ఫోన్‌లో పోర్న్ వీడియోలు పెట్టుకున్నందుకు ఏం జరిగిందో చూడండి

స్మార్ట్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు ఉన్నాయని ఓ వ్యక్తికి జైలుశిక్ష వేసిన ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చోటుచేసుకుంది.

|

స్మార్ట్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు ఉన్నాయని ఓ వ్యక్తికి జైలుశిక్ష వేసిన ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చోటుచేసుకుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకెళితే ఇండియాకు చెందిన మన్‌ప్రీత్‌ సింగ్‌ ఫోన్‌లో చైల్డ్‌ పోర్నొగ్రఫీకి సంబంధించిన వీడియోలు ఉన్నాయని.. ఇది చట్టరిత్యా నేరమని అక్కడి పోలీసులు అతడిని కష్టడీలోకి తీసుకున్నారు. కాగా ఇది నేరమని తనకు తెలియదని బాధితుడు కోర్డు ముందు విన్నవించుకున్నాడు. అతని వాదన విన్న కోర్టు.. ఇంతకు ముందు అతనిపై ఎలాంటి కేసులు లేనందున ఏడు నెలల జైలు శిక్షను, ఐదు వందల డాలర్లను ఫైన్‌గా వేసింది. దీంట్లో రెండు నెలలు మాత్రమే జైలు శిక్ష అని, మంచి ప్రవర్తనతో మెలిగితే.. ఆ తరువాత వెయ్యి డాలర్ల పూచీ కత్తుతో బయటకు రావచ్చని తెలిపింది. అయితే ఆ ఐదు నెలలు కోర్టు పరిధిలోనే ఉండాలని అటు తరువాతే ఇండియాకు పంపుతామని కోర్టు తీర్పునిచ్చింది.

PUBG ఆడేందుకు మొబైల్ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్యPUBG ఆడేందుకు మొబైల్ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

ఫోక్సో చట్టం మరింత కఠినతరం

ఫోక్సో చట్టం మరింత కఠినతరం

మీ సెల్‌ఫోన్లో చిన్న పిల్లలపై తీసిన పోర్న్ వీడియోలు, ఫోటోలు ఉన్నాయా? ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేసేయండి. లేదంటే భారీ జరిమానాతో పోటు జైలుశిక్షకూ గురికావొచ్చు. చిన్న పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు తెచ్చిన ఫోక్సో చట్టాన్ని కేంద్ర మరింత కఠినతరం చేయబోతోంది.

తీవ్రతను బట్టి శిక్షలు

తీవ్రతను బట్టి శిక్షలు

ఈ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర మంత్రివర్గం గతేడాది ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 18 సంవత్సరాలు నిండని పిల్లలపై లైంగిక దాడికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని ప్రతిపాదించింది. 12 ఏళ్లలోపు చిన్నారులను రేప్ చేస్తే మరణశిక్ష విధించేలా ఇప్పటికే వివిధ రాష్ట్రాలు చట్టాలు తెచ్చాయి. ఇలాంటి కేసుల్లో తీవ్రతను బట్టి శిక్షలు విధించనున్నారు.

పోర్న్ చిత్రాలు
 

పోర్న్ చిత్రాలు

చిన్నారుల బాల్యాన్ని చంపేసే ఇలాంటి పనులను రూపుమాపాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. చిన్నారులతో తీసిన పోర్న్ చిత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

డిలీట్‌ చేయకపోతే

డిలీట్‌ చేయకపోతే

పోక్సో సవరణ బిల్లు ఆమోదం పొందే నాటికే ఎవరి సెల్‌ఫోన్లలో అయినా 18 ఏళ్లలోపు వయసున్న పిల్లల నీలి చిత్రాలు ఉండి వాటిని డిలీట్‌ చేయకపోతే భారీ జరిమానా విధిస్తారు.

జైలుశిక్ష, జరిమానా

జైలుశిక్ష, జరిమానా

అలాంటి పోర్న్ చిత్రాలను ఫార్వర్డ్‌ చేసినా, వాట్సప్ గ్రూపుల్లో షేర్‌ చేసినా జైలుశిక్ష, జరిమానా రెండూ విధిస్తారు. ఏ వ్యక్తి దగ్గరైనా చిన్నారుల పోర్న్ చిత్రాలు ఉన్నట్లు తెలిసీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయని వారికీ జరిమానా తప్పదు. వాణిజ్య అవసరాలకు పిల్లలతో తీసిన నీలిచిత్రాలను వాడితే ఇంకా పెద్ద నేరంగా పరిగణిస్తారు.

Best Mobiles in India

English summary
Indian man gets two months' jail in Australia for having child exploitation videos in his phones.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X