ఎన్నికల ముందు ప్రభుత్వం IT చట్టాన్ని ప్రయోగించనుందా.. వాట్సాప్ ఎందుకు ఆందోళన చెందుతోంది..!
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. వినియోగదారుల భద్రత, సౌకర్యాల కోసం కొన్ని నెలలుగా వరుసగా వాట్సాప్ కీలక అప్‌డేట్లను విడుదల చేస్తోంది. వినియోగదారులకు మరింత భద్రతను కల్పించేందుకు నిరంతరం పరీక్షలు చేస్తోంది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2024 ఎన్నికల సందర్భంగా డీప్‌ఫేక్‌ల వివరాలు ఇవ్వాలని వాట్సాప్‌ను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. ఐటీ చట్టం 2021 కింద అటువంటి వినియోగదారుల వివరాలను తమతో పంచుకోవాలని సోషల్ మీడియా సంస్థలను ప్రభుత్వం ఆదేశించవచ్చు. అయితే ఈ వివరాలను ప్రభుత్వంతో పంచుకోవడం వల్ల వినియోగదారుల గోప్యత అంశంలో రాజీపడినట్లు అవుతుందని వాట్సాప్ భావిస్తున్నట్లు సమాచారం.

డీప్‌ఫేక్ అంటే ఏంటి: నకిలీ వీడియో, ఆడియో, ఫొటోలను డీప్‌పేక్ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాయంతో రూపొందించిన నకిలీ వీడియోలు, ఆడియో, ఫొటోలు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో సులభంగా వీటిని తయారుచేయవచ్చు. వీటిని వినియోగించే దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నకిలీ వీడియోలు, ఫొటోలు, ఆడియోల కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేసే తొలి వ్యక్తి సమాచారాన్ని తమకు ఇవ్వాలని వాట్సాప్‌ను ప్రభుత్వం కోరుతోంది. ఇలాంటి నకిలీ సమాచారంతో ఎన్నికల సమగ్రతకు భంగం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఐటీ చట్టం2021 కింద సోషల్ మీడియా సంస్థలను ప్రభుత్వం ఇటువంటి వివరాలు కావాలని కోరవచ్చు. అయితే ఇదే చట్టంపై 2021 సంవత్సరంలోనే ఢిల్లీ హైకోర్టులోనే వాట్సాప్, ఫేస్‌బుక్ సవాల్ చేశాయి. ఇటువంటి చర్యలు తమ వినియోగదారుల గోప్యతకు ముప్పుగా మారుతాయని, అంతిమంగా సామూహిక నిఘాకు దారితీస్తుందని ఈ సోషల్‌మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఈ చర్య సాధారణ వినియోగదారుడిపై ప్రభావం చూపదని ప్రభుత్వం చెబుతోంది.
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటువంటి నకిలీ సమాచార వ్యాప్తి కారణంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు తొలి మెసేజ్ పంపిన వారి వివరాలను తెలుసుకోవడం ద్వారా, వీటిపై పోరాటం సులభం అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఆ వివరాలు కావాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వాట్సాప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య సమాచారం వాట్సాప్ వద్ద కూడా ఉండదని సంస్థ చెబుతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా వినియోగదారుడి గోప్యతకు భంగం కలిగిస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది.
వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్ మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ కాల్ సమయంలో వినియోగదారుడు IP అడ్రస్‌ను ట్రాక్ చేయకుండా ఉండేలా చూస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS వాట్సాప్ బీటా వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఎప్పటి నుంచి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందో తెలియకపోయినా.. త్వరలో రానుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








