39 బూతు వెబ్‌సైట్‌ల పై బ్యాన్!

|
 39 బూతు వెబ్‌సైట్‌ల పై బ్యాన్!

సమజాన్ని చెడుదోవ పట్టిస్తున్న పోర్నోగ్రాఫిక్ వెబ్‌సైట్‌ల నిర్మూలనకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 39 పోర్న్ వెబ్‌సైట్‌ల పై బ్యాన్ విధించింది. పోర్నోగ్రాఫిక్ ఫైళ్లను సులువుగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్న 39 వెబ్‌సైట్‌లను బ్యాన్ చేయాలంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్(డాట్) ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. రద్దుకు గురైన ఈ 39 వెబ్‌సైట్‌లను యూఎస్ పరిధిలోని 18 USC 2257 చట్టం కింద నిర్వహిస్తున్నారు. అడల్ట్ ఫోర్నోగ్రఫీ వీక్షించటం భారత్‌లో చట్టవిరుద్ధం కానప్పటికి చైల్డ్ పోర్నోగ్రఫీ పూర్తిగా విరుద్ధం.

 

అరుదైన ఫోటోగ్రాఫ్స్: అన్న ఎన్టీఆర్ ఇలా..?

బూతు వెబ్‌సైట్‌లకు దాసోహం.?

వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం..?, ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వెబ్‌‌సైట్లుండగా, వాటిలో వేటికీ లేనంత ఆదరణ పోర్న్‌ సైట్లకు ఉందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. నిత్యం రద్దీగా ఉండే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లతో సమానంగా ఈ పోర్న్ సైట్‌లు వీక్షకులను రాబడుతున్నాయట!. బూతుబొమ్మలను చూడటానికి ఏకంగా 30 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని ఈ అధ్యయనం లెక్కగట్టింది. ఇంటర్నెట్ రద్దీలో భాగంగా 30శాతం బూతు వెబ్ సైట్ ల నుంచే వస్తుందని ఈ సర్వే అంచనావేసింది. పోర్న్‌ సైట్లలో కొన్నింటికి అత్యంత ఆదరణ ఉందట. ప్రతీ నెలా ఈ సైట్లలోని బొమ్మలను చూడటం కోసం ఏకంగా నాలుగు బిలియన్ల పేజీలను వీక్షిస్తుండగా, ప్రత్యేకించి వీడియోలు చూసేందుకు జరిగే సందర్శనలు ఏకంగా 350 మిలియన్లు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X