అంచనాలను తలక్రిందులు చేసిన ఇండియన్ ఐటీ

అది అక్టోబర్, 2016.. ఇండియన్ ఐటి సెక్టార్ అభివృద్థి పదంలో నడుస్తోన్న రోజులవి. అంతా సజావుగా జరుగుతుందనుకుంటోన్న తరుణంలో ఉలిక్కిపాటుకు గురయ్యే వార్త ఒకటి ఇండియన్ ఐటీని కలవరపెట్టడం మొదలుపెట్టింది.

|

అది అక్టోబర్, 2016.. ఇండియన్ ఐటి సెక్టార్ అభివృద్థి పదంలో నడుస్తోన్న రోజులవి. అంతా సజావుగా జరుగుతుందనుకుంటోన్న తరుణంలో ఉలిక్కిపాటుకు గురయ్యే వార్త ఒకటి ఇండియన్ ఐటీని కలవరపెట్టడం మొదలుపెట్టింది. ఇండియన్ ఐటి సెక్టార్ చచ్చిపోబోతుదంటూ గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ బ్లూంబర్గ్ (Bloomberg) ఓ షాకింగ్ కాలమ్‌ను ప్రచురించింది. మార్కెట్లో శరవేగంగా విస్తరిస్తోన్న రోబోటిక్స్ ఇంకా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాయన్నది ఈ కాలమ్ సారాంశం కావటంతో ఇండియన్ ఐటీలో భయాందోళణలు మిన్నంటాయి.

indian-it-sector-was-forecast-to-die-4-ways-it-companies-changed-in-2018-to-deal-with-this

అలా అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మనం 2018 చివరి అంకానికి వచ్చేసాం. బ్లూంబర్గ్ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియన్ ఐటీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ రెండేళ్ల కాలంలో టీసీఎస్ రెండు అంకెల అభివృద్థిని నమోదు చేయగా ఇన్ఫోసిస్ ట్రేడ్ పండితుల అంచనాలను బీట్ చేయగలిగింది.

వాస్తవానికి, 2016 నుంచి 2018 మధ్య ఎన్నో కఠినమైన సవాళ్లను ఇండియన్ ఐటీ ధీటుగా ఎదుర్కోగలిగింది. ఉద్యోగాల కోత దగ్గర నుంచి ఎంప్లాయ్ ట్రెయినింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో అనేక మార్పుచేర్పులను ఇండియన్ ఐటీ కంపెనీలు అమలు చేసాయి. 2018లో ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఏ విధమైన మార్పు చేర్పులు చోటుచేసుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

వన్‌ప్లస్‌కి భారీ షాక్ ఇవ్వనున్న శాంసంగ్వన్‌ప్లస్‌కి భారీ షాక్ ఇవ్వనున్న శాంసంగ్

స్థానికతకు పెద్దపీట..

స్థానికతకు పెద్దపీట..

ఇండియన్ ఐటీ సెక్టార్‌లో ఈ ఏడాదికిగాను చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులలో లోకల్ హైరింగ్ ఒకటి. దేశవిదేశాల్లో కార్యకలాపాలు సాగిస్టోన్న ప్రతి ఇండియన్ ఐటీ కంపెనీ కూడా స్థానికతకు పెద్దపీట వేసే ప్రయత్నం చేసింది. రానున్న రెండు సంవత్సరాలకుగాను 10,000 మంది అమెరికన్లను హైర్ చేసుకోబోతున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇదే సమయంలో కాగ్నిజెంట్ కూడా 25,000 మందిని హైర్ చేసుకోబోతున్నట్లు తెలపింది. టీసీఎస్, విప్రో వంటి దిగ్గజ ఐటీ సంస్థలు సైతం లోకల్ హైరింగ్ టాప్ ఎజెండాగా ఉంచాయి.

ఉద్యోగాల కోత..

ఉద్యోగాల కోత..

లోకల్ మార్కెట్లకు ప్రాధాన్యతను కల్పించే క్రమంలో ఇండియన్ ఐటీ కంపెనీలు ఇండియన్ ఎంప్లాయిస్‌ను తగ్గించుకోవల్సి వచ్చింది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే కాగ్నిజెంట్. 2017 చివరి నాటికి ఈ సంస్థలో మొత్తం 2,60,000 మంది ఉద్యోగులు ఉండే వారు. వీరిలో 1,80,000 మంది భారతీయులే. 2016తో కంపేర్ చేసినట్లయితే ఇండియన్ ఎంప్లాయిస్ సంఖ్య 8,000కు తగ్గింది. ఇదే సమయంలో కంపెనీ యూఎస్ ఇంకా యూరోప్ హెడ్‌కౌంట్‌లు 2900, 2300 చొప్పున పెరిగాయి.

 

 

ఆపరేషన్స్ ఆఫ్‌షోర్ (OffShore)కు మూవ్ అవుతున్నాయి..

ఆపరేషన్స్ ఆఫ్‌షోర్ (OffShore)కు మూవ్ అవుతున్నాయి..

యూఎస్ ప్రభుత్వం హెచ్-1బి వీసాలను మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో దేశంలోని లోకల్ టాలెంట్‌కు కొరతే ఏర్పడింది. దీంతో చాలా వరకు ఐటీ కంపెనీలు చాలా వరకు పని భారాన్ని ఆఫ్‌షోర్(OffShore)కు మూవ్ చేస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇన్ఫోసిన్ 71% వర్క్‌ను ఆఫ్‌షోర్(OffShore) నుంచే హ్యాండిల్ చేస్తోంది. ఇదే సమయంలో విప్రో, టీసీఎస్ వంటి సంస్థలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి.

 

 

వర్క్‌ఫోర్స్ యుటిలైజేషన్ మరింతగా మెరుగుపడింది..

వర్క్‌ఫోర్స్ యుటిలైజేషన్ మరింతగా మెరుగుపడింది..

గత రెండు సంవ్సతరాలుగా చూసినట్లయితే ఇండియన్ ఐటి సర్వీసెస్‌లో వర్క్‌ఫోర్స్ యుటిలైజేషన్ అనేది మరింతగా మెరుగుపడింది. అయితే, కొన్ని సవాళ్లు మాత్రం ఇండియా ఐటీని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రైసింగ్ ప్రెజర్ అనేది మరింతగా పెరిగిపోయింది.

 

 

Best Mobiles in India

English summary
Indian IT sector was forecast to die. 4 ways IT companies changed in 2018 to deal with this.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X