2030 నాటికి భార‌త Fiber Broadband యూజ‌ర్లు @110 మిలియ‌న్లు!

|

భార‌త్‌లో రోజురోజుకూ Fiber Broadband వినియోగ‌దారులు పెరుగుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టు వివిధ కంపెనీల బ్రాడ్‌బ్యాండ్ సేవ‌లు కూడా దేశ‌వ్యాప్తంగా విస్త‌రిస్తూనే ఉన్నాయి. 5G నెట్‌వర్క్ విడుద‌ల‌తో సంబంధం లేకుండా, Fiber Broadband ప్రయోజనాలను వినియోగదారులు అందుకుంటున్నారు. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో భారతదేశ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైన‌ప్ప‌టికీ.. ఈ ద‌శాబ్దం చివ‌రి నాటికి భార‌త్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో వేగ‌వంత‌మైన వృద్ధిని సాధిస్తుంద‌ని యూఎస్‌కు చెందిన విశ్లేష‌కుడు ఒక‌రు వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న విశ్లేష‌ణ‌కు సంబంధించి పాయింట్ టాపిక్ అనే నివేదిక‌లో పేర్కొన్నారు.

 
2030 నాటికి భార‌త Fiber Broadband యూజ‌ర్లు @110 మిలియ‌న్లు!

భార‌త్‌లో Fiber Broadband ప్ర‌యాణం ఇటీవ‌లె ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ.. ఈ ద‌శాబ్దం చివ‌రి నాటికి భార‌త్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో వేగ‌వంత‌మైన వృద్ధిని సాధిస్తుంద‌ని నివేదిక పేర్కొంది. దేశంలోని ప్ర‌తి మూల‌కు ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవ‌లు విస్తరించ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని అంచ‌నా వేసింది. 2030 నాటికి భారతదేశ ఫైబర్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 110 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇంకా ఆ నివేదిక‌లో యూఎస్‌కు చెందిన‌ విశ్లేషకుడు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్‌లో ఇండోనేషియా కూడా పెద్ద లాభాలను పొందగలదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

భారతదేశంలో ఫైబ‌ర్ స‌బ్‌స్క్రైబ‌ర్స్ ట్రాజెక్ట‌రీ 2025లో పుంజుకుంటుంద‌ని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా భార‌త్ 2028 నాటికి U.S (యునైటెడ్ స్టేట్స్) తో స‌మాన స‌బ్‌స్క్రైబ‌ర్ సంఖ్య‌ను పొందుతుంద‌ని భావిస్తున్నట్లు నివేదిక వెల్ల‌డించింది. మ‌రోవైపు, 2030 నాటికి భారతదేశ ఫైబర్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 110 మిలియన్లకు చేరుకుంటుందని నివేదిక‌ అంచనా వేసింది. చైనా అంచ‌నాలు చూసుకుంటే (523 మిలియన్ ఫైబర్ సబ్‌స్క్రైబర్లు) ఉండ‌గా, దానితో పోలిస్తే భార‌త‌ గణాంకాలు ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయనే విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని నివేదిక వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

అదే సమయంలో, ప్ర‌స్తుతం U.S. దాదాపు 80 మిలియన్ల ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ చందాదారులను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది, ఇండోనేషియా 60 మిలియన్ల చందాదారుల‌ను కలిగి ఉండ‌గా, బ్రెజిల్ మ‌రియు జపాన్ 40 మిలియన్ల ఫైబర్ సబ్‌స్క్రైబర్‌లతో ఐదవ స్థానం కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు నివేదిక పేర్కొంది.

2030 నాటికి భార‌త Fiber Broadband యూజ‌ర్లు @110 మిలియ‌న్లు!

భార‌త్‌లో ప్ర‌తి మూల‌కు ఫైబ‌ర్ అమ‌లుకు కేంద్ర ప్ర‌య‌త్నాలు:
భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం టెల్కోలు మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లు (IPలు) ఫైబర్‌ను వేగంగా అమ‌లు చేయ‌డానికి ప్రతి రాష్ట్రంలో రైట్-ఆఫ్-వే (RoW) నియమాలను సవరించడానికి ప్రయత్నిస్తోంది. వాస్త‌వానికి భార‌త్‌లో పాయింట్ టాపిక్ నివేదిక‌లు సూచించిన డేటా కంటే బ్రాడ్‌బ్యాండ్ వినియోగ‌దారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చు. కానీ, అది ఎంత‌మేర అనేది.. ప్రభుత్వం, అలాగే టెలికాం రంగం పని చేసే విధానంపై ఆధారపడి ఉంటుందని అంతా భావిస్తున్నారు.

భార‌త్‌లో ఇప్ప‌టికే జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌ల మార్కెట్ లో పురోగతి ఖచ్చితంగా ఉంది. ఇవే కాకుండా దేశంలో అనేక ప్రాంతీయ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPలు) కూడా ఉన్నాయి. ఎక్సైటెల్‌, ACT వంటి కంపెనీలు గత కొన్ని సంవత్సరాలలో భారీగా వృద్ధి చెందాయి.

2030 నాటికి భార‌త Fiber Broadband యూజ‌ర్లు @110 మిలియ‌న్లు!
ఇప్ప‌టికే ప్ర‌స్తుతం దేశంలో ప‌లు ISPలు ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవ‌ల్ని అందిస్తున్నాయి. అందులో 200 Mbps వేగంతో ISPలు అందించే బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు కొన్ని ఉన్నాయి. వాటిపై ఓ సారి లుక్కేద్దాం.
Airtel ఎక్స్‌స్ట్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్:
ఇండియాలోని బ్రాడ్‌బ్యాండ్ విభాగంలోని సేవల విషయానికి వస్తే మార్కెట్లో ఎయిర్‌టెల్ బెస్ట్ ఆఫర్లను అందిస్తున్న ప్రముఖమైన పోటీదారుల‌లో ఒకటిగా ఉంది. ఎయిర్‌టెల్ తన ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ ద్వారా కొన్ని ఉచిత OTT యాక్సెస్‌లతో కొన్ని ప్లాన్‌లను అందిస్తుంది. వీటిలో ముఖ్యమైనది 'ఎంటర్‌టైన్‌మెంట్' ప్యాక్ 200 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో నెలకు రూ.999 ధర వద్ద అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 3.3TB లేదా 3300GB నెలవారీ ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటాను పొందుతారు. ఎయిర్‌టెల్ తన ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో 'ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్'ని కూడా అందిస్తుంది. ఈ సందర్భంలో వింక్ మ్యూజిక్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ యొక్క బెస్ట్ సెల్లింగ్ ప్లాన్‌లలో ఇది కూడా ఒకటి.

BSNL 200 Mbps ప్లాన్
ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL సంస్థ దాని భారత్ ఫైబర్ కనెక్షన్ ద్వారా హై-స్పీడ్ కనెక్టివిటీతో ఫైబర్ ప్రీమియం ప్లస్‌ ప్లాన్‌ను అందిస్తుంది. BSNL యొక్క ఈ ఫైబర్ ప్రీమియం ప్లస్ ప్యాక్ నెలకు రూ.1,277 ధరతో లభిస్తుంది. ఇది 200 Mbps వేగంతో 3300GB డేటాను అందిస్తుంది. దీని తరువాత డేటా స్పీడ్ ని 15 Mbpsకి తగ్గించబడుతుంది. అయితే BSNL టెల్కో నుండి లభించే ఈ సూపర్‌స్టార్ ప్రీమియం ప్లస్ ప్యాక్ ఎటువంటి OTT సభ్యత్వాలను అందించదు. అయినప్పటికీ వినియోగదారులు వారి మొదటి నెల అద్దెపై 90% వరకు అంటే రూ.500 వరకు తగ్గింపును పొందవచ్చు.

Best Mobiles in India

English summary
India to Have Around 110 Million Fiber Broadband Subscribers by 2030

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X