ్ నిపుణులుగా తీర్చిదిద్దాడు. చైనా,కెన్యా,మలేషియా,సౌత్ ఆఫ్రికా లతో పాటు మరో 25 దేశాలలో 1000 కు పైగా సమావేశాల్లో హ్యాకింగ్ పై ప్రసంగించాడు. ప్రస్తుతం విప్రో,సోనీ ఇండియా ,కాగ్నిజంట్,SAP వంటి అనేక రకాల కార్పొరేట్ కంపెనీలకు సలహాదారుడిగా పనిచేస్తున్నాడు.

  Trishneet Arora

  ఇతను ఒక కంపెనీకు CEO.పంజాబ్ సెక్యూరిటీ అకాడమీ కీ సలహాదారుడు.చాలా మంది వ్యాపారసతులకి మార్గదర్శి. కొన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకి కన్సల్టెంట్. ఇండియా లోనే టాప్ ఎథికల్ హ్యాకర్స్ లో ఒకడు. తన 14 సంవత్సరాల వయసులో తొలి సారి తన తండ్రి యొక్క జి మెయిల్ ను హ్యాక్ చేసాడు అలా తన 16 సంవత్సరాల వయసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పాఠాలు చెప్పాలంటూ ప్రభుత్వం ఆహ్వానం ఇచ్చింది. ఎథికల్ హ్యాకింగ్ పై విపరీతమైన పట్టు ఉన్న ఇతను 21 సంవత్సరాలకే హ్యాకింగ్ పై 3 పుస్తకాలను కూడ రాసాడు. 21 సంవత్సరాల వయసుకే ఇతను TAC సెక్యూరిటీ సొల్యూషన్ అనే కంపెనీ ను స్థాపించాడు.ప్రస్తుతం 500 కు పైగా కంపెనీలకు క్లయింట్ గా పని చేస్తున్నాడు.

  Pranav Mistry

  sixth సెన్స్ టెక్నాలజీ తో ప్రపంచన్నే ఆశ్చర్య పరిచిన భారతీయుడు ఈ Pranav Mistry . ప్రసిద్ధ MIT మీడియా ల్యాబ్ లో PHD పూర్తి చేసిన ఇతను మొదట్లో మైక్రో సాఫ్ట్ ,గూగుల్,CMS,UNISCO,జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సంస్థలలో పని చేసాడు. ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ ఎలక్ట్రానిక్ కంపెనీ అయినటువంటి Samsung లో గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాడు. ఇతను తయారు చేసిన ఒక చిన్న డివైస్ ను మేడలో ధరిస్తే చాలు మీ చేతి వేల్లనే మౌస్ గా మీ ఎదురుగా ఉన్న ఏ వస్తువు నైనా కంప్యూటర్ స్క్రీన్ గా మార్చుకోవచ్చు. ఒక చిన్న పేపర్ ను తీసుకొని మీ చేతి వేల్లను కాగితం పై పెడితే ఆ కాగితమే కంప్యూటర్ గా మారిపోతుంది. అదే కాగితం పై మీరు గేమ్స్ ఆడుకోవచ్చు సినిమాలు చూడొచ్చు . అలాగే మీరు న్యూస్ పేపర్ చదువుతునప్పుడు ఎప్పటివో కాకుండా ప్రస్తుతం జరుగుతున్న విషయాలను లైవ్ లో చూడవచ్చు. మీకు ఎదురుగా నిలపడని వ్యక్తి యొక్క సోషల్ మీడియా అకౌంట్లతో పాటు అతనికి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీరు పొందవచ్చు. ఇలా ఎన్నో రకాలైన పనులను ఒక చిన్న డివైస్ ద్వారా జరిగిపోతాయి. కంప్యూటర్ ను కాగితం పై తీసుకొచ్చిన ఘనత Pranav Mistry ది. మొదటిలో ఈ టెక్నాలజీ నీ పేస్ బుక్ కంపెనీ 200 కోట్లకు కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. కానీ Pranav ఫేస్ బుక్ ను కాదని ఈ టెక్నాలజీ ప్రజలందిరికి అందుబాటులో ఉండేలా ఓపెన్ సోర్స్ లా ఉంచాలని నిర్ణయించుకున్నాడు.ప్రస్తుతం ఈ టెక్నాలజీ ను NASA లో ఉపయోగిస్తున్నారు

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  INDIA'S TOP 5 MIND BLOWING YOUNG HACKERS.To Know More About Visit telugu.gizbot.com
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more