మన ఇంజనీర్లు ఉద్యోగానికి అసలు పనికిరారట

|

ఐటీ రంగం అనగానే గుర్తు వచ్చేది మన భారత దేశమే అని గొప్పగా చెప్పుకుంటాం. మన దేశం నుండి అత్యధికంగా ఐటీ ఉద్యోగాలకు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు.అంతే కాదు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి దిగ్గజాలు అయితే ఏకంగా ప్రముఖ టెక్ కంపెనీలకు సీఈవోలుగా కొనసాగుతున్నారు. అలాంటి భారత దేశంలో ఇప్పుడు పరిస్థితులు చాల భిన్నంగా ఉన్నాయి.ఐటీ, డేటా సైన్స్ విభాగాల్లో నైపుణ్యాల కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు.

Indian Engineering Graduates Phasing Employment Problems

భారత్ లోని 95 శాతం మంది ఇంజనీర్లు సాఫ్ట్‌వేర్‌ డెవలప్ మెంట్ ఉద్యోగాలకు పనికరారని తాజాగా ఎంప్లాయాబిలిటీ అసెస్ మెంట్ కంపెనీ యాస్పైరింగ్ మైండ్స్‌ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. మన ఇంజనీర్లలో 95 శాతం మందికి సొంతంగా కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ రాయడం రాదని 'యాస్పైరింగ్‌ మైండ్స్‌' అనే ఉద్యోగ అర్హత అంచనా సంస్థ తెలిపింది. ఈ సంస్థ తాజాగా నిర్వహించిన ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు మన విద్యావ్యవస్థలోని లోపాలను తేటతెల్లం చేస్తున్నాయి.

నేర్పరులు కేవలం 4.77 శాతమే:

నేర్పరులు కేవలం 4.77 శాతమే:

ఐటి రంగంలో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ను కనీస పరిజ్ఞానంగా పరిగణిస్తారు. అయితే ఎటువంటి ప్రోగ్రామ్‌నైనా అవలీలగా రాయగల నేర్పరులు కేవలం 4.77 శాతమే ఉన్నారు. ఈ అధ్యయనం కోసం దేశవ్యాప్తంగా సుమారు 500 కాలేజీల నుంచి 36 వేల మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులను పరీక్షించారు. ఆటోమేషన్‌ రంగంలో యంత్రాల పనితీరును నిర్దేశించే ప్రోగ్రామ్‌ని సొంతంగా రాయాలని విద్యార్థులకు చెప్పారు. మూడింటింలో 2 వంతు మంది కనీసం కోడ్‌ ప్రోగ్రామ్‌ కూడా రాయలేకపోయారు. 1.4 శాతం మంది మాత్రమే యంత్రం పనిచేసేలా ప్రోగ్రామ్‌ని రాశారు.

 

విదేశాల్లో పరిస్థితి భిన్నం:

విదేశాల్లో పరిస్థితి భిన్నం:

ప్రోగ్రామ్‌ రాయడంలో కనీస పరిజ్ఞానం లేకపోవడం భారత్‌లో ఐటి, సమాచార సంస్థలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని 'యాస్పైరింగ్‌ మైండ్స్‌' సహ వ్యవస్థాపకుడు వరుణ్‌ అగర్వాల్‌ అన్నారు. విదేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. మూడో తరగతి నుంచే అక్కడ కోడింగ్‌ నేర్పుతున్నారు. అనేక సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్పేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారు. కానీ ఇక్కడ నైపుణ్యమున్నవాళ్లను తయారుచేసే వాళ్లు లేరని అగర్వాల్‌ తెలిపారు.

పైన పరీక్షించిన విద్యార్థులందరూ మంచి ప్రమాణాలున్న కళాశాలల్లో చదివినవారే కావడం ఆశ్చర్యకరమైన అంశం. కనీస ప్రమాణాలు లేని కళాశాల పరిస్థితి మరింత అధ్వానం అనీ, ఇక్కడ విద్యార్థులు సాధారణ విద్యార్థుల కంటే ఐదు శాతం వెనకబడి ఉంటారని తాజా అధ్యయనం వెల్లడించింది.

 

 

నైపుణ్య కొలువులు దక్కకపోవడానికి కారణాలు:

నైపుణ్య కొలువులు దక్కకపోవడానికి కారణాలు:

ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్, వివిధ రకాల డాక్యుమెంట్లు రాయడంలో అనుభవం లేకపోవడం. వివిధ రకాల డేటాను విశ్లేషించి సులభతరంగా మార్చే నైపుణ్యం కొరవడడం వివిధ రకాల అప్లికేషన్స్‌ను విశదీకరించి క్రోడీకరించే సామర్థ్యం లేకపోవడం. సమాచార సేకరణ, దానిని విశ్లేషించే సామర్థ్య లోపం. అర్థ గణాంకాల విశ్లేషణ, సమస్యా పరిష్కారం విషయంలో వెనుకబడడం. మౌఖిక పరీక్షలు, బృంద చర్చల్లో విఫలం కావడం. కళాశాలల్లో విద్యార్థులకు మల్టీ టాస్కింగ్, నైపుణ్య అంశాల్లో సరైన శిక్షణ లభించకపోవడం వంటివి రాష్ట్రంలో నిరుద్యోగులకు నైపుణ్య కొలువులు దక్కకపోవడానికి కారణమని యాస్పైరింగ్‌ మైండ్స్‌ నివేదికలో వెల్లడైంది.

ఖండించిన మాజీ ఇన్ఫోసిస్ టాప్ బాస్ టీవీ మోహన్ దాస్ పాయ్:

ఖండించిన మాజీ ఇన్ఫోసిస్ టాప్ బాస్ టీవీ మోహన్ దాస్ పాయ్:

భారత టెక్కీల సత్తాను తక్కువ చేస్తూ వచ్చిన అధ్యయనంపై ఐటీ ఇండస్ట్రి ప్రముఖుడు, మాజీ ఇన్ఫోసిస్ టాప్ బాస్ టీవీ మోహన్ దాస్ పాయ్ మండిపడ్డారు. 95 శాతం మంది భారత ఇంజనీర్లు సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు పనికిరారంటూ వెల్లడించిన యాస్పైరింగ్ మైండ్స్ అధ్యయనాన్ని ఆయన ఖండించారు. భారత ఇంజనీర్ల సామర్ధ్యాన్ని తగ్గించిచూపిన సదరు అధ్యయనం 'స్టుపిడ్ సర్వే' అని పాయ్ ట్విటర్ వేదికగా ఎండగట్టారు. బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా సైతం పాయ్ వ్యాఖ్యలను సమర్ధించారు. ''మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా... వారికి ఈ సమాచారం ఎలా వచ్చిందో నాకు అర్థం కావడంలేదు. వాస్తవానికి భవిష్యత్ మొత్తం బ్లూకాలర్ ఉద్యోగులదే'' అని ట్విటర్లో వ్యాఖ్యానించారు.

 

Best Mobiles in India

English summary
Indian Engineering Graduates Phasing Employment Problems

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X