Just In
- 8 hrs ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 9 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 14 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 1 day ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Movies
Writer Padmabhushan Day 2 collections రెండో రోజు పెరిగిన కలెక్షన్లు.. సుహాస్ మూవీకి భారీ రెస్పాన్స్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
భారత్‌లో Smartwatchల క్రేజ్ మామూలుగా లేదు.. దిమ్మదిరిగేలా సేల్స్!
గ్లోబల్ Smartwatch మార్కెట్లో భారత్ అరుదైన రికార్డు సృష్టించింది. గ్లోబల్ Smartwatch మార్కెట్లో భారత్ రెండో అతి పెద్ద మార్కెట్‌గా ఆవిర్బవించిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. Fire-Boltt మరియు Noise వంటి భారతీయ బ్రాండ్‌ల నుండి బలమైన వృద్ధి భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా Smartwatch లకు రెండవ అతిపెద్ద మార్కెట్‌గా మార్చిందని పేర్కొంది. ఇక బ్రాండ్‌ల పరంగా చూస్తే.. Apple కంపెనీ అత్యధిక మార్కెట్ వాటా కలిగిన బ్రాండ్‌గా అగ్ర స్థానంలో ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది.

2022 ఏడాది రెండో త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్‌వాచ్ మార్కెట్ వాటా 13 శాతం పెరిగింది. అయితే, Apple మార్కెట్ వాటాలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ.. ఆ కంపెనీయే అగ్రస్థానంలో ఉంది. మరోవైపు, సామ్‌సంగ్ కంపెనీ కూడా బలమైన వృద్ధిని సాధించినట్లు నివేదిక పేర్కొంది. సామ్‌సంగ్ ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ వాచ్‌ల కోసం రెండవ అతిపెద్ద మార్కెట్ వాటా కలిగి ఉన్నట్లు వెల్లడించింది.

స్మార్ట్‌వాచ్‌ల సెగ్మెంట్‌లో భారతదేశం రెండవ అతిపెద్ద మార్కెట్:
కౌంటర్‌పాయింట్ గ్లోబల్ స్మార్ట్‌వాచ్ మోడల్ షిప్‌మెంట్ మరియు రెవిన్యూ ట్రాకర్ Q2 2022 వెల్లడించిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌లు బాగా వృద్ధి చెందాయి. ముఖ్యంగా మార్కెట్ లో లీడింగ్‌లో ఉన్న Noise మరియు Fire-Boltt బ్రాండ్‌లు భారతదేశంలో బలమైన పనితీరుతో మంచి మార్కెట్ బేస్‌ను పొందాయి. ఫలితంగా ఈ బ్రాండ్‌లు గ్లోబల్ స్మార్ట్‌వాచ్ షిప్‌మెంట్‌ల జాబితాలో టాప్ 5 లోకి ప్రవేశించాయి.
Noise మరియు Fire-Boltt వంటి బ్రాండ్‌లు అనేక సరసమైన(అఫర్డబుల్) స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేశాయి. అంతేకాకుండా, ఆయా కంపెనీలు సరైన పంపిణీ వ్యూహాలను అనుసరించాయి. తద్వారా భారతీయ స్మార్ట్‌వాచ్ మార్కెట్ భారీ వృద్ధిని సాధించింది. బోట్ మరియు డిజో వంటి ఇతర బ్రాండ్‌లు కూడా భారతదేశంలో ఈ విభాగంలో కొంత విజయాన్ని సాధించాయి. చాలా మంది వాచ్ కొనుగోలుదారులు సాంప్రదాయ చేతి గడియారాల కంటే, రూ.5,000 లోపు లభించే స్మార్ట్‌వాచ్‌లను ఎంచుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది.

Apple మరియు Samsung ముందంజలో:
యాపిల్ స్మార్ట్‌వాచ్ మార్కెట్ వాటాలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, ఆ కంపెనీ దాని ప్రీమియం ఆపిల్ వాచ్ సిరీస్‌లో బలమైన అమ్మకాలు నమోదు చేసింది. సుదీర్ఘమైన మార్జిన్‌లతో 29.3 శాతం మార్కెట్ వాటాతో గ్లోబల్ స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో నంబర్ వన్ బ్రాండ్‌గా కొనసాగుతోంది. ముఖ్యంగా, సామ్సంగ్ 9.2 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉండగా.. హువావే 6.8 శాతంతో మూడవ స్థానంలో కొనసాగుతోంది.
Noise మరియు Fire-Boltt మొదటి ఐదు లో స్థానాలు దక్కించుకున్నాయి. అయితే Xiaomi, Amazfit మరియు గార్మిన్ వంటి బ్రాండ్‌లు మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. నాయిస్ ఇటీవల భారతదేశంలో ColorFit Pro 4 మరియు Pro 4 Max స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. దీని ధర రూ.3,499 మరియు వరుసగా రూ.3,99 గా ఉన్నాయి. ఫైర్-బోల్ట్ కూడా గత కొన్ని నెలలుగా క్రమం తప్పకుండా సరసమైన ధరల్లో స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేస్తోంది.

Noise Colorfit Pro 4 Max స్పెసిఫికేషన్స్:
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 మాక్స్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 240×258 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.80-అంగుళాల TFT LCDతో వస్తుంది. ఈ డిస్ప్లే 40Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది మీరు కొంచెం నెమ్మదిగా ఉన్నట్లు కనుగొనవచ్చు, కానీ అది ధరను సమర్థిస్తుంది. Noise ColorFit Pro 4 Max యొక్క డిస్‌ప్లే Noise ColorFit 3 కంటే 33 శాతం పెద్దదని నాయిస్ పేర్కొంది. Noise ColorFit Pro 4 Max 150కి పైగా ఎంపికలతో మరియు అనుకూలీకరణకు మద్దతుతో వాచ్ ఫేస్‌లతో వస్తుంది. నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మాక్స్ ఇండియాలో రూ.3,999 ధర వద్ద లభిస్తుంది.

Noise Colorfit Pro 4:
నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మోడల్ బ్లూటూత్-కాలింగ్ స్మార్ట్‌వాచ్ కొంచెం సరసమైన ధరను కలిగి ఉంటుంది. దీని ధర రూ.3,499 కలిగి ఉంటుంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 356×400 పిక్సెల్ మరియు మెరుగైన 60Hz రిఫ్రెష్ రేట్‌తూ కూడిన 1.72-అంగుళాల TFT LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ColorFit Pro 3 యొక్క డిస్‌ప్లే పరిమాణం కంటే 25 శాతం అధికంగా ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండడమే కాకుండా నీరు మరియు ధూళి నిరోధకతకు IP68 నిరోధకతను కలిగి ఉంటాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470