Railway Super App ఇండియన్ రైల్వే అన్ని సేవల కోసం సూపర్ యాప్.. ఈ నెలలోనే అందుబాటులోకి..??
భారతీయ రైల్వే .. ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ లో ఒకటిగా ఉంది. ప్రతి సంవత్సరం కోట్లాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తోంది. గతంతో పోలిస్తే ఇండియన్ రైల్వేలో మౌలిక సదుపాయాలు భారీగా మెరుగయ్యాయి. టెకెటింగ్ వ్యవస్థలోనూ భారీ మార్పులు తీసుకొచ్చారు. గతంలో రైల్వే టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చేది. IRCTC అందుబాటులోకి వచ్చాక టికెట్లు బుకింగ్ చేసుకోవడం చాలా వరకు సులభం అయింది.
ప్రస్తుతం దేశంలో తక్కువ ధరలో దూర ప్రయాణాలు చేసేందుకు రైల్వేనే ఆధారం. ఫలితంగా ప్రభుత్వాలు కొత్త రైల్వే మార్గాలు సహా కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే IRCTC ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నా.. PNR ఎంక్వైరీ, ట్రైయిన్ రూట్, ట్రైయిన్ స్టేటస్ సహా పుడ్ కోసం వేర్వేరు యాప్ లపై ఆధారపడాల్సి వస్తోంది.

ప్రస్తుతం ఎన్నో యాప్ లు :
రైల్వే టెకెట్ల బుకింగ్ కోసం IRCTC (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్) యాప్, వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. అదే ప్లాట్‌ఫాం మరియు అన్ రిజర్వడ్ టికెట్ల కోసం UTS ఉన్నాయి. దీంతోపాటు ఫీడ్‌బ్యాక్ కోసం రైల్ మదద్ యాప్ లు (Railway Super App) ఉన్నాయి.
గతంలోనే ప్రకటన చేసిన రైల్వే :
ఫుడ్ ఆర్డర్ చేసేందుకు కేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్, అదే ట్రైయిన్ ట్రాకింగ్ కోసం నేషనల్ ట్రైయిన్ ఎంక్వైరీ సిస్టమ్ ఉన్నాయి. రైల్వేలో తరచూ ప్రయాణాలు చేస్తున్నవారు వివిధ అవసరాల కోసం ఈ యాప్ లను ఉపయోగించాల్సి వస్తోంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు సూపర్ యాప్ ను తీసుకొస్తున్నట్లు రైల్వే గతంలోనే ప్రకటన చేసింది.

సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) ఈ సూపర్ యాప్‌ను (IRCTC Super App) అభివృద్ధి చేసింది. గత నెలలో వెల్లడైన వివరాల ఆధారంగా ప్రస్తుతం ఉన్న IRCTC రైల్ కనెక్ట్ యాప్ తో ఈ సూపర్ యాప్ ను ఇంట్రిగేట్ చేసే ప్రక్రియ నడుస్తోందని తెలిపింది. అయితే ఈ యాప్ ఈనెల నుంచే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సూపర్ యాప్ కిందకు అన్ని సర్వీసులు :
రైల్వేకు చెందిన అన్ని సేవలు ఈ సూపర్ యాప్ కిందకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ యాప్ త్వరలో ఆండ్రాయిడ్ మరియు iOS యూజర్ల కు అందుబాటులోకి కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న IRCTC రైల్ కనెక్ట్ యాప్ భారీగా డౌన్‌లోడ్ లను కలిగి ఉంది.
గడువులో మార్పులు :
ఇండియన్ రైల్వే ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్‌ల బుకింగ్ కు 120 రోజుల ముందస్తు గడువు ఉండేది. నవంబర్ 1 వ తేదీ నుంచి ఇందులో మార్పులు వచ్చాయి. దీంతో కేవలం 60 రోజుల ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు లకేజీ అంశాల్లోనూ కఠిన నిబంధనలను తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications








