5G స్పెక్ట్రమ్ వేలంకి ముహూర్తం ఖరారు చేసిన కేంద్ర మంత్రివర్గం!!

|

ఇండియాలో 5G స్పెక్ట్రమ్ వేలంను నిర్వహించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5G స్పెక్ట్రమ్ వేలం ప్రకటనతో ప్రభుత్వం భారతదేశంలోని ప్రజలకు మరియు సంస్థలకు 5G సేవలను అధికారికంగా ప్రారంభించనుంది. నోటిఫికేషన్ ఇన్విటేషన్ ల ద్వారా టెలికాం శాఖ (DoT) వేలం తేదీలను కూడా వెల్లడించింది. 5G స్పెక్ట్రమ్ వేలం జూలై 26, 2022న ప్రారంభమవుతుంది. ఈ వేలం ప్రక్రియకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను కూడా DoT వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

5G స్పెక్ట్రమ్

5G స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనడానికి దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూలై 8. అయితే దరఖాస్తుదారుల జాబితా జూలై 12న బహిరంగంగా ప్రకటించనున్నారు. అయితే మాక్ వేలం జూలై 22 మరియు జూలై 23న జరుగుతుంది. DoT ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్‌ను కూడా నిర్వహిస్తుంది. కాన్ఫరెన్స్ యొక్క వేదిక, తేదీ / సమయం వివరాలను ప్రత్యేకంగా DoT వెబ్‌సైట్‌లో తెలియజేయబడుతుంది.

5G స్పెక్ట్రమ్ వేలం

5G స్పెక్ట్రమ్ వేలంను 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్‌ని జూలై, 2022 లో వేలం నిర్వహించనున్నారు. ఈ స్పెక్ట్రమ్ వేలంలో లెస్ (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మిడ్ (3300 MHz) మరియు హై (26 GHz) ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లు ఉన్నాయి. వీటి యొక్క సాయంతో మెషిన్-టు-మెషిన్ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కొత్త-యుగం యాప్ ల ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు ప్రైవేట్ క్యాప్టివ్ నెట్‌వర్క్‌ల అభివృద్ధి మరియు ఏర్పాటును ప్రారంభించాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది.

WhatsApp లో 25 లక్షల KBC లాటరీ మెసేజ్ వచ్చిందా? నమ్మారో అంతే...WhatsApp లో 25 లక్షల KBC లాటరీ మెసేజ్ వచ్చిందా? నమ్మారో అంతే...

సర్వీస్ ప్రొవైడర్లు
 

ఇండియాలో ప్రస్తుతం అందుబాటులో ఉండే 4G సేవల ద్వారా నిర్వహించే దానికంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ వేగంతో అన్ని రకాల సామర్థ్యాలను అందించే ఉద్దేశంతో 5G టెక్నాలజీ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మిడ్ మరియు హై బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకుంటారని భావిస్తున్నారు.

కేంద్ర మంత్రివర్గ సమావేశం

"ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి టెలికమ్యూనికేషన్స్ శాఖ యొక్క ప్రతిపాదనను ఆమోదించింది. దీని ద్వారా పబ్లిక్ మరియు సంస్థలకు 5G సేవలను అందించడానికి విజయవంతమైన బిడ్డర్లకు స్పెక్ట్రమ్ కేటాయించబడుతుంది" అని నివేదికలు పేర్కొన్నాయి.

స్పెక్ట్రమ్ వేలం

2021 సెప్టెంబరులో ప్రకటించిన టెలికాం రంగం యొక్క సంస్కరణల ద్వారా స్పెక్ట్రమ్ వేలం మరింత ప్రయోజనం పొందింది. ఈ సంస్కరణల్లో వేలంలో పొందిన స్పెక్ట్రమ్‌పై సున్నా స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు (SUC) ఉన్నాయి. నిర్వహణ ఖర్చు పరంగా చూసుకున్న కూడా టెలికాం నెట్‌వర్క్‌ల సర్వీస్ ప్రదాతలకు ఉపశమనం అధికంగా లభిస్తుంది. అంతేకాకుండా వార్షిక వాయిదాకు సమానమైన ఇన్కమ్ బ్యాంకు గ్యారెంటీని సమర్పించాల్సిన అవసరం కూడా తొలగించబడింది.

కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ

కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G నెట్‌వర్క్‌ వ్యవస్థ ఇప్పుడు 5G నెట్‌వర్క్‌ల అప్ గ్రేడ్ దేశీయ అభివృద్ధికి దారితీస్తోంది. ముందుగా భారతదేశంలోని ఎనిమిది టాప్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లలో 5G టెస్ట్ బెడ్ సెటప్ ను దేశీయ 5G టెక్నాలజీతో ప్రారంభించడాన్ని వేగవంతం చేస్తోందని ప్రభుత్వం పేర్కొంది. అదనంగా మొబైల్ హ్యాండ్‌సెట్‌లు టెలికాం పరికరాల కోసం PLI (ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్స్) స్కీమ్ మరియు ఇండియా సెమీకండక్టర్ మిషన్ తో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించేందుకు మరియు బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు.

5G నెట్‌వర్క్‌

5G నెట్‌వర్క్‌లలో మొదటిసారి విజయవంతమైన బిడ్డర్‌లు ముందస్తు పేమెంట్ చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం వేలం ప్రకారం స్పెక్ట్రమ్ యొక్క పేమెంట్లను 20 సమాన వార్షిక వాయిదాలలో ప్రతి సంవత్సరం ప్రారంభంలో చెల్లించవచ్చు. ఈ చర్యతో నగదు అవసరాలను గణనీయంగా తగ్గించడంతో పాటుగా ఈ రంగంలో వ్యాపార వ్యయాన్ని కొద్ది శాతం అయినా కూడా తగ్గించవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. బిడ్డర్‌లకు 10 సంవత్సరాల తర్వాత బ్యాలెన్స్ ఇన్‌స్టాల్‌మెంట్‌లకు సంబంధించి భవిష్యత్తు బాధ్యతలు లేకుండా స్పెక్ట్రమ్‌ను సరెండర్ చేసే అవకాశం ఇవ్వబడుతుంది.

ఇండియాలో 5G రోల్‌అవుట్‌

ఇండియాలో 5G రోల్‌అవుట్‌ను మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం మరియు పరిశ్రమలు రెండు కూడా ఒకరికి ఒకరు సహకరించాలని ప్రధాని మోడీ కోరారు. 5G రోల్ అవుట్ అందుబాటులోకి వచ్చిన తరువాత వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు మరియు మరిన్ని రంగాలకు మరింత ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం లభిస్తుంది. 5G సాయంతో అనేక సాంకేతికతలలో వారి ఉత్పత్తులు, పరిష్కారాలు మరియు నమూనాలను ధృవీకరించడానికి టెలికాం పరిశ్రమ ఈ రంగంలో ఉన్న స్టార్టప్‌లకు ఇది మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Indian Government Union Cabinet Approves 5G Spectrum Auction to hold on July End

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X