Home
News

IRCTC ARP ప్రయాణికులకు షాక్‌ ఇచ్చిన రైల్వే... టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌లో కీలక మార్పులు..!!

భారతీయ రైల్వే తన ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. రైల్వే టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 120 రోజుల ముందుగానే రైల్వే టికెట్లను (IRCTC ARP) బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే తాజాగా ఈ సమయాన్ని కేవలం 60 రోజులకు తగ్గించింది. దీనిపై ప్రకటనను విడుదల చేసింది. ఇందుకోసం మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. నవంబర్‌ 1 నుంచి (Railway Advance Reservation Period Reduced) ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటికే రైల్వే టికెట్లు బుకింగ్‌ చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఆయా టికెట్లతో ప్రయాణం చేసుకోవచ్చని తెలిపింది. అయితే అక్టోబర్ 31 వరకు మాత్రం 120 రోజుల పరిమితితో రైల్వే టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చు. గతంలో రైల్వే టికెట్ల ముందస్తు గడువు 60 రోజులుగానే ఉండేది. అనంతరం దానిని 120 రోజులకు పొడిగించారు. తాజాగా 60 రోజులకు తగ్గిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

Indian railway key decision on advance reservation period

అయితే ముందస్తు బుకింగ్‌ సమయం తక్కువగా ఉన్న గోమతి ఎక్స్‌ప్రెస్‌, తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లలో ఎటువంటి మార్పులు చేయలేదని రైల్వే శాఖ తెలిపింది. దీంతోపాటు విదేశీ ప్రయాణికులు ప్రస్తుతం 365 రోజుల ముందుగానే రైల్వే టికెట్లను రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఈ సమయంలోనూ ఎటువంటి మార్పులు చేయలేదని రైల్వే ప్రకటనలో తెలిపింది.

రైల్వే ముందస్తు రిజర్వేషన్ వ్యవధి 60 రోజులుగా ఉంటే ప్రయాణికుల రిజర్వేషన్‌ ఇబ్బందులు తగ్గుతాయని రైల్వే శాఖ భావిస్తోంది. అత్యవసర సమయాల్లో రిజర్వేషన్‌లు చేసే వారికి ఈ నిర్ణయం ఊరటనిస్తుందని భావిస్తోంది. దీంతోపాటు బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రించవచ్చని, అడ్వాన్స్ బుకింగ్‌ను మెరుగుపరచవచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

అడ్వాన్స్‌ బుకింగ్‌ మినహా చివరి నిమిషంలో బుకింగ్‌ చేసేందుకు తత్కాల్‌ రిజర్వేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. AC టికెట్ల కోసం ఉదయం 10 గంటలకు బుకింగ్‌ ప్రారంభం అవుతుంది. అదే Non AC రైల్వే టికెట్‌ల కోసం ఉదయం 11 గంటలకు బుకింగ్‌ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం IRCTC వెబ్‌సైట్‌ సహా యాప్‌ ద్వారా బుకింగ్‌లు చేసేందుకు అవకాశం ఉంది.

దీంతోపాటు జనరల్ టికెట్లను రిజర్వేషన్‌ చేసేందుకు UTS పేరుతో మరో యాప్‌ అందుబాటులో ఉంది. ఇందులో జనరల్‌ టికెట్లు సహా ప్లాట్‌ఫాం టికెట్లను కూడా బుకింగ్‌ చేసుకోవచ్చు. UTS యాప్‌ను 2018 లో రైల్వే ప్రవేశపెట్టింది. ఈ యాప్‌నకు గతంలో కొన్ని పరిమితులు ఉండేవి. వీటిని తొలగిస్తూ కొద్ది రోజుల క్రితం రైల్వే కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ ద్వారా టికెట్‌ను బుకింగ్‌ చేసుకొనేందుకు స్మార్ట్‌ఫోన్‌ లోకేషన్‌ ఆన్‌లోనే ఉండాలి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Indian railway advance reservation period reduced 120 days to 60 days full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X