రైల్వే నుంచి కొత్తగా Swarail యాప్.. బుకింగ్, ట్రైయిన్ ట్రాకింగ్, ఫిర్యాదులు, ఫుడ్ ఆర్డర్ కోసం ఒకటే యాప్.
Indial Railway : రైల్వే లో తరచూ ప్రయాణాలు చేసే వారికి ఓ గుడ్‌న్యూస్. ఇప్పటి వరకు రైల్వేలో వివిధ సేవల కోసం అనేక రకాల యాప్స్, వెబ్‌సైట్‌లను ఉపయోగించాల్సి వస్తోంది. టికెట్ బుకింగ్ కోసం IRCTC రైల్ కనెక్ట్ యాప్ మరియు జనరల్ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్ల కోసం UTS యాప్‌లను ఉపయోగిస్తున్నాం. అలాగే రైల్వేలో ఫిర్యాదులు, ట్రైయిన్ ట్రాకింగ్ కోసం, ఫుడ్ ఆర్డర్ కోసం ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నాం.
స్వరైల్ యాప్ :
అయితే అన్ని సర్వీసులను ఒకే వేదిక కిందకు తీసుకొచ్చేందుకు వీలుగా రైల్వే ఓ సూపర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వరైల్ (Swarail App) పేరుతో యాప్‌ను అభివృద్ధి చేసింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది.

ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం :
కొన్ని రోజుల క్రితం ఈ స్వరైల్ యాప్‌ను బీటా టెస్టింగ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే తాజాగా ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ ఈ యాప్ బీటా దశలోనే ఉంది. ప్లే స్టోర్ల నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, IRCTC రైల్ కనెక్ట్ వివరాల ఆధారంగా లాగిన్ కావచ్చు.
ఆకట్టుకొనేలా ఇంటర్‌ఫేస్ :
IRCTC రైల్ కనెక్ట్ యాప్ వివరాలు లేకుంటే కొత్తగా స్వరైల్ యాప్ కోసం యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకొని లాగిన్ కావచ్చు. Swarail App ద్వారా సులభంగా టికెట్‌లను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఇంటర్‌ఫేస్ ఆకట్టుకొనేలా మరియు సులభంగా అర్థం అయ్యేలా రూపొందించారు.
హోం పేజీలోనే అన్ని వివరాలు :
ఈ యాప్ హోం పేజీలోనే సెర్చ్ ట్రైయిన్, PNR స్టేటస్, కోచ్ పొజిషన్, ట్రాక్ యూవర్ ట్రైయిన్, ఆర్డర్ ఫుడ్, ఫైల్ రిఫండ్, రైల్ మదద్, ట్రావెల్ ఫీడ్‌బ్యాక్ వంటి అనేక ఆప్షన్‌లు ఉన్నాయి. సింగిల్ క్లిక్ తో వీటిని యాక్సెస్ చేయవచ్చు. దీంతోపాటు ప్రత్యేకంగా మై బుకింగ్స్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఆప్షన్ ద్వారా మీ అన్ని బుకింగ్స్‌ను సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ రైల్వే సూపర్ యాప్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. అయితే పూర్తి స్థాయి వెర్షన్‌ను ఎప్పుడు తీసుకొస్తారనే సమాచారం లేదు. ప్రస్తుతం కూడా పరిమిత సంఖ్యలోనే ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. తరచూ రైల్వేలో ప్రయాణం చేసే వారికి వివిధ రకాల యాప్స్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా.. ఈ సూపర్ యాప్ ద్వారా అన్ని బుకింగ్, ట్రాకింగ్ చేసుకోవచ్చు.
* ఈ సంవత్సరం మే 1 నుంచి రైల్వేలో కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్ కలిగిన ప్రయాణికులు AC, స్లీపర్ బోగీల్లో ప్రయాణం చేస్తే జరిమానాలు విధించనున్నారు. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కలిగిన వారు కేవలం జనరల్ బోగీల్లోనే ప్రయాణం చేసేందుకు వీలుంది.
ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్న టికెట్లు.. వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ కానున్నాయి. అదే రైల్వే స్టేషన్‌లోని టికెట్ బుకింగ్ కేంద్రాల్లో బుకింగ్ చేసుకొని ఉంటే, సమీప స్టేషన్‌కు వెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలి. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్రయాణం చేసే వారిపై భారీగా జరిమానాలు విదించనున్నారు.
స్లీపర్ క్లాస్‌లో ప్రయాణం చేస్తూ పట్టుబడితే రూ.250 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే AC లో వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్రయాణం చేస్తూ పట్టుబడితే రూ.440 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే జరిమానా.. ప్రయాణికులు రైలు ఎక్కిన స్టేషన్ నుంచి తర్వాత వచ్చే స్టేషన్ వరకు మాత్రమే వర్తిస్తుంది. జరిమానా చెల్లించిన తర్వాత వచ్చే స్టేషన్‌లో జనరల్ కోచ్‌కు మారాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








