సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న యాప్‌లు, వెబ్‌సైట్‌లపై నిషేధం..!
Vulgar Content Apps and websites Banned in india : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో వెబ్‌సైట్స్, యాప్స్ పై నిషేధం విధించింది. అభ్యంతరమైన కంటెంట్ కారణంగా ULLU, ALTT, Big shots సహా అనేక ప్లాట్‌ఫాంలపై చర్యలు తీసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వివరాల ఆధారంగా మొత్తంగా 25 వెబ్‌సైట్, యాప్స్ ను భారత్‌లో బ్యాన్ చేసింది. ఈ తరహా కంటెంట్ ప్రసారం చేయడంపై గత కొంత కాలంగా కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
చట్టాలను ఉల్లంఘంచి :
భారతీయ చట్టాలను ఉల్లంఘించి అశ్లీల మరియు అభ్యంతర కంటెంట్ ను అందిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 67 మరియు సెక్షన్ 67A, భారతీయ న్యాయ సంహిత 2023 చట్టంలోని సెక్షన్ 294 సహా మహిళలను అభ్యంతరకరంగా చూపించడం వంటి ఉల్లంఘనల కింద ఈ యాప్స్, వెబ్‌సైట్ లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది.

బ్యాన్ చేసిన యాప్, వెబ్‌సైట్‌లు ఇవే :
ప్రభుత్వం చర్యలు తీసుకున్న యాప్స్, వెబ్‌సైట్స్ జాబితాలో ULLU, ALTT, బిగ్ షాట్స్ యాప్, దేసీఫ్లిక్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, బుల్ యాప్, కంగన్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, సోల్ టాకీస్, Feneo, హిట్‌ప్రైమ్, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్ వీఐపీ, హల్‌చుల్ యాప్, మూడ్‌ఎక్స్, నియోన్‌ఎక్స్ వీఐపీ, మోజ్‌ఫ్లిక్స్, ట్రిఫ్లిక్స్, Fugi ఉన్నాయి.
కీలక ఆదేశాలు :
భారత్ లో యాప్ లు, వెబ్‌సైట్ లకు ప్రజలకు అందుబాటులోకి లేకుండా చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లకు ప్రభుత్వం ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ప్రభుత్వం ముఖ్యంగా ఐటీ చట్టం 2000 లోని సెక్షన్ 79(3) ను హైలెట్ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయకుండా ప్రభుత్వం నుంచి పొందే ప్రత్యేక మినహాయింపును కోల్పోతారు.
చట్టాల ప్రకారం నడుచుకోవాలి :
కొన్ని యాప్‌లు, వైబ్‌సైట్‌లు అనేక సార్లు నిబంధనలను ఉల్లఘించాయని, అందువల్లనే ఆయా ప్లాట్‌ఫాంలపై కఠిన చర్యలు తీసుకున్నామని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఓటీటీలు సహా ఇతర ప్రసార మాధ్యమాలు భారత్ లో ప్రసారం చేసే సమయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది.
అభ్యంతర కంటెంట్ ను కట్టడి చేసే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వం తాజా చర్యలతో ఓటీటీ వంటి ప్లాట్‌ఫాంలలో అశ్లీల మరియు అభ్యంతర కంటెంట్ ను కట్టడయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కొంత కాలంగా ఈ తరహా కంటెంట్‌పై చర్యలు తీసుకుంటోంది.
దీంతోపాటు కేంద్రం మరో ప్రకటన కూడా చేసింది. 2022 నుంచి జున్ 2025 వరకు ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం, గేమింగ్ వెబ్‌సైట్, యాప్‌లకు సంబంధించి 1524 బ్లాకింగ్ ఆదేశాలను జారీచేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి లోక్‌సభలో సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications








