కొత్తగా అందుబాటులోకి వస్తున్న e-passport గురించి తెలుసా.. ఎలా గుర్తించాలి.. ఎలాంటి భద్రతను అందిస్తుంది..?
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గత సంవత్సరం పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రాం (PSP) 2.0 ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తాజాగా ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్ (e- passport) ను ప్రవేశపెట్టింది. భారతీయుల ప్రయాణాన్ని మరింత మెరుగుపరచడం. పాస్‌పోర్టుకు మరింత భద్రత ను కల్పించడంలో (indian government launches e-passport) భాగంగా వీటిని తీసుకొచ్చారు. ప్రస్తుతం పాస్‌పోర్టులు పేపర్ ప్రింటింగ్‌తో అందుబాటులో ఉన్నాయి.
అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ ఫీచర్‌లు :
అయితే కొత్తగా ప్రవేశపెట్టిన ఇ-పాస్‌పోర్టుల్లో పేపర్ తో పాటుగా అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ ఫీచర్‌లు కలిగిన చిప్ కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ చిప్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ (RFID) తో పాటు యాంటెనాను కూడా కలిగి ఉంటుంది. పాస్‌పోర్టు బుక్‌లెట్‌లోనే ఇవి అమర్చి ఉంటాయి.

బయోమెట్రిక్ వివరాలు :
ఈ చిప్‌లో వ్యక్తిగత వివరాలతోపాటు బయోమెట్రిక్ వివరాలు కూడా ఉంటాయి. పాస్‌పోర్టు బుక్‌లెట్ ముందు వైపు ఉన్న కవర్‌లో చిన్న గోల్డ్ కలర్ గుర్తును కలిగి ఉంటుంది. దీని ఆధారంగా ఇ-పాస్‌పోర్ట్‌ను గుర్తించవచ్చు. ఈ కొత్త విధానం ద్వారా పాస్‌పోర్టు ఫోర్జరీ తోపాటు దొంగతనం వంటి ప్రమాదాలను తగ్గించవచ్చు.
భారత పాస్‌పోర్టు డ్యూయల్ లేయర్ సెక్యూరిటీ.. ప్రామాణికతతోపాటు నకిలీ పాస్‌పోర్టులను తయారు చేయకుండా నివారిస్తుంది. పాస్‌పోర్టులోని సున్నితమైన సమాచారాన్ని ఈ టెక్నాలజీ సురక్షితంగా ఉండేలా చూస్తుంది. PKI (పబ్లిక్ కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ద్వారా పాస్‌పోర్టులోని బయోమెట్రిక్, వ్యక్తిగత సమాచారం ధ్రువీకరణ అయ్యేలా చూస్తుంది.
తొలుత ఎంపిక చేసిన నగరాల్లో :
గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రారంభించిన పాస్‌పోర్టు సేవా ప్రోగ్రాం ద్వారా ఇ-పాస్‌పోర్టులను ప్రవేశపెట్టారు. అయితే తొలుత e- passport ను భారత్‌లోని ఎంపిక చేసిన నగరాల్లోని పౌరులకు మాత్రమే జారీ చేయనున్నారు. ఇందులో హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, భువనేశ్వర్, గోవా, జైపూర్, జమ్మూ, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ వంటి ప్రాంతాల్లోని పౌరులకు జారీ చేయనున్నారు.
2025 సంవత్సరం మధ్య నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లోనూ e-passport లను అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇ-పాస్‌పోర్ట్‌ను విప్లవాత్మక మార్పుగా గుర్తించవచ్చు. మరియు ప్రయాణ సమయంలో ఈ తరహా పత్రాల భద్రతను మెరుగుపరచవచ్చు.
టెక్నాలజీని ఉపయోగించుకొని పాస్‌పోర్టులకు మెరుగైన భద్రతను కల్పించడం సహా నకిలీ పాస్‌పోర్టులను నివారించేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు భారతీయులు ఇతర దేశాల్లో ప్రయాణించినప్పుడు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా చూడవచ్చు.
గతంతో పోలిస్తే పాస్‌పోర్ట్‌ను సులభంగా పొందగలుగుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయగలుగుతున్నారు. అయితే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసే సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ వెబ్‌సైట్ ద్వారా నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని గతంలో సంబంధిత అధికారులు హెచ్చరించారు.
పాస్‌పోర్టు కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ mpassport seva app ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. దీంతోపాటు ఆన్‌లైన్ ఖాతాలు, యాప్‌లకు బలమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications








