8 యూట్యూబ్ ఛానెల్‌లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం!! కారణం ఏమిటో...

|

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రముఖ వీడియో ప్లాట్ఫారమ్ యూట్యూబ్ గురించి ప్రస్తుత కాలంలో తెలియని వారు ఉండరు. డబ్బును సంపాదించడం కోసం ఎక్కువ మంది సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌లను కూడా ప్రారంభిస్తున్నారు. 'భారత జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలు మరియు పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు' సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 8 యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేసింది.

 

యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లు

మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిన వాటిలో 7 భారతీయ మరియు 1 పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లు ఉన్నట్లు పేర్కొంది. బ్లాక్ చేయబడిన ఛానెల్‌లు లోక్తంత్ర TV, U&V TV, AM రజ్వీ, గౌరవశాలి పవన్ మిథిలాంచల్, SeeTop5TH, సర్కారీ అప్‌డేట్, సబ్ కుచ్ దేఖో మరియు పాకిస్తాన్ ఆధారిత న్యూస్ కి దున్యా వంటి ఛానెల్‌లు ఉన్నాయి. ఈ ఛానెల్‌లు అధికంగా భారత సాయుధ బలగాలు, జమ్మూ కాశ్మీర్ మొదలైన అంశాలపై తప్పుడు వార్తలను పోస్ట్ చేసినందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ

ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ, "భారత జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు మరియు పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు IT రూల్స్, 2021 కింద 7 భారతీయ మరియు 1 పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లను I&B మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానెల్‌లు 114 కోట్లకు పైగా వీక్షణలను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా 85 లక్షల 73 వేల మంది చందాదారులను కూడా కలిగి ఉన్నారు. యూట్యూబ్‌లో బ్లాక్ చేయబడిన ఛానెల్‌లు భారత వ్యతిరేక కంటెంట్‌తో డబ్బును సంపాదిస్తున్నారు.

యూట్యూబ్ ఛానెల్‌
 

"ఈ యూట్యూబ్ ఛానెల్‌లలో కొన్ని ప్రసారం చేసిన కంటెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలోని మత వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేయడం విధంగా ఉంది. బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానెల్‌ల యొక్క వివిధ వీడియోలలో తప్పుడు దావాలు చేయడమే కాకుండా మతపరమైన కట్టడాలను కూల్చివేయాలని భారత ప్రభుత్వం ఆదేశించినట్లు నకిలీ వార్తలను ప్రసారం చేసాయి. ఉదాహరణకు భారతదేశంలో మతపరమైన పండుగలు జరుపుకోవడం, మతపరమైన యుద్ధ ప్రకటనలు మొదలైనవాటిని భారత ప్రభుత్వం నిషేధించింది. అలాంటి కంటెంట్ దేశంలో మత సామరస్యాన్ని సృష్టించి, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు కనుగొనబడింది "అని ప్రభుత్వం పేర్కొంది.

న్యూస్ ఛానెల్‌

భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల 22 యూట్యూబ్ ఆధారిత న్యూస్ ఛానెల్‌లను నిరోధించాలని ఆదేశించింది. వాటిలో నాలుగు పాకిస్తాన్‌కు చెందినవి కూడా ఉన్నాయి. అవి జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు మరియు ప్రజా శాంతిని ప్రభావితం చేసే నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించింది. డిసెంబర్ 2021 నుండి జాతీయ భద్రత, సార్వభౌమత్వం మరియు భారతదేశ సమగ్రత, పబ్లిక్ ఆర్డర్ మొదలైన వాటి దృష్ట్యా 78 యూట్యూబ్ ఆధారిత న్యూస్ ఛానెల్‌లు మరియు అనేక ఇతర సోషల్ మీడియా అకౌంటులను బ్లాక్ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది.

ఉక్రెయిన్‌

"ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న పరిస్థితులకు సంబంధించి బ్లాక్ చేయబడిన భారతీయ యూట్యూబ్ ఆధారిత ఛానెల్‌లు ప్రచురించిన కంటెంట్ లో గణనీయమైన తప్పుడు సమాచారం ఉన్నట్లు గమనించారు. ఈ సమాచారం ఇతర దేశాలతో భారతదేశం యొక్క విదేశీ సంబంధాలను దెబ్బతీసే విధంగా ఉన్నట్లు ఉంది" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.

యూట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసుకోవ‌డం

యూట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసుకోవ‌డం

* యూట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసుకోవ‌డం చాలా సులువైన ప్ర‌క్రియ‌. మీరు కూడా యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా Gmail లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ Gmail స‌హాయంతో తో యూట్యూబ్ లో Sign in అవ్వాలి.

* యూట్యూబ్‌లోకి లాగిన్ అయిన త‌ర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ప‌లు ర‌కాల ఆప్ష‌న్స్ క‌న‌బ‌డ‌తాయి. వాటిలోనే రెండో ఆప్ష‌న్ "Create a New Channel" అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.

* "Create a New Channel" ఆప్ష‌న్ క్లిక్ చేసిన త‌ర్వాత మీకు ఒక విండో(బాక్స్‌) ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ ఛానల్ కి ఏ పేరు పెట్టాలనుకున్నారో ఆ పేరుని ఎంటర్ చెయ్యండి. దాంతో పాటు ఛానెల్ ప్రొఫైల్ పిక్చ‌ర్ ను అక్క‌డే అప్‌లోడ్ చేయండి. అంతే ఇక్కడితో మీ YouTube Channel క్రియేష‌న్ అయిపోతుంది.

* ఆ త‌ర్వాత మీ ఛానెల్‌లో పూర్తి వివ‌రాలు, ఛానెల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అనే వివ‌రాల్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం Customize Channel ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మీ ఛానల్ కి ఒక Logo ఇవ్వండి. అక్క‌డే మీరు Channel Description ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ గురించి వివరిస్తూ అంటే మీ ఛానల్ లో ఎటువంటి వీడియోలు అప్లోడ్ చెయ్యబోతున్నారు వంటి వివరాలు అన్నితెలియచేయండి.
అలాగే మీ Gmail, Facebook , Twitter వంటి సోషల్ మీడియా పేజీలకు సంబందించిన లింక్స్ ని కూడా Add చేసుకోవచ్చు.

* ఇక మీరు మీ యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. ఇందుకోసం ఛానెల్‌లో కుడి వైపు పై భాగంలో + సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ వీడియో ని యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యవచ్చు.

 

Best Mobiles in India

English summary
Indian Govt Banned Once Again 8 YouTube Channels For Spreading Wrong Information

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X