Smartphone యూజ‌ర్ల‌కు ఛార్జర్ క‌ష్టాలు క‌ట్‌.. ఒకే ఛార్జ‌ర్ విధానం రాబోతోందా!

|

గ‌తంలో Smartphone యూజ‌ర్ల‌కు త‌మ డివైజ్‌ల‌ ఛార్జింగ్ కోసం ఒకే ర‌క‌మైన సాధార‌ణ పిన్ ఉండేది. క్ర‌మంగా కాలానుగుణంగా మార్కెట్లో ర‌క‌ర‌కాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చాయి. విభిన్న ర‌కాల స్మార్ట్‌ఫోన్ల‌తో పాటు కంపెనీలు విభిన్న ఛార్జ‌ర్ల‌ను అందుబాటులోకి తెచ్చాయి. టైప్-సి, మైక్రో యూ‌ఎస్‌బీ, టైప్-బి, టైప్-ఎ వంటి ఛార్జర్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ర‌క‌ర‌కాల ఛార్జ‌ర్ల వ‌ల్ల వినియోగ‌దారుల‌కు ఎక్క‌డికైనా వెళ్లిన‌ప్పుడు త‌మ మొబైల్‌కు సంబంధించిన ఛార్జ‌ర్ మ‌రిచిపోతే ఇక వారి తిప్ప‌లు కూడా ప్రారంభ‌మ‌వుతున్నాయి. అంతేకాకుండా ఇలా ర‌క‌ర‌కాల ఛార్జ‌ర్ల వ‌ల్ల దేశంలో ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్థాలు కూడా పెరుగుతున్నాయి.

 
Smartphone యూజ‌ర్ల‌కు ఛార్జర్ క‌ష్టాలు క‌ట్‌.. ఒకే ఛార్జ‌ర్ విధానం రాబ

దీంతో యూజ‌ర్ల క‌ష్టాల‌తో పాటు దేశంలో పెరుగుతున్న‌ ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్థాల‌ను త‌గ్గించే దిశగా కేంద్రం మ‌రో ముంద‌డుగు వేయ‌బోతోంది. ప్ర‌స్తుతం దేశంలో విభిన్న స్మార్ట్‌ఫోన్లు విభిన్న రకాల ఛార్జర్‌లు లేదా ఛార్జింగ్ పోర్ట్‌లను కలిగి ఉన్నాయి. ఈ కార‌ణంగా ఛార్జ‌ర్ల వినియోగం ఎక్కువై.. ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్థాలు పెర‌గ‌డ‌మే కాకుండా.. వినియోగదారులు కూడా ఎక్క‌డికైనా వెళ్లిన‌ప్పుడు తమ డివైజ్‌ల కోసం అనేక ఛార్జర్‌లను తీసుకెళ్లాల్సి వ‌స్తోంది. అయితే, ఈ ఇబ్బందుల‌కు స్వ‌స్తి ప‌లికేందుకు ప్ర‌భుత్వం యోచిస్తోంది. అన్ని డివైజ్‌ల‌కు సాధారణ ఒకే ర‌క‌మైన (యూనివ‌ర్స‌ల్ ఛార్జ‌ర్‌) ఛార్జర్‌ను స్వీకరించే విధంగా భారత ప్రభుత్వం రెక‌మెండ్‌ చేస్తోంది. ఈ మేర‌కు PTI నివేదిక ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించింది.

Smartphone యూజ‌ర్ల‌కు ఛార్జర్ క‌ష్టాలు క‌ట్‌.. ఒకే ఛార్జ‌ర్ విధానం రాబ

PTI నివేదిక ప్రకారం, ఎలక్ట్రానిక్ డివైజ్‌ల విష‌యంలో వేర్వేరు ఛార్జర్‌ల వాడ‌కం గురించి చర్చించడానికి ప్రభుత్వం ఆగస్టు 17, 2022న పరిశ్రమల వాటాదారుల సమావేశాన్ని ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌నుంది. వేర్వేరు ఛార్జర్‌ల అవసరం కారణంగా ఎల‌క్ట్రానిక్-వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్న‌ట్లు ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుకే ఈ నిర్ణ‌యం ఒకే ఛార్జ‌ర్ నియ‌మానికి శ్రీ‌కారం చుట్టే ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తున్న‌ట్లు నివేదిక పేర్కొంది. ఈ నిర్ణ‌యం ద్వారా వినియోగ‌దారులు ర‌క‌ర‌కాల ఛార్జర్లు కొనాల్సిన ప‌ని త‌ప్ప‌నుంది.

ఇప్ప‌టికే యూరప్ మరియు యుఎస్ మార్కెట్‌లలో, స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లు వంటి పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం యూనివ‌ర్స‌ల్‌ ఛార్జింగ్ సొల్యూషన్‌ను అందించాలని ప్ర‌భుత్వం కంపెనీలను కోరడం జరిగింది. ఐఫోన్‌లలో ఛార్జింగ్ కోసం ప్రామాణిక USB టైప్-సి పోర్ట్‌ను అందించమని EU (యూరోపియన్ యూనియన్) ఇప్పటికే కంపెనీని కోరినందున Apple ఐరోపాలో దాని లైట్నింగ్ పోర్ట్‌ను వదిలివేయవలసి వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. అమెరికా మార్కెట్‌లోనూ ఇదే డిమాండ్‌ ఉంది.

Smartphone యూజ‌ర్ల‌కు ఛార్జర్ క‌ష్టాలు క‌ట్‌.. ఒకే ఛార్జ‌ర్ విధానం రాబ

అందువల్ల, భారతదేశం కూడా అదే మాదిరిగా ఒత్తిడి చేయవలసిన అవసరం ఉంద‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. లేకపోతే, యాపిల్ వంటి కంపెనీలు స్టాండర్డ్ కాని ఛార్జింగ్ పరికరాలన్నింటినీ భారతదేశంలో డంప్ చేస్తాయి. త‌ద్వారా అది డివైజ్‌ల దీర్ఘకాలిక విలువకు కీడు చేసే ప్ర‌మాదం ఉంది.. అంతేకాకుండా, ఇ-వ్యర్థాల పెరుగుదలకు కూడా దారి తీస్తుంది.

ప్రస్తుతం, చాలా కంపెనీలు తమ వినియోగదారులను ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాలని నియమం విధించాయి. చాలా వరకు పోర్టబుల్ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఒక ఛార్జర్ సరిపోతుంది కాబట్టి ప్రతిసారీ ఇలా కొత్త ఛార్జ‌ర్ల‌ను కొనే ప‌ని ఉండ‌కూడ‌ద‌ని.. ఈ ర‌క‌మైన విధానానికి కేంద్రం శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. ఒక‌వేళ ఈ విధానం అందుబాటులోకి వ‌స్తే స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు రక‌ర‌కాల ఛార్జ‌ర్లంటూ తిప్ప‌లు త‌ప్ప‌నున్నాయి.

 

ఇప్ప‌టికే ఈయూ ఒకే యూనివర్సల్ ఛార్జర్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. త‌ద్వారా ఒక పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాల తగ్గింపు ఉంటుంది, కానీ యూరోపియన్ యూనియన్ నిర్ణయంపై ఆపిల్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన‌ట్లు తెలుస్తోంది. యూనివర్సల్ ఛార్జర్ వచ్చిన తర్వాత కొత్త ఆవిష్కరణలకు ఎండ్ పడుతుందని, కాలుష్యం కూడా పెరుగుతుందని ఆపిల్ గ‌తంలో తెలిపిన‌ట్లు స‌మాచారం. అయితే దీని వెనుక ఉన్న కారణం ఆపిల్ చెప్పలేదు.

Best Mobiles in India

English summary
Indian Govt to Push for Common Charger for all Devices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X