16 యూట్యూబ్ ఛానెల్‌లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది!! పాకిస్థాన్‌కు చెందినవి కూడా ఉన్నాయి...

|

టెక్నాలజీ అభివృద్ధి వేగంగా పెరుగుతున్న ఈ రోజులలో ప్రతి ఒక్కరు వినోదం కోసం యూట్యూబ్ ని వినియోగిస్తున్నారు. వినోదం కోసం మాత్రమే కాకుండా చాలా సొంతంగా యూట్యూబ్ ఛానెల్లను సృష్టించి సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకొనిరావడానికి ప్రయత్నాలను చేస్తున్నారు. అయితే కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు మాత్రం కొన్ని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రభుత్వం దృష్టిలో పడుతూ బ్లాక్ చేయబడుతున్నాయి. ఇప్పుడు కూడా 'భారత జాతీయ భద్రత, విదేశీ మరియు పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకుగాను భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం 16 యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేసింది. ప్రభుత్వం బ్లాక్ చేయబడిన 16 ఛానెల్‌లలో ఆరు పాకిస్తాన్‌కు చెందినవి ఉండడం గమనార్హం. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం యొక్క సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానెల్‌లు మరియు ఫేస్‌బుక్ అకౌంటుకు 68 కోట్లకు పైగా వీక్షకులను కలిగి ఉండడం గమనార్హం. భారతదేశంలో మత సామరస్యాన్ని ప్రేరేపిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుండడమే కాకుండా పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు.

భారత ప్రభుత్వం

భారత ప్రభుత్వం ఇటీవల బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెల్‌లు భారతదేశానికి సంబంధించిన వివిధ అంశాల గురించి నకిలీ వార్తలను పోస్ట్ చేయడానికి పాకిస్తాన్‌లోని యూట్యూబ్ ఛానెల్‌లను ఉపయోగిస్తున్నట్లు MeitY పేర్కొంది. ఈ జాబితాలో భారత సైన్యం, జమ్మూ మరియు కాశ్మీర్ మరియు ఉక్రెయిన్‌లోని పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం యొక్క విదేశీ సంబంధాలు వంటి అంశాలు చాలానే ఉన్నాయి. వీటి కారణంగా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 22 యూట్యూబ్ ఆధారిత న్యూస్ ఛానెల్‌లను నిరోధించాలని ఆదేశించింది. వాటిలో నాలుగు పాకిస్తాన్‌కు చెందినవి కూడా ఉన్నాయి.

మంత్రిత్వ శాఖ
 

డిసెంబర్ 2021 నుండి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ భారతదేశ జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రత మరియు పబ్లిక్ ఆర్డర్ మొదలైన వాటికి సంబంధించిన 78 యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లు మరియు అనేక ఇతర సోషల్ మీడియా అకౌంటులను బ్లాక్ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. "ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ఈ యూట్యూబ్ ఛానెల్‌లు ప్రసారం చేసే తప్పుడు కంటెంట్ ఇతర దేశాలతో భారతదేశం యొక్క విదేశీ సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతో ఉన్నట్లు గమనించబడింది" అని మంత్రిత్వ శాఖ తన యొక్క నివేదికలు తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Indian Government Banned 16 YouTube Channels For Spreading Wrong Information

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X