Home
News

ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌ యూజర్లకు సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరిక.. వెంటనే ఏం చేయాలంటే?

కేంద్ర ప్రభుత్వం సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ టీం (Indian computer emergency response team- CERT-In) ఆపిల్‌ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆపిల్‌ (Apple Users) వినియోగదారులంతా అప్రమత్తంగా ఉండాలంటూ హై రిస్క్‌ వార్నింగ్‌ను జారీ చేసింది. రిమోట్‌ కోడ్‌లో కొన్ని లోపాలను గుర్తించినట్లు Cert-In తెలిపింది.

ఈ లోపాల కారణంగా సైబర్ నేరగాళ్లు టార్గెట్‌ చేసిన పరికరాల్లో కొన్ని కోడ్‌లు రన్‌ చేసి పరికరాలను తమ నియంత్రణలోనికి తీసుకొనే అవకాశం ఉందని హెచ్చరించింది. ఐఫోన్‌ మరియు ఐఫ్యాడ్‌ OS వెర్షన్‌లు 17.41 కంటే ముందున్న పరికరాలు ఈ కారణంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఈ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది.

indian cyber security agency alerts apple users

ఐఫోన్ XS తర్వాత వెర్షన్‌ మరియు, 12.9 అంగుళాల రెండో తరం ఐప్యాడ్‌ ప్రో తర్వాత తరం పరికరాల్లో ఈ వెర్షన్‌ ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 10.5 అంగుళాల ఐప్యాడ్‌ ప్రో, తొలి జనరేషన్‌ 11 అంగుళాల ఐప్యాడ్‌ ప్రో తర్వాత తరం పరికరాలు సహా మరిన్ని ఆపిల్ పరికరాలు ఈ కారణంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

దీంతోపాటు 16.77 అప్‌డేట్‌ కంటే ముందున్న iOS, ఐప్యాడ్‌ వెర్షన్‌ కూడా ప్రభావితం కానున్నాయని తెలిపింది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X, ఐప్యాడ్‌ జెన్‌ 5, 12.9 అంగుళాల జెన్‌ 1 ఐప్యాడ్‌ ప్రో, 9.7 అంగుళాల ఐప్యాడ్‌ ప్రో వంటి పరికరాలు ఈ 16.77 అప్‌డేట్‌ పైన పనిచేస్తున్నాయి.

వీటితోపాటు ఆపిల్‌ సఫారీ 17.41 కంటే ముందున్న వెర్షన్‌లు కూడా ఈ లోపాల కారణంగా ప్రభావితం కానున్నాయని సైబర్‌ వాచ్‌ డాగ్‌గా వ్యవహరించే ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ టీం అప్రమత్తం చేసింది. 13.6.6 కంటే ముందున్న macOS Venture వెర్షన్, 14.4.1 కంటే ముందున్న macOS sonoma వెర్షన్లు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నాయని పేర్కొంది.

indian cyber security agency alerts apple users

నేరగాళ్లు చెప్పిన లింక్‌లపై క్లిక్‌ చేస్తే..:

ఈ భద్రతా లోపాల కారణంగా కొన్ని లింక్‌లపైన క్లిక్‌ చేయమని వినియోగదారులు సైబర్‌ నేరగాళ్లు సూచించవచ్చని, పొరపాటున వాటిని క్లిక్‌ చేస్తే ఆ పరికరం నియంత్రణ హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లిపోతుంది. ఫలితంగా వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారం దొంగిలించబడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇటువంటి సందర్భాల్లో తమ పరికరాల భద్రత కోసం ఎప్పుడూ కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లను కలిగి ఉండాలి. మరియు ఆపిల్ సంస్థ ఎప్పటికప్పుడు విడుదల చేసే సెక్యూరిటీ అప్‌ డేట్‌లను ఇన్‌ స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు పబ్లిక్‌ నెట్‌ వర్క్ వైఫైలకు కనెక్ట్ అయినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

దీంతోపాటు అవసరమైన యాప్‌, సాఫ్ట్‌వేర్‌లను యాప్‌ స్టోర్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మరియు ఎప్పటికప్పుడు ముఖ్యమైన డేటాను బ్యాకప్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా భద్రతా సహా ఇతర సమస్యల కారణంగా డేటా కోల్పోయే అవకాశం ఉండదు. దీంతోపాటు సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు సహా ఆపిల్‌ సంస్థ నుంచి వచ్చే భద్రతా సూచనలను పాటించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Indian computer emergency response team warning to iphone ipad and macbook users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X