Home
News

ఆండ్రాయిడ్, Mozilla Firefox యూజర్లకు కీలక హెచ్చరిక.. ప్రమాదంలో వ్యక్తిగత డేటా..!!

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెన్పాన్స్‌ టీం (Cert-in) తాజాగా కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో అనేక లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాల కారణంగా టార్గెట్‌ చేసిన పరికరాల్లోని వ్యక్తిగత డేటాను దొంగిలించే అవకాశం ఉందని పేర్కొంది.

ఆండ్రాయిడ్ 12, 12L, 13, 14, 124.0.1 వెర్షన్‌ కంటే ముందున్న Mozilla Firefox మరియు 115.9.1 కంటే ముందున్న ఫైర్‌ఫాక్స్‌ ESR వెర్షన్‌లు ఈ కారణంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరికరాలపై అటాక్‌ చేసి సున్నితమైన సమాచారం దొంగిలించే అవకాశం ఉందని పేర్కొంది.

cyber security agency warns android and Mozilla Firefox users

మీడియాటెక్‌, వైడ్‌వైన్‌, ఫ్రేమ్‌వర్క్‌, క్వాల్‌కాం, క్వాల్‌కాం కాంపోనెంట్లు ఆండ్రాయిడ్‌ లోపాలకు కారణమని తెలుస్తోంది. మొజిల్లాలోనూ ఇటువంటి సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అప్‌డేట్లు వచ్చిన వెంటనే అప్‌డేట్‌లు చేసుకోవాలని సూచించింది. మరియు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది.

* ఆపిల్‌ ఉత్పత్తులకు కూడా ఇదే తరహా లోపాలను గుర్తించినట్లు ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెన్పాన్స్‌ టీం తెలిపింది. ఆపిల్‌ వినియోగదారులంతా అప్రమత్తంగా ఉండాలంటూ హై రిస్క్‌ వార్నింగ్‌ను జారీ చేసింది. రిమోట్‌ కోడ్‌లో కొన్ని లోపాలను గుర్తించినట్లు Cert-In తెలిపింది.

ఈ లోపాల కారణంగా సైబర్ నేరగాళ్లు టార్గెట్‌ చేసిన పరికరాల్లో కొన్ని కోడ్‌లు రన్‌ చేసి పరికరాలను తమ నియంత్రణలోనికి తీసుకొనే అవకాశం ఉందని హెచ్చరించింది. ఐఫోన్‌ మరియు ఐఫ్యాడ్‌ OS వెర్షన్‌లు 17.41 కంటే ముందున్న పరికరాలు ఈ కారణంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఈ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది.

ఐఫోన్ XS తర్వాత వెర్షన్‌ మరియు, 12.9 అంగుళాల రెండో తరం ఐప్యాడ్‌ ప్రో తర్వాత తరం పరికరాల్లో ఈ వెర్షన్‌ ఉంటుందని తెలుస్తోంది. 10.5 అంగుళాల ఐప్యాడ్‌ ప్రో, తొలి జనరేషన్‌ 11 అంగుళాల ఐప్యాడ్‌ ప్రో తర్వాత తరం పరికరాలు సహా మరిన్ని ఆపిల్ పరికరాలు ఈ కారణంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

దీంతోపాటు 16.77 అప్‌డేట్‌ కంటే ముందున్న iOS, ఐప్యాడ్‌ వెర్షన్‌ కూడా ప్రభావితం కానున్నాయని తెలిపింది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X, ఐప్యాడ్‌ జెన్‌ 5, 12.9 అంగుళాల జెన్‌ 1 ఐప్యాడ్‌ ప్రో, 9.7 అంగుళాల ఐప్యాడ్‌ ప్రో వంటి పరికరాలు ఈ 16.77 అప్‌డేట్‌ పైన పనిచేస్తున్నాయి.

వీటితోపాటు ఆపిల్‌ సఫారీ 17.41 కంటే ముందున్న వెర్షన్‌లు కూడా ఈ లోపాల కారణంగా ప్రభావితం కానున్నాయని సైబర్‌ వాచ్‌ డాగ్‌గా వ్యవహరించే ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ టీం అప్రమత్తం చేసింది. 13.6.6 కంటే ముందున్న macOS Venture వెర్షన్, 14.4.1 కంటే ముందున్న macOS sonoma వెర్షన్లు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నాయని పేర్కొంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Indian computer emergency response team warning to android and mozilla firefox users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X