Online లో తప్పుడు పనులు చేసే వాళ్లకు వార్నింగ్! కొత్త చట్టం రాబోతోంది. వివరాలు తెలుసుకోండి 

By Maheswara
|

భారత ప్రభుత్వం త్వరలో డేటా ప్రొటెక్షన్ బిల్లు యొక్క కొత్త వెర్షన్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త బిల్లు, అలాగే ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టంపై కసరత్తు జరుగుతోంది. ఈ కొత్త బిల్లు ద్వారా ఆన్‌లైన్ ప్రపంచాన్ని మరింత జవాబుదారీగా మరియు సురక్షితంగా ఉండేలా చూస్తాయని ఐటీ మరియు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వివరించారు. ప్రముఖ వార్త పత్రిక PTI నివేదిక ప్రకారం, ప్రభుత్వం త్వరలో అంటే ఒక వారంలో కొత్త టెలికాం బిల్లును తేనుందని వైష్ణవ్ చెప్పారు.

 

కొత్త బిల్లు ద్వారా

ఈ కొత్త బిల్లు ద్వారా ఆన్‌లైన్ ప్రపంచాన్ని అక్కడ పోస్ట్ చేసే పోస్ట్ లకు మరియు వాటికి సంబందించిన వారికి మరింత జవాబుదారీగా ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వైష్ణవ్ అన్నారు. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్‌, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా జవాబుదారీగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అన్నారు.

కొత్త డిజిటల్ చట్టాలతో

కొత్త డిజిటల్ చట్టాలతో

ఈ కొత్త డిజిటల్ చట్టాలతో భర్తీ చేయడానికి, వ్యక్తిగత డేటా రక్షణ (PDP) బిల్లు, 2019ని కేంద్రం ఉపసంహరించుకుంది. యూజర్ల నుండి సేకరించిన డేటాను ప్రభుత్వం మరియు కంపెనీలు ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ బిల్లు నిర్ణయించింది. టెక్నాలజీ ప్రొవైడర్లు మార్కెట్‌కు అందిస్తున్న వాటికి జవాబుదారీగా ఉండేందుకు డిజిటల్ మంత్రుల G-20 గ్రూప్‌లో ప్రపంచ దేశాలు మధ్య ఏకాభిప్రాయం ఉందని వైష్ణవ్ చెప్పారు.

కొత్త టెలికాం బిల్లు
 

కొత్త టెలికాం బిల్లు

ఈ కొత్త టెలికాం బిల్లు కూడా అందుబాటులోకి వచ్చింది, దీనిని ప్రభుత్వం ఒకటి లేదా రెండు వారాలలో ప్రకటించనుంది. డిజిటల్ ప్రపంచం ప్రాథమికంగా టెలికాం నెట్వర్క్ లద్వారా నడుస్తుంది. మరియు మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా చాలా విషయాలు వినియోగించబడతాయి. ఆన్‌లైన్ కార్యకలాపాలను నియంత్రించడం అనే విషయం లో ప్రభుత్వం నుండి సరైన దిశలో ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. ఇది తప్పుడు సమాచారాన్ని ఆపడంలో చాలా సహాయపడుతుంది అని తెలిపారు.

సోషల్ మీడియా యాప్ లలో

సోషల్ మీడియా యాప్ లలో

ప్రభుత్వం ఇది వరకే ప్రవేశపెట్టిన మొదటి దశ డేటా ప్రొటెక్షన్ చట్టం గురించి మీకు తెలియకుంటే వివరాలు ఇక్కడ తెలుసుకోండి. వినియోగదారులు తమ యొక్క వ్యక్తిగత డేటాను అనేక సోషల్ మీడియా యాప్ లలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు వినియోగదారుల యొక్క డేటాను భద్రపరచడానికి సంబంధించి ఎటువంటి నియమాలు లేదా విధానాలు అందుబాటులోలేవు. డేటా ప్రొటెక్షన్ చట్టంపై పార్లమెంటు కమిటీ తన నివేదికను ఖరారు చేసిన తర్వాత భారతీయ వినియోగదారుల వ్యక్తిగత డేటా అంతా సురక్షితంగా మరియు నిర్దిష్ట మార్గదర్శకాలలో స్టోర్ అయ్యి ఉండేలా ప్రభుత్వం నిర్ధారిస్తుంది.

డేటా ప్రొటెక్షన్ చట్టం పరిధిలోకి

డేటా ప్రొటెక్షన్ చట్టం పరిధిలోకి

ఈ డేటా ప్రొటెక్షన్ చట్టం పరిధిలోకి  ఏ యే విషయాలు వస్తాయి అని ఇక్కడా గమనించండి. PTI యొక్క నివేదిక ప్రకారం డేటా ప్రొటెక్షన్ చట్టం అనేది కంపెనీ / సంస్థకు డేటాను అందించడంలో వినియోగదారు యొక్క సమ్మతి, యాప్/ వెబ్‌సైట్ వినియోగదారు నుండి ఎటువంటి డేటాను తీసుకోగలదు, డేటాను ప్రాసెస్ చేసే విధానాలు, వ్యక్తిగత హక్కులు , మంజూరు చేయగల మినహాయింపులు వంటి మరిన్ని ప్రాంతాలను కవర్ చేస్తుంది.

డేటా ప్రొటెక్షన్ చట్టం యొక్క అవసరం

డేటా ప్రొటెక్షన్ చట్టం యొక్క అవసరం

వాట్సాప్ మాత్రమే కాకుండా చాలా కంపెనీలు వినియోగదారుల డేటాను సేకరించడానికి ప్రయత్నిస్తున్నందున కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం యొక్క అవసరం అధికంగా ఉంది. సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ఉచిత ప్లాట్‌ఫారమ్‌లు తమ వద్ద ఉన్న వ్యక్తిగత డేటాపై ఆధారపడడమే కాకుండా మరికొన్ని విషయాలపై ఆ డేటాను ప్రకటనదారులకు అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందగలుగుతాయి. డేటా ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వాట్సాప్ తన గోప్యతా విధానాన్ని ఉపసంహరించుకోవలసి వస్తుంది. డేటా ప్రొటెక్షన్ చట్టంను ప్రభుత్వం ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందో అన్న స్పష్టమైన సమాచారం లేదు.

Best Mobiles in India

Read more about:
English summary
Indian Government Planning To Introduce New Data Protection Bill To Strictly Monitor Online Activity.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X