షాంఘైలో అడుగుపెడుతున్న ఇండియన్ సాప్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌

Posted By: Staff

షాంఘైలో అడుగుపెడుతున్న ఇండియన్ సాప్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌

న్యూఢిల్లీ : దేశంలో రెండవ అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ ఎగుమతి సంస్థ ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ చైనాలోని షాంఘైలో 125-150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఇప్పటి వరకు చైనాలో ఎవరు పెట్టుబడి పెట్టలేదని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త క్యాంపస్‌కు శనివారం నాడు శంకుస్థాపన చేసింది. మొత్తం 15 ఎకరాల్లో ఉన్న స్థలంలో క్యాంపస్‌ పూర్తి కావడానికి మొత్తం మూడేళ్లుపడుతుంది.

ఈ క్యాంపస్‌లో మొత్తం 8,000 మంది ఉద్యోగులు పనిచేయడానికి వీలుంటుంది. ఇక్కడే సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంటుకు , ల్యాబ్‌, డాటాసెంటర్‌, ట్రైనింగ్‌ సెంటర్‌, ఫుడ్‌కోర్టు 1,500 కూర్చునేందుకు ఆడిటోరియం, జిమ్‌తో పాటు పలు వినోద కార్యక్రమాలు కూడా ఈ క్యాంపస్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ఫోసిస్‌కు విదేశాల్లో ఉన్న కార్యాలయాలతో పోల్చితే షాంఘై క్యాంపస్‌ అతి పెద్దదని... పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా రూపుదిద్దామని ఇన్ఫోసిస్‌ ప్రకటనలో తెలిపింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండవ స్థానంలో చైనా ఉంది. భవిష్యత్తులో చైనా ఆర్థిక రంగంలో మొదటిస్థానానికి చేరే అవకాశం ఉంది. ఇంత పెద్ద ఎత్తున చైనాలో పెట్టుబడులు పెట్టడం చైనా మార్కెట్‌పై ఇన్ఫోసిస్‌కు ఉన్న నమ్మకమేనని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు చైర్మన్‌ ఎన్‌ ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. చైనా మార్కెట్‌ నుంచి అత్యుత్తమ క్వాలిటీ సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌ ఎగుమతులను ప్రపంచమార్కెట్లోకి.. చైనా మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తామని నారాయణమూర్తి పేర్కొన్నారు.

ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ చైనా సీఈఓ రంగరాజన్‌ వెల్లామోర్‌ మాట్లాడుతూ.. ఇంత పెద్ద మొత్తంలో పెట్టిన పెట్టుడితోపాటు.. కంపెనీ చైనా మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా తమ సేవలందిస్తుందని ఆయన అన్నారు. ఈ క్యాంపస్‌ పూర్తి కాగానే షాంఘై క్యాంపస్‌లో మొత్తం 10,000 మందికి ఉద్యోగాలను కల్పిస్తామని ఆయన వివరించారు. ఇన్ఫోసిస్‌ చైనా 2004లో ప్రారంభించామని 2011 ఆర్థిక సంవత్సరంలో 78 మిలియన్‌ డాలర్ల రెవెన్యూ సాధించిందని ఆయన అన్నారు.

కంపెనీ చైనాలోని షాంఘై పుడోంగ్‌ జాంగ్‌జింగ్‌ హైటెక్‌ పార్కులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందని. హాంగ్‌జూ బిన్‌జియాంగ్‌ హైటెక్‌ పార్కు బీజింగ్‌ చైనా ఓవర్‌సీస్‌ ప్లాజా, హాంగ్‌కాంగ్‌లో ఒక సేల్స్‌ ఆఫీస్‌ గ్లోబల్‌ ఎడ్యూకేషన్‌ సెంటర్‌ జియాక్సింగ్‌ సైన్స్‌సిటీలో కూడా కార్యాలయాలున్నాయని ఆయన చెప్పారు. ఇన్ఫోసిస్‌ చైనాలో ప్రస్తుతం 3,000 మంది పనిచేస్తున్నారని.. 23 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టామని... ఈ కార్యాలయంలో 4,200 మంది పనిచేసే వీలుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot