జాతీయ రహదారులపై ఇకపై టోల్ ప్లాజాలు ఉండకపోవచ్చు!! కానీ...

|

టోల్ ప్లాజా మరియు టోల్ ట్యాక్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. హై-వే రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద టాక్స్ రూపంలో కొంత మొత్తంలో వసూలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ ని నియంత్రించడానికి ఫాస్టాగ్ ని అమలులోకి తీసుకొనివచ్చింది. అయితే భారత ప్రభుత్వం ఇప్పుడు మరొక కొత్త ప్లాన్ ను ప్రతిపాదించింది. ఈ కొత్త ప్లాన్ లో భాగంగా హైవేల మీద ఉన్న టోల్ ప్లాజాను పూర్తిగా తొలగించనున్నది. అంటే టోల్ ట్యాక్స్ ఉండదని దీని అర్థం కాదు.

టోల్ ప్లాజా

ఫాస్ట్ ట్యాగ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఫాస్ట్ ట్యాగ్ యొక్క అప్ గ్రేడ్ గా ట్రాఫిక్ కి చెక్ పెడుతూ చేయాలనేది ప్రభుత్వ ప్లాన్. టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించి కొత్తగా నంబర్ ప్లేట్ టెక్నాలజీని ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ అమలులోకి వస్తే కనుక రోడ్ల మీద వాహనాలను ఆపడానికి మరియు చెల్లించడానికి ఎటువంటి కారణం ఉండదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

కంప్యూటరైజ్డ్ డిజిటల్ సిస్టమ్‌

కంప్యూటరైజ్డ్ డిజిటల్ సిస్టమ్‌

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కంప్యూటరైజ్డ్ డిజిటల్ సిస్టమ్‌ను ఉపయోగించి టోల్ వసూలు చేసే కొత్త టెక్నాలజీను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలను చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ ప్రభుత్వం ఈ కొత్త ప్లాన్ ని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టంగా ఉంది.

నంబర్ ప్లేట్ టెక్నాలజీ

నంబర్ ప్లేట్ టెక్నాలజీ

నంబర్ ప్లేట్ టెక్నాలజీ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే కనుక వినియోగదారులు హైవే లలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా తమ యొక్క వాహనాలను అపి ఎటువంటి టోల్ ఫీజ్ చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే వారు అధిక సమయం పాటు వేచి ఉండవలసిన అవసరం కూడా లేదు. ప్రత్యేకంగా టాక్స్ వసూలు కోసం ప్రభుత్వం ఎటువంటి నిర్మాణమూ చేయవలసిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. అదనంగా టాక్ వసూలు కోసం అధిక మొత్తంలో వెచ్చించే నిర్వహణ మరియు అవసరమయ్యే నిర్దిష్ట అవస్థాపన లేదా మానవ మూలధనం ఏదీ కూడా ఉండదు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే కనుక ప్రభుత్వానికి మరింత రాబడి లభించే అవకాశం ఎక్కువగా కూడా ఉంటుంది.

నంబర్ ప్లేట్ టెక్నాలజీ కొత్త టోల్ ప్రక్రియ ఎలా పని చేస్తుంది

నంబర్ ప్లేట్ టెక్నాలజీ కొత్త టోల్ ప్రక్రియ ఎలా పని చేస్తుంది

నంబర్ ప్లేట్ టెక్నాలజీ ప్రక్రియను పూర్తి చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా, రెండు ఎంపికలు ఉన్నాయి:

*** నంబర్ ప్లేట్ టెక్నాలజీ ప్రక్రియ పనిచేసే మొదటి ఎంపిక విషయానికి వస్తే ప్రభుత్వం శాటిలైట్ ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఇది వినియోగదారుల యొక్క బ్యాంక్ అకౌంట్ నుండి నేరుగా టోల్ టాక్స్ వసూలు చేయడానికి కారు యొక్క GPSని ట్రాక్ చేస్తుంది.

*** రెండవ ఎంపిక విషయానికి వస్తే ప్రభుత్వం మీ కారు పాత నంబర్ ప్లేట్‌ను మార్చి కొత్త ఆప్షన్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. ఇది కంప్యూటరైజ్డ్ సిస్టమ్‌కు అనుకూలంగా ఉండేలా చేస్తుంది. అది కారు ప్రధాన రహదారిలోకి ఎక్కడ ప్రవేశించిందో మరియు అది ఎక్కడ నుండి నిష్క్రమిస్తుందో ట్రేస్ చేయగలదు.

 

నంబర్ ప్లేట్ టెక్నాలజీ

నంబర్ ప్లేట్ టెక్నాలజీలో సులభతరమైన విషయం ఏమిటంటే మీరు ఏదైనా ఒక పాయింట్ నుండి ప్రారంభించినప్పుడు అది రిజిస్టర్ అవుతుంది మరియు మీరు హైవేలోకి ప్రవేశించినప్పుడు అది మళ్లీ నమోదు అవుతుంది. కాబట్టి కారు నడిపిన ఖచ్చితమైన మొత్తం మాత్రమే యజమాని అకౌంట్ నుండి తీసివేయబడుతుంది. ఈ టెక్నాలజీ ఎంపికను అందుబాటులోకి తీసుకొని రావడానికి పనిచేస్తున్నాము. మేము ప్రపంచంలోని అధునాతన టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఇందుకోసం ఉపయోగిస్తాము కావున ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అని కేంద్ర మంత్రి గడ్కరీ వివరించారు.

Best Mobiles in India

English summary
Indian National Highways May Be Free of Toll Plazas Very Soon: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X