ఇండియన్ ఐటి ఇంకా పురిట్లోనే ఉంది: నారాయణ మూర్తి

Posted By: Staff

ఇండియన్ ఐటి ఇంకా పురిట్లోనే ఉంది: నారాయణ మూర్తి

మంబై: ఇండియన్‌ ఐటి ఇండస్ట్రీ వృద్ధి బాటలో ప్రారంభ దశలోనే ఉందని ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. ఇంకా పురిట్లోనే ఉన్న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రాబోయే తరంలో ఎంతో ఎదుగుదలను చూడనుందని ఆయన అన్నారు. ఇన్ఫోసిస్‌ను తాను మిస్‌ అవుతున్నానని భావించడం లేదని ఆయన అన్నారు. అమెరికాలో నెలకొన్న పరిస్థితులు డబుల్‌ డిప్‌ రెసిషన్‌కు దారితీస్తాయనడానికి సంకేతాలు లేవని అన్నారు.

ఇన్పోసిస్ చీఫ్‌గా కెవి కామత్‌కు సోమవారం నాడు బాధ్యతలు అప్పగించిన ఆయన ఇటి నౌ చానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. అమెరికా చరిత్రలో క్రెడిట్‌ రేటింగ్‌ డౌన్‌గ్రౌడ్‌ కావడం ఇదే తొలిసారని, దీన్ని పాజిటివ్‌గా తీసుకుని నియమిత వృద్ధి లక్ష్యాల దిశగా యుఎస్‌ నడిచే అవకాశం దగ్గరైందని, దీన్ని ఆ దేశం ఎలా అందిపుచ్చుకుంటుందన్నదే ఆసక్తికరమని ఆయన అన్నారు. భారత్‌లో ఐటి ఇండస్ట్రీ ఎంతగా విస్తరించిందనుకున్నా అన్ని కంపెనీల సంయుక్త ఆదాయం 60 నుంచి 70 బిలియన్‌ డాలర్ల వరకూ ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఐటి సేవల కోసం వెచ్చిస్తున్న సొమ్ముతో పోలిస్తే ఇది నామమాత్రమేనని ఆయన వివరించారు.

కాగ్నిజంట్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ను మరో సంవత్సరంలో అధిగమిస్తుందని వస్తున్న విశ్లేషణలపై స్పందిస్తూ, ఒక భారత కంపెనీగా కాగ్నింజంట్‌ చూపుతున్న పనితీరును తాను ప్రశంసిస్తున్నానని, అయితే, తనకున్న సమస్యలేంటో, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఇన్ఫోసిస్‌కు తెలుసునని అన్నారు. ఆదాయాల పరంగా సంస్థకు వచ్చిన చిన్న సమస్యలు చాలా త్వరలోనే తొలగిపోతాయని అన్నారు. గత సంవత్సరం ఇన్ఫోసిస్‌ 25.8 శాతం వృద్ధిని సాధించిందని, ఇది భారత ఐటి సరాసరి గ్రోత్‌ కన్నా 50 శాతం అధికమని గుర్తు చేశారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting