Home
News

భారీ సంఖ్యలో చైనా, హాంకాంగ్‌ Apps ను బ్యాన్‌ చేసిన భారత ప్రభుత్వం.. కారణం ఏంటంటే?

కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో యాప్స్‌ ను బ్లాక్‌ చేయాలని ఆదేశించినట్లు (Apps Ban 2025) మనీ కంట్రోల్‌ తెలిపింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 119 యాప్‌లను బ్లాక్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు (119 Apps Banned) తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా చైనా, హాంకాంగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న యాప్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. గాల్వాయ్‌ లోయలో ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో కేంద్రం భారీ సంఖ్యలో యాప్‌లను బ్యాన్ చేసింది.

చైనాతో ఘర్షణల సమయంలో :
2020 జున్‌లో చైనాతో సరిహద్దు ఘర్షణల సమయంలో జాతీయ భద్రత పేరుతో చైనా కేంద్రంగా పనిచేస్తున్న సుమారు 100 యాప్‌ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందులో టిక్‌టాప్‌, షేర్‌ఇట్‌ వంటి యాప్స్‌ కూడా ఉన్నాయి. అనంతరం 2021, 2022 సంవత్సరాల్లోనూ ఇదే తరహాలో యాప్స్‌ ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ చేసింది.

indian government orders to ban 119 apps from google play store

ఇప్పటికీ డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు :
మనీ కంట్రోల్‌ కథనం ఆధారంగా ఇప్పటి వరకు 15 యాప్స్‌ ను మాత్రమే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలిగించినట్లు తెలుస్తోంది. మరిన్ని తొలగించాల్సి ఉంది. ఆ యాప్‌లు ఇప్పటికీ డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 119 యాప్స్‌ లో 3 యాప్స్‌ పై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

ఈ మూడు యాప్స్‌పై ప్రత్యేక దృష్టి :
ఈ జాబితాలో చిల్‌చాట్‌, ChangApp, Honeycam యాప్‌లు ఉన్నాయి. ChillChat యాప్‌ను సింగపూర్‌కు చెందిన Mangostar టీమ్ తయారు చేసింది. ఈ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ లో 1 మిలియన్ డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. మరియు 4.1 రేటింగ్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు ChangApp ను చైనాకు చెందిన Blom రూపొందించింది.

HoneyCam యాప్‌ ను ఆస్ట్రేలియాకు చెందిన Shellin PTY సంస్థ రూపొందించింది. అయితే ఈ యాప్‌ను బ్లాక్ చేసేందుకు గల కచ్చితమైన కారణాలను భారత ఎలక్ట్రానిక్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69A లోని అధికారాల ద్వారా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గూగుల్‌ ద్వారా యాప్‌ ల బ్లాక్‌ గురించి తెలుసుకున్నామని.. భారత అధికారులతో కలిగి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముగ్గురు యాప్‌ డెవలపర్‌ లు చెప్పారని మనీకంట్రోల్ తెలిపింది. మరికొంత మంది యాప్స్‌ బ్లాక్‌ చేయడం కారణంగా యూజర్లపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కేంద్ర బ్లాక్ చేసిన యాప్స్‌ లో కేవలం మూడింటి వివరాలు మాత్రమే వెల్లడయ్యాయి. మిగిలిన యాప్స్‌ వివరాలు వెల్లడి కాలేదు. కేంద్రం తాజా ఆదేశాలతో గూగుల్‌ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయా యాప్‌లు వెంటనే బ్లాక్ చేస్తారు. మరియు కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసేందుకు అవకాశం ఉండదు.

* 2020 లో చైనాకు చెందిన యాప్స్‌ను కేంద్రం బ్లాక్ చేసింది. గాల్వాన్‌ లోయలో ఘర్షణల సమయంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అందులో సుమారు 36 యాప్స్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ స్టోర్‌లో కనిపిస్తున్నాయి. పేర్లు, బ్రాండింగ్‌, లోగోలు మార్చి తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

గేమింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫైల్‌ షేరింగ్‌, డేటింగ్‌, షాపింగ్ వంటి కేటగిరీల్లో ఈ యాప్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలా యాప్స్‌ను పాత చైనా డెవలపర్లే నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. లీగల్‌గా మరియు పార్టనర్‌షిప్‌ లో భాగంగా భారత్‌లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
indian government orders to ban 119 apps from google play store 2025 february
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X