యంగ్ ఇండియన్ జీనియస్లు చేసిన 6 ఆవిష్కరణలు

|

ఇండియాలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు.ముఖ్యంగా యువతలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు."ఈ ట్రాఫిక్ అంతా చూడండి". "చాలా కాలుష్యం ఉంది". "ప్రజలు రహదారులను ఎందుకు శుభ్రంగా ఉంచలేరు?" గత వారంలో మీరు ఈ పంక్తులను ఎన్నిసార్లు పలికారు?.

యంగ్ ఇండియన్ జీనియస్లు చేసిన 6 ఆవిష్కరణలు

 

ఇలాంటివి ఫిర్యాదు చేస్తున్నప్పుడు కొంతమంది యువ భారతీయులు మన దైనందిన జీవితాన్ని మెరుగుపరిచేందుకు వినూత్న పరిష్కారాలను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరం వారి ఆవిష్కరణలతో మన కష్టాలను తగ్గించడానికి నిశ్శబ్దంగా పనిచేస్తున్న 21 ఏళ్లలోపు యువత యొక్క జాబితా ఇక్కడ ఉంది.

1) ‘దృష్టి లోపం ఉన్నవారి కోసం కళ్లఅద్దాలు(గాగుల్స్)’:

అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన పన్నెండో తరగతి విద్యార్థి అనంగ్ టాడర్ దృష్టి లోపం ఉన్న వారికి సహాయపడటానికి మరియు నావిగేట్ చేయడానికి "హ్యాండ్స్ ఫ్రీ" తో ఒక జత అద్దాలను అభివృద్ధి చేశాడు.

టాడర్ యొక్క గాగుల్స్ G4B గా సూచిస్తారు.ఇందులో ఎకోలొకేషన్ టెక్నాలజీని ఉపయోగించారు.ఇది గబ్బిలాలు తమ పరిసరాలను గ్రహించే విధానాన్ని అనుకరిస్తాయి. దృష్టి లోపం ఉన్నవారిని దాని ఫీల్డ్ వ్యూ నుండి 2 మీటర్ల లోపు ఉన్న వస్తువులకు అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుంది.

అతని ఆవిష్కరణకు గాను ఈ ఏడాది మార్చిలో అతను దిననాథ్ పాండే స్మార్ట్ ఐడియా ఇన్నోవేషన్ అవార్డును గెలుచుకున్నాడు. మరియు నివేదికల ప్రకారం UNICEF అతని నమూనాను మార్కెట్ కోసం ఆసక్తి చూపింది.

2) బీ సేవర్ బాట్
 

2) బీ సేవర్ బాట్

పన్నెండేళ్ల కావ్య విఘ్నేష్ తేనెటీగలను అంతరించిపోకుండా కాపాడాలని భావిస్తున్నది.ఈ డిల్లీ అమ్మాయి మరియు ఆమె బృందం లెగో మైండ్‌స్టార్మ్స్ EV3 రోబోటిక్స్ కిట్‌లో ‘లైట్నైట్ మెక్‌క్వీన్' అనే మారుపేరుతో తేనెటీగ సేవర్ బాట్‌ను నిర్మించారు.

ఈ పరిష్కారం మిలియన్ల తేనెటీగలను గాయపరచకుండా కాపాడుతుంది.వాస్తవానికి వాటిని తేనెటీగ పొలాలగా మార్చవచ్చు అక్కడ మన ఆహార గొలుసుకు ఎంతో దోహదపడే విధంగా మళ్ళీ పొలాలకు తిరిగి రావచ్చు.

తమను తాము సూపర్‌కాలిఫ్రాగిలిస్టైక్స్పియాలిడోసియస్ అని పిలిచే యువ ఆవిష్కర్తలు, మేలో ఆర్హస్‌లో జరిగిన మొదటి లెగో లీగ్ - యూరోపియన్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన భారతదేశపు అతి పిన్న వయస్కుడైన జట్టు. యూరోపియన్ రోబోటిక్స్ పోటీలో ఈ జట్టు రెండవ స్థానంలో నిలిచింది.

3) ప్రపంచంలోని అతి చిన్న ఉపగ్రహం:

తమిళనాడులోని కరూర్‌కు చెందిన 18 ఏళ్ల రిఫాత్ షారూక్ జూన్‌లో నాసా అంతరిక్షంలోకి 3D-ప్రింటెడ్ ఉపగ్రహాన్ని పంపడానికి ఇతను అతి చిన్న ఉపగ్రహంను నిర్మించి చరిత్రను సృష్టించాడు.

ఎపిజె అబ్దుల్ కలాం పేరు మీద ఉన్న 'కలామ్‌సాట్' ప్రపంచంలోనే అతి చిన్న ఉపగ్రహం.దేని బరువు కేవలం 64 గ్రాములు.

4) శక్తి-సమర్థవంతమైన కారు:

ఈ ఏడాది మార్చిలో ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్ నుండి 15 మంది బాలికల బృందం సింగపూర్‌లోని షెల్ ఎకో మారథాన్‌లో వారు తయారు చేసిన శక్తి-సమర్థవంతమైన కారుతో సందడి చేసారు.

ఆసియాకు చెందిన ఏకైక మహిళా జట్టుగా పేరుపొందిన ‘టీమ్ పాంథెరా' 18-21ఏళ్ళ లోపు వున్న15 మంది ఇంజనీర్లతో కూడిన ఐరిస్ 2.0 పెర్సర్వరెన్స్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది ఈవెంట్ అవార్డును గెలుచుకుంది.ఈ మూడు చక్రాల కారు 300 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

5) నిశ్శబ్ద గుండెపోటులను గుర్తించడానికి స్కిన్ ప్యాచ్:

తమిళనాడుకు చెందిన పదవ తరగతి విద్యార్థి ఆకాష్ మనోజ్ 'నిశ్శబ్ద గుండెపోటు'లను గుర్తించగల స్కిన్ ప్యాచ్‌ను అభివృద్ధి చేశాడు. అతని స్కిన్ ప్యాచ్ చెవికి లేదా మణికట్టుకు జతచేయబడి ఒక ‘పాజిటివ్' ఎలక్ట్రికల్ ప్రేరణను విడుదల చేస్తుంది. ఇది గుండెపోటుకు సంకేతం ఇవ్వడానికి గుండె విడుదల చేసే నెగిటివ్ చార్జ్ చేయబడే ప్రోటీన్‌ను ఆకర్షిస్తుంది.

6) 3-డి ప్రింటెడ్ శానిటరీ నాప్కిన్ డిస్పెన్సర్:

ముంబై కేథడ్రల్ మరియు జాన్ కానన్ స్కూల్ యొక్క XIIవ తరగతి ముగ్గురు విద్యార్థులు ఈ సంవత్సరం ఏప్రిల్‌లో తమ పాఠశాల కోసం 3D ప్రింటెడ్ శానిటరీ నాప్కిన్ డిస్పెన్సర్‌ను నిర్మించి ఏర్పాటు చేశారు.

దేవికా మల్హోత్రా, మాలిని దాస్‌గుప్తా, మరియు అదితి ఆర్య ముగ్గురు కలిసి 3D ప్రింటెడ్ డిస్పెన్సర్‌ను నిర్మించారు. ఇది శానిటరీ న్యాప్‌కిన్‌లను విడుదల చేయడానికి కాయిల్ మరియు లైట్ సెన్సార్‌ను ఉపయోగిస్తుందని తెలిపారు.

దేశంలోని నిరుపేద బాలికలకు తమ ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చే మార్గాలను పరిశీలించడానికి బాలికలు ఎన్జీఓలను సంప్రదించాలని యోచిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
indian inventions by youngsters

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more