ఉద్యోగం కోసం ప్రయత్నించే ఐటి నిపుణులకు శుభవార్త

Posted By: Super

ఉద్యోగం కోసం ప్రయత్నించే ఐటి నిపుణులకు శుభవార్త

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగం కోసం ప్రయత్నించే ఐటి నిపుణులకు శుభవార్త. 2012 ఏప్రిల్‌తో ప్రారంభ మయ్యే సంవత్సరానికి 65,000 హెచ్‌-1బి వీసాలు మంజూరుచేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం వచ్చే అక్టోబర్‌ నెలనుంచి భారత్‌లోని ఐటి నిపుణులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 65వేల వీసాలలో అమెరికాలో ఎంఎస్‌ చేసిన నిపుణులకోసం 20,000 కేటాయిం చినట్లు యుఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యుఎస్‌సిఐఎస్‌) అధికారులు వెల్లడించారు.

విదేశాల లోని నిపుణులు అమెరికాలో పని చేయడానికి హెచ్‌-1బి వీసాలు మంజూరు చేస్తారు. కొన్ని ప్రత్యేక రంగాలలో శిక్షణ పొందిన నిపుణులకు మాత్రమే ఈ అవశాకం లభిస్తుంది. కాగా, హెచ్‌-1బి వీసాలనుంచి అత్యధికంగా లబ్ధిపొందేది భారత్‌కు చెందిన ఐటి నిపుణులే కావడం విశేసం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot