ప్రభుత్వ కార్యాలయాల్లో జీమెయిల్, యాహూ సర్వీసుల పై నిషేధం!

Posted By:

సమాచారాన్ని సురక్షితం చేసేక్రమంలో భారత ప్రభుత్వం జీమెయిల్, యాహూ వంటి ఈ-మెయిల్ సర్వీసుల వినియోగాన్ని ఫ్రభుత్వ కార్యాలయాల్లో రద్దు చేయనుంది. ఈ నిబంధన డిసెంబర్ నుంచి అమలులోకి వచ్చే అవకాశముంది. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ అధికారిక అవసరాల కోసం ‘నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్' (ఎన్ఐసీ) రూపొందించిన ప్రత్యేక ఇ-మెయిల్ సర్వీసును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించుకోవల్సి ఉంటుంది.

ప్రభుత్వ కార్యాలయాల్లో జీమెయిల్, యాహూ సర్వీసుల పై నిషేధం!

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటిదాకా సమాచారా మార్పిడి కోసం జీమెయిల్, యాహూలాంటి మెయిల్ సర్వీుసుల పై ఆధారపడుతూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సైబర్ నేరగాళ్లు కీలకమైన ప్రభుత్వ సమచారాన్ని వివిధర వైరస్‌లను ప్రవేశపెట్టి కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల సమాచారం దోపిడికి సంబంధించి సైబర్ నేరాలనుఅరికట్టే క్రమంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫ్మరేషన్ టెక్నాలజీ ఓ ప్రత్యేక బిల్లును రూపొందించింది. ఈ బిల్లుకు సంబంధించి ఇతర మంత్రిత్వ శాఖల అభిప్రాయాల తీసుకున్న అనంతరం అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ సరికొత్త విధానం అమలులోకి వచ్చినట్లయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక వెబ్‌సైట్ నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్' (ఎన్ఐసీ) రూపొందించిన ప్రత్యేక ఇ-మెయిల్ సర్వీస్ ద్వారానే మెయిల్స్ పంపుకోవల్సి ఉంటుంది

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot