గూగుల్ గ్లాస్ ధరించి ఆపరేషన్ చేసిన భారతీయ వైద్యుడు

Posted By:

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరింపదగిన కంప్యూటర్ ‘గూగుల్ గ్లాస్'టెక్నాలజీని ఉపయోగించుకుని ఓ భారతీయ వైద్య బృందం జైపూర్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చీలమండ శస్త్రచికత్సను విజయవంతంగా పూర్తి చేసింది. అంతేకాకుండా, ఈ ఆపరేషన్‌ను ఇంటర్నెట్ ద్వారా గూగుల్‌లో ప్రత్యక్షప్రసారం చేయటం జరిగింది. ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులు సేలేనే జి పరేఖ్ పర్యవేక్షణలోకి వైద్య నిపుణుల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. గూగుల్ కళ్లద్దాన్ని సేలేనే జి పరేఖ్ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని సహచర వైద్యులకు షేర్ చేసారు.

గూగుల్ గ్లాస్ ధరించి ఆపరేషన్ చేసిన భారతీయ వైద్యుడు

ఈ శస్త్రచికిత్స బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఆశీష్ శర్మ మాట్లాడుతూ గూగుల్ గ్లాస్ వైద్యవృత్తికి మరింత ఉపయోగకరంగా మారిందని, ఈ గ్లాస్‌ను ధరించటం ద్వారా డాక్టర్లు, రోగిని పర్యేవేక్షిస్తూనే అతనికి సంబంధించి ఎక్స్-రే, ఎమ్ఆర్ఐ వంటి రిపోర్ట్‌లను విశ్లేషించవచ్చని అన్నారు. అంతేకాకుండా, ఆపరేషన్ సమయంలో రోగి కుటుంబ సభ్యలతో కనెక్ట్ అయ్యేందుకు డాక్టర్లకు వీలుంటుందని అన్నారు.

గతంలో చెన్నైకు చెందిన ఓ డాక్టర్ గూగుల్ గ్లాస్‌ను ధరించి 45 సంవత్సరాల వ్యక్తికి జీర్ణకోశ లాప్రోస్కోపీ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసారు. ముఖ్యంగా గూగుల్ గ్లాస్ గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని సీనియర్ వైద్యులు అంటున్నారు. అయితే, గూగుల్ గ్లాస్‌ను వినియోగించే వారికి ఖచ్చితంగా ఆ డివైస్‌ను ఉపయోగించే నైపుణ్యాలు ఉండాలి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting