వాట్సప్‌కి కేంద్ర ప్రభుత్వం షాక్,సర్కారీ వాట్సప్ వచ్చేస్తోంది

By Gizbot Bureau
|

వాట్సప్‌కు ధీటుగా కేంద్రప్రభుత్వం సర్కారీ వాట్సప్ పేరుతో సొంతంగా ఓ వేదికను తయారుచేయనుంది. వాట్సప్ తరహాలో సొంతంగా సమాచారాన్ని పంచుకునే వేదికను రూపొందించాలని కేంద్రం సీరియస్ గా ఆలోచిస్తోంది.

India wants to build its own WhatsApp

సేఫ్ అండ్ సెక్యూర్ అయిన సొంత చాటింగ్‌ ప్లాట్‌ఫారం తీసుకురావాలని పట్టుదలగా ఉంది. తొలుత దీనిని ప్రభుత్వ విభాగాలు సమాచారం పంచుకునేందుకు వాడాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తున్నారు. ఇదే జరిగితే ఇండియాలో వాట్సప్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు సెలవిస్తున్నారు.

హువాయి కంపెనీపై అమెరికా నిషేధం

హువాయి కంపెనీపై అమెరికా నిషేధం

ప్రభుత్వ వాట్సప్ తీసుకురావాలనే ఆలోచన రావడానికి కారణం చైనాకు చెందిన హువాయి కంపెనీపై అమెరికా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా అలర్ట్ అయింది. ఈ మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ లోభాగంగా సురక్షితమైన సొంత చాటింగ్‌ ప్లాట్‌ఫామ్ రూపొందించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు హువాయిను బ్యాన్ చేయాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది.

సొంత వాట్సప్‌

సొంత వాట్సప్‌

అమెరికా ఆంక్షల వల్ల ఆ కంపెనీకి, ఫోన్లకు అమెరికా కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ను ఆపేశాయి. భవిష్యత్ లో ఏ కారణంతో అయినా మన దేశంలో అమెరికా కంపెనీల నెట్‌వర్క్‌లను ఆపేయమని ఆ ప్రభుత్వం ఆదేశించవచ్చని అధికారులు తెలిపారు. అదే జరిగితే మన దేశంలో చాటింగ్‌ ప్లాట్‌ఫారాలన్నీ నిలిచిపోతాయి. ఆ ప్రమాదం రాకుండా చూడటానికే సొంత వాట్సప్‌ను అభివృద్ధి చేయనున్నామని ప్రభుత్వ అధికారులు వివరించారు.

 డేటా లోకలైజేషన్‌

డేటా లోకలైజేషన్‌

సర్కారీ వాట్సప్‌ వచ్చాక అధికారిక సమాచారాన్ని, డేటాను పంపేందుకు జీ-మెయిల్, వాట్సప్‌లను వాడొద్దని అధికారులకు, ప్రభుత్వ సిబ్బందికి సూచిస్తామన్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం వాట్సప్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. మన దేశానికి చెందిన డేటాను మన దేశంలోనే భద్రపరచాలని(డేటా లోకలైజేషన్‌) పట్టుబడుతోంది. దాన్ని అమెరికా కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి.

100 శాతం భారత దేశంలోనే

100 శాతం భారత దేశంలోనే

ఈ సర్కారీ వాట్పాప్‌ ద్వారా పంపే సమాచారం, డేటా చోరీ అయ్యే అవకాశం ఉండదంటున్నారు అధికారులు. అంతేకాదు ఈ సమాచారాన్ని 100 శాతం భారత దేశంలోనే భద్రపరుస్తామని అధికారులు తెలిపారు. సర్కారీ వాట్సాప్‌ వచ్చాక అధికారిక సమాచారాన్ని, డేటాను పంపేందుకు జీ-మెయిల్, వాట్సాప్‌తదితర యాప్‌లను వాడొద్దని అధికారులకు, ప్రభుత్వ సిబ్బందికి సూచిస్తామన్నారు.

ఫ్రాన్స్ దేశం టి చాప్‌ అనే యాప్‌

ఫ్రాన్స్ దేశం టి చాప్‌ అనే యాప్‌

ఈ సంవత్సరం ప్రారంభంలో వాట్సప్ , టెలిగ్రామ్ వంటి యాప్‌లకు ప్రత్యామ్నాయంగా అంతర్గత ప్రభుత్వ సమాచార మార్పిడి కోసం ఫ్రాన్స్ దేశం టి చాప్‌ అనే యాప్‌ను లాంచ్‌ చేసింది. ఈ యాప్‌లో ముఖ్యమైన లక్షణాలలో ఒకటి, దాని డేటా మొత్తం దేశంలోనే సురక్షితంగా ఉంచడం. అయితే బాప్టిస్ట్ రాబర్ట్ (ఇలియట్ ఆండర్సన్) అనే భద్రతా పరిశోధకుడు ఈ యాప్‌లో లోపాన్ని కనుగొన్నారు. మరి ఈ విషయంలో కేంద్రం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

కేంద్రం పట్టుదల

కేంద్రం పట్టుదల

ఏదేమైనా మన దేశానికి చెందిన డేటాను మన దేశంలోనే భద్రపరచాలని(డేటా లోకలైజేషన్‌) కేంద్రం పట్టుదలగా ఉంది. ఈ మేరకు డేటా లోకలైజేషన్‌ నిబంధనలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టతనిచ్చింది. పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటింగ్‌ సంస్థలు (పీఎస్‌వో) చెల్లింపుల లావాదేవీల డేటా మొత్తం భారత్‌లోని సిస్టమ్స్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Best Mobiles in India

English summary
India wants to build its own WhatsApp for govt communications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X