High Risk Alert for Android Usersఆండ్రాయిడ్ యూజర్లకు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిక.. వెంటనే ఇలా చేయండి..!
భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) కీలక హెచ్చరికలు చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలంటూ హైఅలర్ట్ (High Risk Alert to Android Users) జారీ చేసింది. ఆండ్రాయిడ్ పరికరాల్లో అనేక భద్రతా లోపాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ వ్యక్తిగత సమాచారం సహా తమ పరికరాలను భద్రంగా ఉంచుకొనేందుకు వీలుగా కీలక సూచనలు చేసింది.
ఈ ఆండ్రాయిడ్ వెర్షన్‌లపై ప్రభావం :
ఈలోపాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ 12, 12L, 13 మరియు 14 వెర్షన్‌లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు ఆండ్రాయిడ్ పరికరాల్లోని సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. దీంతోపాటు అడ్మిన్ స్థాయిలో ఆండ్రాయిడ్ పరికరాలను నియంత్రించే అవకాశం ఉందని సైబర్ వాచ్ డాగ్‌గా వ్యవహరించే Cert-In వెల్లడించింది.

నేరగాళ్లు ఈ లోపాలను వినియోగించుకోవచ్చు :
దీంతోపాటు ఇతర కార్యకలాపాలకు కూడా ఈ భద్రతా లోపాలను వినియోగించుకోవచ్చు. ఎక్కువ మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఉన్న నేపథ్యంలో ఇది ప్రధాన సమస్యగా మారుతుందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెన్పాన్స్ టీం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ పరిస్థితికి గల కారణాలను కూడా వెల్లడించింది.
అనేక విభాగాల్లో లోపాలు :
ఆ లోపాలు అనేక విభాగాల్లో ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. ఆండ్రాయిడ్ ఫ్రేమ్ వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లు, మరియు హార్డ్‌వేర్ కాంపొనెంట్లు అయిన క్వాల్‌కామ్, Arm, Unisoc లో లోపాలు ఉన్నట్లు తెలిపింది. వీటి ద్వారా హ్యాకర్లు అటాక్ చేసే అవకాశం ఉందని తెలిపింది.
సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సూచనలు :
ఆండ్రాయిడ్ పరికరాల్లోని ఈ లోపాల కారణంగా.. పరికరాల్లోని భద్రతా ప్రమాణాలను హ్యాకర్లు బలహీనపరిచే అవకాశం ఉందని పేర్కొంది. ఫలితంగా వ్యక్తిగత డేటా చోరీ, రిమోట్‌గా పరికరాలను నియంత్రించడం లేదా పరికరాన్ని పూర్తిగా డ్యామేజీ చేసే విధంగా మార్చేందుకు అవకాశం ఉంటుందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. ఈ లోపాల నుంచి బయటపడేందుకు CERT-In కీలక సూచనలు చేసింది.
సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి :
ఆండ్రాయిడ్ పరికరాల్లో భద్రతా లోపాల నుంచి బయటపడేందుకు ఆయా సంస్థలు అందించిన సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. సాధారణంగా ఆయా పరికరాల్లోని లోపాలను సరిదిద్దేందుకు ఈ తరహా అప్‌డేట్‌లు ఆండ్రాయిడ్ పరికరాలను తయారు చేసే సంస్థలు అందిస్తాయి. దీంతోపాటు ఈ అప్‌డేట్‌లు సైబర్ అటాక్‌లు జరగకుండా నివారిస్తాయి.
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఈ తరహా అప్‌డేట్‌లు అందించేంత వరకు.. పూర్తిస్థాయిలో ధ్రువీకరణ పొందని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకూడదని సూచించింది. దీంతోపాటు కొత్త వెబ్‌సైట్‌లను సందర్శించడం, అనుమానాస్పదంగా ఉన్న లింక్‌లను క్లిక్ చేయవద్దని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం స్పష్టం చేసింది.
దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ అనుమతులపైనా అప్రమత్తంగా వ్యవహరించాలని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. ఆండ్రాయిడ్ పరికరాలను తయారు చేసే సంస్థలు అందించే అప్‌డేట్ లను ఇన్‌స్టాల్ చేయడం సహా హానికర వెబ్‌సైట్‌ల, లింక్‌లకు దూరంగా ఉండడం వల్ల సైబర్ దాడులకు చిక్కకుండా భద్రతా ఉండొచ్చు.


Click it and Unblock the Notifications








