ఇండియా vs ఇంగ్లాండ్ T20 నేటి మ్యాచ్ ను ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమ్ పద్దతిలో చూడడం ఎలా?
ఇండియా vs ఇంగ్లాండ్ T20 సిరీస్ యొక్క మొదటి మ్యాచ్ మార్చి 12 శుక్రవారం ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు భారతదేశంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో మరియు టెలివిజన్‌లో చూడవచ్చు. ఇండియా మరియు ఇంగ్లాండ్ రెండూ కూడా తమ యొక్క తుది జట్లను ప్రకటించాయి. మార్చి 12 నుండి మార్చి 20 వరకు జరిగే ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. ఇండియా ఇంగ్లాండ్ T20 సిరీస్ యొక్క అన్ని మ్యాచ్‌లు ఒకే వేదిక మీద అది కూడా అహ్మదాబాద్ మోటెరాలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నాయి. టీవీలలో చూడడం ఇష్టంలేని వారు ఆన్‌లైన్‌లో T20 మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమ్‌లో చూడడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇండియా ఇంగ్లాండ్ T20 సిరీస్ పూర్తి షెడ్యూల్
మ్యాచ్ 1 - మార్చి 12, 6:30 PM IST
మ్యాచ్ 2 - మార్చి 14, 6:30 PM IST
మ్యాచ్ 3 - మార్చి 16, 6:30 PM IST
మ్యాచ్ 4 - మార్చి 18, 6:30 PM IST
మ్యాచ్ 5 - మార్చి 20, 6:30 PM IST
ఇండియా T20 జట్టు సభ్యులు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, KL రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి సుందర్, రాహుల్ తివాటియా, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్.
ఇంగ్లాండ్ T20 జట్టు సభ్యులు
ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్ .

ఇండియా vs ఇంగ్లాండ్ T20 సిరీస్ లైవ్ స్ట్రీమ్ చూసే విధానం
ఇండియా ఇంగ్లాండ్ T20 సిరీస్ యొక్క మ్యాచ్‌లు అన్ని కూడా టీవీలలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ 1 HD, SD ఛానెల్‌లు మ్యాచ్‌లను ఇంగ్లీష్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. అలాగే ఈ మ్యాచ్‌లు హిందీ, కన్నడ, తమిళం మరియు తెలగు భాషలలో ప్రాంతీయ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. అలాగే ఇండియా ఇంగ్లాండ్ T20 సిరీస్‌ను ఆన్‌లైన్ పద్దతిలో డిస్నీ + హాట్‌స్టార్‌తో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్లు మరియు స్మార్ట్ టీవీల్లో ప్రత్యక్షంగా చూడవచ్చు. అయితే దీని కోసం వినియోగదారులకు డిస్నీ + హాట్‌స్టార్ VIP చందా అవసరం ఉంటుంది. ఈ చందా సంవత్సరానికి 399 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఒక సంవత్సరం సభ్యత్వం తీసుకుంటే కనుక ఈ సంవత్సరంలో జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్ లను మరియు సినిమాలను కూడా మీరు డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. మార్చి 23 మరియు మార్చి 28 మధ్య జరిగే ఇండియా ఇంగ్లాండ్ వన్డే సిరీస్ మరియు ఆసియా కప్ మరియు ఈ ఏడాది చివర్లో జరగాల్సిన T20 ప్రపంచ కప్ కూడా చూడవచ్చు.


Click it and Unblock the Notifications








