డౌన్‌లోడ్‌లలో రికార్డు సృష్టిస్తున్న షేర్‌చాట్ యాప్...
ఇండియాలో ఇప్పుడు మన దేశం యొక్క యాప్ ల హవా నడుస్తున్నది. చైనా యొక్క 59 యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం ప్రకటించినప్పటి నుండి కేవలం ఒక గంట వ్యవధిలోనే 5 లక్షల డౌన్‌లోడ్‌లను చేరుకున్నాయి. అలాగే కేవలం ఒక రోజులోనే 15 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను నమోదు చేసినట్లు ఇండియన్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ తెలిపింది.

ఇండియా సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌లు
ఇండియాలో ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ షేర్‌చాట్ 15 భారతీయ భాషల్లో లభ్యమవుతుంది. అలాగే ఈ ప్లాట్‌ఫామ్‌లో 60 మిలియన్ల మంది యూజర్లు యాక్టివ్ గా ఉన్నారని కూడా తెలిపింది. చైనా యాప్‌లను నిషేధించే చర్యకు మద్దతుతో 1 లక్షలకు పైగా పోస్టులను షేర్‌చాట్ లో పోస్ట్ చేసినట్లు కంపెనీ తెలిపింది. అలాగే వీటిని 1 మిలియన్లకు పైగా వినియోగదారులు ఈ పోస్టులను ఇష్టపడ్డారు. అలాగే వాట్సాప్‌లో కూడా అర మిలియన్లకు పైగా షేర్లు వచ్చాయి.

షేర్‌చాట్ డౌన్‌లోడ్‌లు
వినియోగదారులు ప్రస్తుతం 1 బిలియన్ నెలవారీ వాట్సాప్ షేర్లతో ప్రతిరోజూ 25 నిమిషాలకు పైగా షేర్‌చాట్ ప్లాట్‌ఫామ్‌లో గడుపుతున్నారు. అధికారిక తాజా డేటా ప్రకారం షేర్‌చాట్ యాప్ 15 భారతీయ భాషల్లో ఉపయోగించడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పటికి దీనిని 150+ మిలియన్ల మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఇది 60 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులలను కలిగి ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

చింగారి యాప్ డౌన్‌లోడ్‌లు
భారత ప్రభుత్వం చైనా యాప్ లపై నిషేధం విధించిన తరువాత లాభం పొందిన భారతీయ ఇంటర్నెట్ సంస్థ షేర్‌చాట్ ఒకటే కాదు. దీనితో పాటుగా చాలా యాప్ లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా టిక్‌టాక్‌కు ప్రత్యర్థిగా ఉన్న చింగారి యాప్ గంటకు 100,000 డౌన్‌లోడ్‌లను నమోదు చేసినట్లు పేర్కొంది.

ఇండియా ఇంటర్నెట్ బేస్
భారతీయ కంపెనీలు కూడా తమ యూజర్‌బేస్‌ను పెంచుకోవడానికి మరియు స్థానిక ప్రత్యామ్నాయాలను అందించడానికి ఇదే గొప్ప అవకాశంగా ఉన్నాయి. భారతీయ స్టార్టప్ కమ్యూనిటీ వారి ప్లానింగ్ బోర్డులకు బలమైన సాంకేతిక మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఇదే సరైన సమయం. ఇది వినియోగదారులకు సురక్షితమైన ఆన్‌లైన్ ఉనికిని అందించగలదు అని భావిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో మెరిట్‌పై పోటీపడటానికి సన్నధం కావాలి అని ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ తెలిపారు.


Click it and Unblock the Notifications








