ఇంటెలిజెన్స్ హెచ్చరిక: లడఖ్ సమీపంలోని పవర్ గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకున్న చైనీస్ హ్యాకర్లు...

|

చైనా మరియు భారత్ రెండు దేశాల మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి చిన్న పాటి తగాదాలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిన విషయమే. గత సంవత్సరం గాల్వాన్ ప్రాంతంలో జరిగిన ఉధృక్తితితో తారాస్థాయికి చేరుకున్నాయి. చైనా వెనక్కి తగ్గినా కూడా తన యొక్క అక్కసును వివిధ రూపాలలో చూపుతున్నది. అందులో భాగంగానే చైనా ఇప్పుడు వారికి అనుగుణంగా పనిచేసే హ్యాకర్ల సహాయం తీసుకున్నది. వివరాలలోకి వెళ్తే చైనా యొక్క గవర్నమెంట్ కు అనుగుణంగా పనిచేసే హ్యాకర్లు ఇటీవలి నెలల్లో ఇండియాలో లడఖ్ సమీపంలోని విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారని ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ రికార్డ్డ్ ఫ్యూచర్ ఒక నివేదికను విడుదల చేసింది. లడఖ్ సమీపంలో ఉన్న ప్రాంతాల్లో గ్రిడ్ నియంత్రణ మరియు విద్యుత్ వ్యాప్తిని నిర్వహించే ఏడు "లోడ్ డిస్పాచ్" కేంద్రాలపై చైనా హ్యాకర్లు దృష్టి సారించారని నివేదిక పేర్కొంది.

Indian Intelligence Alert: Chinese Hackers Targets Electric Power Grid Near Ladakh Stations

"ఇటీవలి నెలల్లో పలు రాష్ట్రాలలో గ్రిడ్ నియంత్రణ మరియు విద్యుత్ నిర్వహణ యొక్క రియల్-టైమ్ కార్యకలాపాలను నిర్వహించడానికి బాధ్యత వహించే 7 ఇండియన్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్‌లను (SLDCలు) లక్ష్యంగా చేసుకుని వాటి నెట్‌వర్క్ లలో చొరబాటు అవ్వడాన్ని మేము గమనించాము. ముఖ్యంగా ఈ లక్ష్యం ఉత్తర భారతదేశంలోని లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో గల భౌగోళికంగా కేంద్రీకృతమైన SLDCలుగా గుర్తించడం జరిగింది" అని సంస్థ తన నివేదికలో పేర్కొంది.

Indian Intelligence Alert: Chinese Hackers Targets Electric Power Grid Near Ladakh Stations

TAG-38 పేరుతో గల హ్యాకింగ్ గ్రూప్ మరియు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రెండు కలిసి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీకి సంబంధించిన హానికరమైన సాఫ్ట్‌వేర్ 'షాడోప్యాడ్'ని ఉపయోగించిందని రికార్డ్డ్ ఫ్యూచర్ తన నివేదికలో పేర్కొంది.

Best Mobiles in India

English summary
Indian Intelligence Alert: Chinese Hackers Targets Electric Power Grid Near Ladakh Stations

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X