Home
News

ఈ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లు వినియోగిస్తున్నారా.. అయితే వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి..!!

భారత ప్రభుత్వానికి చెందిన సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (Cert-in) ఆండ్రాయిడ్‌ యూజర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ 12, 12L, 13 మరియు 14 వెర్షన్‌ లలో అనేక లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాల కారణంగా ఆయా పరికరాలపై దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సైబర్‌ సెక్యూరిటీ వాచ్‌ డాగ్‌ గా వ్యవహరిస్తారు.

సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఆధారంగా ఆండ్రాయిడ్‌లో అనేక లోపాలను గుర్తించింది. ఈ భద్రతా లోపాల కారణంగా ఆయా పరికరాలపై దాడి చేసి అందులోని సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతోపాటు ఆయా ఫోన్‌లను పనిచేయనీయకుండా చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

indian cyber security agency cert in alerts android users

ఫ్రేమ్‌ వర్క్‌, సిస్టమ్‌ మరియు గూగుల్‌ ప్లే వంటి ప్రాంతాల్లో లోపాలున్నట్లు తెలిపింది. దీంతోపాటు కెర్నల్‌, ఆర్మ్‌, మీడియాటెక్‌, క్వాల్‌కామ్ మరియు ఇమాజినేషన్‌ టెక్నాలజీ భాగాల్లో లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. ఆండ్రాయిడ్ యూజర్లు తక్షణమే తమ పరికరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు అందించిన సెక్యూరిటీ అప్‌డేట్‌లను వెంటనే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది. జూన్‌ 3 న విడుదల చేసిన బులిటెన్‌లో ఇండియన్ సైబర్‌ సెక్యూరిటీ రెస్పాన్స్ టీం ఈ సూచనలు చేసింది. దీంతోపాటు అధికారిక ప్లాట్‌ఫాంల నుంచే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది.

దీంతోపాటు తెలియని వ్యక్తుల నుంచే వచ్చే లింక్‌లను క్లిక్‌ చేయవద్దని సూచించింది. సరైన ధ్రువీకరణ లేని వెబ్‌సైట్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేయవద్దని సూచించింది. అవసరం అనుకుంటే యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ సంస్థలు అందిస్తున్న అప్‌డేట్‌లను ఉపయోగించుకోవాలని సూచించింది.

ఆపిల్‌ సంస్థ ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌ మరియు వాచ్‌ యూజర్లకు గత నెలలో హెచ్చరిక మెసేజ్‌ను పంపింది. అయితే భారత్‌ ప్రభుత్వానికి చెందిన ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెన్పాన్స్‌ టీం (CERT-in) కూడా ఆపిల్‌ ఉత్పత్తుల వినియోగదారులకు అప్రమత్తత సందేశాన్ని పంపింది. దాడులు జరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

దీంతోపాటు ఆపిల్‌ ఉత్పత్తుల వినియోగదారులు తమ పరికరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌, ఆపిల్‌ వాచ్‌ మరియు ఆపిల్‌ టీవీ యూజర్లకు సూచనలు చేసింది. ఈ పరికరాల్లో అనేక లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ భద్రతా లోపాల కారణంగా ఆయా పరికరాలపై దాడులు చేసి, వ్యక్తిగత డేటాను దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
indian computer emergency response team warns android users 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X