టెక్ పరిశ్రమలో CEOగా రాణిస్తున్న 10 మంది భారతీయులు

|

గ్లోబల్ టెక్నాలజీ ల్యాండ్‌స్కోప్‌లో దశాబ్దాలుగా భారతీయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మెషినరీ రన్నింగ్ టెక్నాలజీలలో భారతీయ ఐటి ప్రోస్ ఒక ముఖ్యమైన విషయం. వాస్తవానికి ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ సంస్థలలో మొదటి రెండు స్థానాలలో ఉన్న గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ యొక్క CEOలుగా భారతీయ సంతతికి చెందిన వారు నేతృత్వం వహించడం గమనార్హం.

CEO
 

ఈ రెండింటితో పాటు ప్రపంచంలో మరికొన్ని చెరగని ముద్ర వేసుకున్న టెక్ పరిశ్రమలో మరికొందరు CEOగా రాణిస్తున్నారు. వారు ఎవరు? CEO గా ఉన్న కంపెనీ యొక్క వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

1. సుందర్ పిచాయ్‌ CEO, Alphabet

1. సుందర్ పిచాయ్‌ CEO, Alphabet

భారతదేశంలో జన్మించిన సుందర్ పిచాయ్‌ ఆగస్టు 10, 2015 న గూగుల్ CEOగా ఎంపిక అయ్యాడు. డిసెంబర్ 2019 లో అతను అదనంగా ఆల్ఫాబెట్ యొక్క CEO గా కూడా బాధ్యతలు తీసుకున్నాడు. ఆధిపత్య క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ను ప్రారంభించటానికి అతను బాధ్యత వహిస్తాడు. 47 ఏళ్ల సుందర్ పిచాయ్‌ తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఇతను ఐఐటి ఖరగ్పూర్ లో (B Tech), స్టాన్ఫోర్డ్ లో (MS) మరియు వార్టన్ లో (MBA) విద్యను అభ్యసించారు.

Google Pay ద్వారా FASTag అకౌంట్లను రీఛార్జ్ చేయడం ఎలా?

2. సత్య నాదెల్ల CEO, Microsoft

2. సత్య నాదెల్ల CEO, Microsoft

సత్య నాదెల్ల 1992 లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. స్టీవ్ బాల్‌మెర్ తరువాత 2014 లో కంపెనీకి CEOగా బాధ్యతలు తీసుకొని ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. 52 ఏళ్ల సత్య నాదెల్ల హైదరాబాద్‌లో జన్మించారు. ఇతను మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి BE, విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయం నుంచి MS, చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి MBA విద్యను అభ్యసించారు.

RS.10ల టాక్ టైమ్ ప్లాన్‌లను తిరిగి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్ కాకపోతే....

3. శాంతను నారాయణ్, CEO, Adobe
 

3. శాంతను నారాయణ్, CEO, Adobe

హైదరాబాదులో జన్మించిన నారాయణ్ ఆపిల్‌లో తన కెరీర్ ను ప్రారంభించాడు. అతను వరల్డ్ వైడ్ ప్రోడక్ట్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా 1998 లో అడోబ్‌లో చేరాడు. 2005 లో COO మరియు 2007 లో CEOగా బాధ్యతలు తీసుకున్నాడు. ఇతను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్కిలీ నుండి MBA, మరియు బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీలో MS విద్యను అభ్యసించారు. 2018 సంవత్సరంలో ఫార్చ్యూన్ యొక్క వ్యాపారవేత్తల జాబితాలో నారాయణ్ 12 వ స్థానంలో నిలిచాడు.

వోడాఫోన్ రూ.269 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు....

4. జయశ్రీ ఉల్లాల్ ప్రెసిడెంట్ మరియు CEO, Arista Network

4. జయశ్రీ ఉల్లాల్ ప్రెసిడెంట్ మరియు CEO, Arista Network

జయశ్రీ ఉల్లాల్ క్లౌడ్ నెట్‌వర్కింగ్ సంస్థ అరిస్టా నెట్‌వర్క్స్ కంపెనీకి ప్రెసిడెంట్ మరియు CEO గా పనిచేస్తున్నారు. ఉల్లాల్ తన కెరీర్ ను AMD మరియు ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్‌లో ఇంజనీరింగ్ మరియు స్ట్రాటజీ స్థానాలతో ప్రారంభించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆమెను నెట్‌వర్కింగ్ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన ఐదుగురిలో ఒకరిగా పేర్కొంది.

Poco X2 స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ ఎప్పుడో తెలుసా? ఇవే ఫీచర్స్...

5. రాజీవ్ సూరి,  ప్రెసిడెంట్ మరియు CEO, Nokia

5. రాజీవ్ సూరి, ప్రెసిడెంట్ మరియు CEO, Nokia

రాజీవ్ సూరి 1995 లో నోకియాలో చేరారు. ఏప్రిల్ 2014 లో ప్రెసిడెంట్ మరియు CEOగా బాధ్యతలు తీసుకున్నారు. దీని కంటే ముందు ఇతను వివిధ పదవులను నిర్వహించారు. ఇండియాలో జన్మించిన సూరి మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి BTech ను పూర్తి చేసాడు. ఇతను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను కూడా పూర్తి చేసాడు. మైక్రోసాఫ్ట్ నోకియా మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని సొంతం చేసుకున్న తరువాత నోకియా CEOగా సూరిని నియమించారు. దీని కంటే ముందు 2007-2009 లో నోకియా సిమెన్స్ నెట్‌వర్క్‌లకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు.

రియల్‌మి ఎయిర్ ఐకానిక్ కవర్ కేస్ సేల్స్,రేపటి నుండే

6. దినేష్ పాలివాల్ ప్రెసిడెంట్ మరియు CEO, Harman International

6. దినేష్ పాలివాల్ ప్రెసిడెంట్ మరియు CEO, Harman International

62 ఏళ్ల దినేష్ పాలివాల్ హర్మాన్ ఇంటర్నేషనల్ కంపెనీకి ప్రెసిడెంట్ మరియు CEOగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించిన పాలివాల్ ఐఐటి రూర్కీ నుండి BE, మరియు మయామి విశ్వవిద్యాలయం నుండి MS మరియు MBA విద్యను అభ్యసించారు. హర్మాన్‌లో చేరడానికి ముందు అతను ABB గ్రూపులో 22 సంవత్సరాలు పనిచేసాడు. అక్కడ అతను చివరిసారిగా ABB గ్రూప్ ప్రెసిడెంట్ కంపెనీ గ్లోబల్ పి అండ్ ఎల్ బాధ్యతతో పాటుగా ABB నార్త్ అమెరికా ఛైర్మన్ / CEOగా ద్వంద్వ పాత్రను నిర్వహించాడు.

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

7. నికేష్ అరోరా CEO, Palo Alto Networks

7. నికేష్ అరోరా CEO, Palo Alto Networks

నికేష్ అరోరా జూన్ 2018 లో పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో CEO మరియు ఛైర్మన్ గా బాధ్యతలను చేపట్టారు. దీనికి ముందు అతను గూగుల్ మరియు సాఫ్ట్‌బ్యాంక్‌లలో పనిచేశాడు. భారతీయ వైమానిక దళ అధికారికి జన్మించిన అరోరా బోస్టన్ కళాశాల నుండి డిగ్రీ మరియు ఈశాన్య విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పొందారు.

ప్రపంచంలో అతి పెద్ద స్క్రీన్ ల్యాపీ, అమ్మకానికి ఎప్పుడంటే ?

8. నేహా నార్ఖేడ్ CEO and co-founder Confluent

8. నేహా నార్ఖేడ్ CEO and co-founder Confluent

నేహా నార్ఖేడ్ డేటా అనలిటిక్స్ కన్ఫ్లూయెంట్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు మరియు CEO. ఆమె పూణే విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ పట్టాను పొందింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆమెను సాంకేతిక పరిజ్ఞానంలో అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళలలో 2018 లో ప్రచురించింది. నేహా నార్ఖేడ్ దీని కంటే ముందు లింక్డ్‌ఇన్‌లో నాలుగు సంవత్సరాలు అంతకు ముందు ఒరాకిల్‌లో రెండు సంవత్సరాలు పనిచేశారు.

DTH చందాదారులకు HD ఛానెల్‌లను అధికంగా అందిస్తున్న టాటా స్కై

9. పరాగ్ అగర్వాల్, CTO, Twitter

9. పరాగ్ అగర్వాల్, CTO, Twitter

భారతీయ సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసాడు. ఇతను 2011 నుండి ట్విట్టర్లో పనిచేస్తూ ప్రస్తుతం వారి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి ముందు పరాగ్ అగర్వాల్ మైక్రోసాఫ్ట్, AT&T మరియు Yahoo రీసెర్చ్ బృందాలతో కలిసి పనిచేశారు.

Gaganyaan మిషన్ లో హ్యూమనాయిడ్ రోబో.... ఇస్రో సంచలన నిర్ణయం

10. అంజలి సుద్, CEO, Vimeo

10. అంజలి సుద్, CEO, Vimeo

అంజలి సుద్ 2017 లో విమియో ప్రముఖ ఓపెన్ వీడియో ప్లాట్‌ఫామ్‌ యొక్క CEOగా నియమితులయ్యారు. ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి MBA ను పూర్తి చేసింది. ఈమె విమియోలో చేరడానికి ముందు అమెజాన్ మరియు టైమ్ వార్నర్‌లో పనిచేసింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Indian CEOs Representing Tech-giants

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X