5జీలో మనమే ముందుండాలి.. చైనా, జపాన్‌లతో పోటీకి సై

మొబైల్ ఇంటర్నెట్ విభాగంలో శరవేగంగా విస్తరించేందుకు భారత్ నుడం బిగించింది. చైనా, జపాన్ వంటి దేశాలకు ధీటుగా 2జీ, 3జీ, 4జీ టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకురావటంలో భారత్ వెనకబడిపోయిన విషయం తెలిసిందే.

5జీలో మనమే ముందుండాలి.. చైనా, జపాన్‌లతో పోటీకి సై

Read More : మోటో జీ4, మోటో జీ4 ప్లస్ ఫోన్‌లకు 'Nougat'

అయితే 5జీ టెక్నాలజీ విషయంలో ప్రపంచదేశాలకు ధీటుగా ముందుకు సాగాలని మోదీ సర్కార్ భావిస్తోంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2020 నాటికి భారత్‌లో పూర్తిస్థాయిలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

100 పైగా పేటెంట్లు..

5జీ టెక్నాలజీ రూపకల్పనకు సంబంధించి ఓ రిసెర్చ్ బృందాన్ని ఇప్పటికే భారత్ ప్రభుత్వం నియమించింది. ఈ కమీషన్ ఇప్పటి వరకు 100 పైగా పేటెంట్లను ఫైల్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిసెర్చ్ బృందంలో

భారత్ లో 5జీ టెక్నాలజీ రూపకల్పనకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందంలో ఐఐఎస్‌సీ బెంగుళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్, సెంటర్ ఫర్ ఎక్సె‌లెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీలకు చెందిన పరిశోధకులు ఉన్నారు.

10 పేటెంట్లకు ఇప్పటికే అమోదం..

5జీ టెక్నాలజీ ఈ బృందం ఫైల్ చేసిన 100 పేటెంట్లలో 10 పేటెంట్లు ఇప్పటికే అమోదం పొందగా, మిగిలిన పేటెంట్లు పరిశీలనలో ఉన్నాయి. రానున్న సంవత్సరాల్లో మరిన్ని పేటెంట్లను ఫైల్ చేసేందుకు ఈ బృందం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

2015లో అంకురార్పణ ..

5జీ రిసెర్చ్ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం సెప్టంబర్ 2015లో అంకురార్పణ చేసింది. ఈ టెక్నాలజీకి అనుకూలించే వినూత్న విధానాలను మూడేళ్ల కాలంలో అభివృద్థి చేసేందుకు రూ.36.51 కోట్ల నిధులను కూడా కేంద్రం కేటాయించింది.

కమ్యూనికేషన్ సేవలు మరింత శరవేగంగా..

5జీ నెట్ వర్క్ అందుబాటులోకి రావటం వల్ల వినియోగదారులకు కమ్యూనికేషన్ సేవలు మరింత వేగంగా అందుతాయి. 

డ్రైవర్‌లెస్ కార్లు, స్మార్ట్ గృహోపకరణాలు

ముఖ్యంగా స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి మరింతగా దోహదపడే 5జీ ఇంటర్నెట్ ద్వారా డ్రైవర్‌లెస్ కార్లు, స్మార్ట్ గృహోపకరణాలకు అనుసంధానమయ్యే అవకాశముంటుంది.

స్విడెన్, చైనాలలో 5జీ ట్రెయిల్స్

స్విడెన్ రాజాధాని Stockholm ఇప్పటికే తమ ప్రాంతంలో 5జీ ట్రెయిల్స్‌ను కండక్ట్ చేసింది. మరోవైపు చైనా కూడా 5జీ ట్రెయిల్స్‌ను కండక్ట్ చేస్తోంది. 2020 నాటికి పూర్తిస్థాయిలో 5జీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఈ దేశాలు భావిస్తున్నాయి.

హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్‌ అవసరం...

ప్రపంచదేశాలకు ధీుటుగా భారత్ కూడా 5జీ రేసులో ముందుండాలంటే హై-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్‌కు అవసరమైన వనరులను పూర్తిస్థాయిలో సమకూర్చుకోవల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indian Govt Starts Early Research on 5G. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot