BSNL 4G లాంచ్ పై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి...

|

ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో స్వదేశీ టెక్నాలజీను ఉపయోగించి భారతదేశం అంతటా 4G నెట్‌వర్క్‌లను ప్రారంభించాలని ఉన్నట్లు ఇప్పటికే ధృవీకరించింది. BSNL నేరుగా దేశంలో 5Gని ప్రారంభించడం లేదు. ఇతరులు 5Gకి మారినప్పుడు టెల్కో ఎందుకు 4Gకి వెళుతోంది అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. BSNL ముందుగా 5Gకి వెళ్లాలనుకుంటే, అది 5G SA (స్టండలోన్)ని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇది మరింత ఖర్చుతో కూడుకున్నది కావున కంపెనీకి పెద్దగా ప్రయోజనం కలిగించదు.

BSNL 5G NSA

కానీ 4G కోర్‌తో ఇది 5G NSA (నాన్-స్టాండలోన్)ని కూడా అమలు చేయగలదు కావున స్పష్టంగా చెప్పాలంటే ఇది ప్రస్తుతానికి మెరుగైన ఎంపికగా ఉంది. 5G NSA అనేది ఇప్పుడు ఎందుకు లాజికల్ ఆప్షన్ లో ఉత్తమ పద్ధతి అని భారతీ ఎయిర్‌టెల్ CEO గోపాల్ విట్టల్ వివరించారు. BSNL వీలైనంత వేగంగా 4Gని ప్రారంభించాలని మరియు వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరచాలని భారత ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ప్రభుత్వం BSNLకి ఎందుకు మద్దతు ఇస్తుందో వంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL భారతీయ వినియోగదారుల కోసం ప్లేయింగ్ ఫీల్డ్ లెవెల్

BSNL భారతీయ వినియోగదారుల కోసం ప్లేయింగ్ ఫీల్డ్ లెవెల్

BSNL 4G మార్కెట్‌లోకి ప్రవేశించడం వలన ప్రైవేట్ టెల్కోలు కూడా 4G సేవలపై స్థిరంగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. 4G అందుబాటులోకి రావడంతో BSNL యొక్క చందాదారుల మార్కెట్ వాటాను మరింత పెంచుకునే అవకాశం ఉంది. ప్రైవేట్ టెల్కోల నుండి వినియోగదారులు పొందే వాటితో పోలిస్తే BSNL చాలా సరసమైన టారిఫ్‌లను అందిస్తుంది. సమీప భవిష్యత్తులో ప్రైవేట్ కంపెనీలు టారిఫ్‌లను పెంచుతున్నందున రెండవ సీఎం ఎంపికగా ఎంచుకునే వినియోగదారులకు BSNL యొక్క సిమ్ మంచి చాయిస్ అవుతుంది.

BSNL

ప్రభుత్వం నిర్ధారించాలనుకునే ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రైవేట్ టెల్కోలు పెట్టుబడులను పెట్టడానికి ఇష్టపడని వెనుకబడిన ప్రాంతాలకు కూడా తమ యొక్క కనెక్టివిటీ సేవలను చేర్చే ఉద్దేశంతో BSNL ప్రస్తుతం పనిచేస్తోంది. ఎందుకంటే అది సానుకూల ROI (పెట్టుబడిపై రాబడి)ని వాగ్దానం చేయదు. కానీ BSNL దానిని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మరియు USOF (యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్) సహాయంతో చేయగలదు. BSNL యొక్క విజయం చివరకు భారతీయ వినియోగదారులు వేగవంతమైన మొబైల్ కనెక్టివిటీ సేవల కోసం వెతుకుతున్నప్పుడు మూడు కంటే ఎక్కువ ఎంపికలను కలిగి ఉండేలా చేస్తుంది.

BSNL ఉద్యోగులు

భారత టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ BSNL ఉద్యోగులు తమ "సర్కారీ వైఖరి"ని విడిచిపెట్టి అంకితభావంతో పని చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ టెల్కో కోసం కేంద్రం ప్రకటించిన రూ.1.64 లక్షల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ నేపథ్యంలో ఇది వచ్చింది. ఇది BSNL యొక్క 4G కాపెక్స్ ఖర్చు కవర్ చేయబడిందని మరియు టెల్కో అనేక భాగాలలో 4Gని వీలైనంత వేగంగా ప్రారంభించగలదని నిర్ధారిస్తుంది.

BSNL 90 రోజుల వ్యాలిడిటీతో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్లు

BSNL 90 రోజుల వ్యాలిడిటీతో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్లు

BSNL వినియోగదారులు 90 రోజుల వ్యాలిడిటీతో రూ.500 లోపు పొందగలిగే మొదటి ప్లాన్ రూ.499 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్. దీనితో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, 2GB రోజువారీ డేటా మరియు రోజుకి 100 SMS ప్రయోజనాలను పొందుతారు. ఇది BSNL ట్యూన్స్‌తో కూడిన జింగ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది. 90 రోజుల వ్యాలిడిటీతో లభించే రెండవ ప్లాన్ రూ.485 ధర వద్ద లభిస్తుంది. దీనితో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్‌, 1.5GB రోజువారీ డేటా మరియు 100 SMS/రోజుకు ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ 90 రోజుల వాలిడిటీతో వస్తుంది. మీరు BSNL యొక్క నెట్‌వర్క్ కవరేజ్ అద్భుతంగా లభించే ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే ఈ రెండు ప్లాన్లు అద్భుతమైన ఎంపికలు అని చెప్పవచ్చు. లేకపోతే ప్లాన్‌లు సరసమైనవి అయినప్పటికీ సరైన నెట్‌వర్క్ సర్వీస్ లేకపోతే అవి మీకు పనికిరావు.

Best Mobiles in India

English summary
Indian Govt Pushing BSNL 4G Launch Very Soon: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X