ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కోసం ‘సర్కార్ కొత్త స్కీమ్’

Posted By:

వివిధ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా తెలుసుకునే వీలును కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ సేవా సర్వీస్ (మొబైల్ సర్వీస్ డెలివరీ గేట్ వే)ను మరింత పటిష్టం చేసే క్రమంలో మరిన్ని అప్లికేషన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కాంటెస్ట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కాంటెస్ట్‌లో భాగంగా ప్రభుత్వ సేవలు, విద్యా, సోషల్ నెట్‌వర్కింగ్, జీవనశైళి (లైఫ్‌స్టైల్), ట్రావెల్, ఈ-హెల్త్, ప్రొడక్టివిటీ/టూల్స్ వంటి విభాగాలకు సంబంధించి ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో పాల్గొనాలనుకునే ఆండ్రాయిడ్ అప్లికేషన్ వృద్ధిదారులు మార్చి 31, 2013లోపు తమ అప్లికేషన్‌తో కూడిన దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కోసం ‘సర్కార్ కొత్త స్కీమ్’

ఈ పోటీల్లో భాగంగా మొదటి మూడు స్థానాలకు ఎంపికైన అప్లికేషన్‌లకు ప్రభుత్వం నగదు బహుమతులను అందించనుంది. మొదటి స్థానానికిగాను లక్ష, రెండవ స్థానానికిగాను రూ.50,000, మూడవ స్థానానికి గాను రూ.25,000ను అందించనున్నారు. విజేతల వివరాలను ఏప్రిల్ 10, 2013న ప్రకటిస్తారు. అర్హత పొందిన అప్లికేషన్‌లకు ప్రభుత్వ మొబైల్ సేవా అప్లికేషన్ స్టోర్‌లో స్థానం కల్పించటం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot