Home
News

Google chrome అప్‌డేట్‌ చేసుకోండి.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీచేసింది. గూగుల్‌ క్రోమ్‌ (Google chrome ) పాత వెర్షన్‌ను వెంటనే అప్‌డేట్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-in) హెచ్చరించింది. క్రోమ్‌ బ్రౌజర్‌లోని కొన్ని లోపాలు కారణంగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందంటూ అక్టోబర్ 11వ తేదీని కీలక హెచ్చరికలు జారీచేసింది.

క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక లోపాలు గుర్తించినట్లు ఈ ఏజెన్సీ పేర్కొంది. విండోస్‌, Mac, Linuxలలో క్రోమ్‌ బ్రౌజర్‌ వెర్షన్‌ 118.0.5993.70 కంటే ముందు వెర్షన్‌ వినియోగిస్తున్నవారు (Google chrome Users) వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. పాత వెర్షన్‌లలో కొన్ని భద్రతా లోపాల కారణంగా.. హ్యాకర్లు.. కంప్యూటర్లలోకి చొరబడి వ్యక్తిగత డేటా దొంగలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Google chrome

బ్రౌజర్‌ లోపాల కారణంగా రిమోట్‌ యాక్సెస్‌ చేసి.. కంప్యూటర్‌లోకి ఆర్బిట్రరీ కోడ్‌లు పంపడం, సర్వీసులను తిరస్కరించడం, కంప్యూటర్లలో ఉన్న సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసే అవకాశం ఉందని, యూజర్లు వెంటనే అప్రమత్తం కావాలని, తమ బ్రౌజర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు కీలక హెచ్చరిక సందేశం పంపింది.

అయితే కొంత మంది యూజర్లకు తాము ఏ బ్రౌజర్‌ వెర్షన్‌ వినియోగిస్తున్నమో అవగాహన ఉండదు. అలాంటి వారు.. తమ క్రోమ్ బ్రౌజర్‌ ఒపెన్‌ చేసి.. కుడివైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ అబౌట్‌ క్రోమ్‌పైన క్లిక్‌ చేయాలి. అప్పుడు మీరు వినియోగిస్తున్న వెర్షన్‌ అప్‌డేట్‌ అయిందా లేదా కనిపిస్తుంది. అప్‌డేట్‌ కాకుంటే వెంటనే చేసుకోవాలి. అనంతరమే వినియోగించాలి.

గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు ఇలాంటి హెచ్చరికలు జారీచేశాయి. వినియోగదారులు వెంటనే క్రోమ్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించాయి. లేకుంటే హ్యాకర్లకు చిక్కే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఫలితంగా సున్నితమైన డేటా బహిర్గతం అయ్యే అవకాశం ఉంటుంది. సెట్టింగ్స్‌లోని అబౌట్‌ క్రోమ్‌పైన క్లిక్‌ చేస్తే.. అప్‌డేట్‌ అయ్యి ఉంటే.. క్రోమ్‌ ఈజ్‌ అప్‌ టూ డేట్‌ అని కనిపిస్తుంది.

ఆండ్రాయిడ్‌ లేదా టాబ్లెట్లలో క్రోమ్‌ బ్రౌజర్‌ను వినియోగిస్తున్నట్లతే ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోండి. మాల్‌వేర్‌, బాట్‌ల నుంచి వినియోగదారులు తమ డివైస్‌లను కాపాడుకొనేందుకు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ CERT-In ఉచితంగా కొన్ని సాధనాలను అందుబాటులో ఉంచింది. escan CERT-In గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. M-kavach 2 హైదరాబాద్‌లోని C-DAC అభివృద్ధి చేసింది. csk.gov.in కూడా అందుబాటులో ఉంది. వీటి ద్వారా మాల్‌వేర్, బాట్‌లను తొలగించవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Indian government issues high risk warning to Google chrome users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X