Home
News

రైల్వే స్టేషన్‌ కౌంటర్‌లో టికెట్‌ బుకింగ్ చేస్తున్నారా.. ఏప్రిల్‌ 1 నుంచే కొత్త నిర్ణయం అమల్లోకి..!!

భారతీయ రైల్వే ప్రయాణికులకు (Indian Railway) సౌకర్యాలు కల్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రైల్వే స్టేషన్ల అభివృద్ధితోపాటు కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెడుతోంది. దీంతోపాటు డిజిటల్‌ పేమెంట్లు చేసేలా ప్రయాణికులను ప్రోత్సహిస్తోంది.

తాజాగా రైలు టికెట్లు చెల్లింపు విధానంలో కీలక మార్పులు చేసింది. సాధారణంగా టికెట్లు రిజర్వు (Railway Ticket Booking) చేసుకొనేందుకు IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ వెబ్‌ సైట్‌ లేదా ఇతర రైల్‌ కనెక్ట్‌ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లును బుకింగ్‌ చేసుకోవచ్చు. క్రెడిట్‌, డెబిట్‌, UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

indian railway will allow digital payments at station ticket counter

అయితే రైల్వే స్టేషన్లలోని టికెట్‌ కౌంటర్‌ వద్ద నగదు రూపంలో మాత్రమే చెల్లింపులు చేయాల్సి వచ్చేది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే కౌంటర్‌ వద్ద కూడా డిజిటల్‌ పేమెంట్లు చేసుకొనే అవకాశం కల్పిస్తోంది. QR కోడ్ స్కానర్‌, UPI యాప్‌ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఏప్రిల్‌ 1, 2024 ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు ప్రకటన చేశారు.

రైల్వే స్టేషన్‌ కౌంటర్ల వద్ద డిజిటల్‌ పేమెంట్లతోపాటు నగదు ఇచ్చి కూడా టికెట్లును కొనుగోలు చేయవచ్చని భారతీయ రైల్వే వెల్లడించింది. డిజిటల్‌ పేమెంట్ల విధానాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిర్ణయం ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా కౌంటర్ల వద్ద చిల్లర సహా ఇతర సమస్యలకు చెక్‌పెట్టినట్లు అవుతుంది.

* భారతీయ రైల్వే AI చాట్‌బోట్‌ AskDisha 2.0 ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ చాట్‌ బోట్‌ ద్వారా అనేక రకాల సేవలను అందిస్తోంది. టికెట్లు బుకింగ్‌ చేయడం రిఫండ్‌ ప్రక్రియ గురించి తెలుసుకోవడం సహా వివిధ సేవలకు సంబంధించిన సమాచారం అందిస్తోంది.

AskDisha 2.0 చాట్‌బోట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మరియు మెషిన్‌ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది. Corover AI పైన పనిచేస్తుంది. ఈ చాట్‌బోట్‌ హిందీ, ఇంగ్లీష్‌, హింగ్లీష్‌ భాషలను సపోర్టు చేస్తుంది. మరియు ఈ AI చాట్‌బోట్‌ IRCTC మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

AskDisha 2.0 లో చిన్న చిన్న కమాండ్లు ఉపయోగించిన రైలు టికెట్లను బుకింక్‌ చేసుకోవచ్చు. మరియు PNR స్టేటస్‌ను గురించి తెలుసుకోవచ్చు, టికెట్లను క్యాన్సిల్‌ వంటి సేవలను పొందవచ్చు. వాయిస్‌ కమాండ్ల ద్వారా కూడా ఈ సదుపాయాలను పొందవచ్చు.

భారతీయ రైల్వేకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌బోట్‌ ద్వారా టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చు. మరియు PNR స్టేటస్‌ చెకింగ్‌ చేసుకోవచ్చు మరియు క్యాన్సిల్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు రిఫండ్‌ పరిస్థితిని తెలుసుకోవచ్చు. దీంతోపాటు బోర్డింగ్‌ స్టేషన్‌ మార్పులు చేయడం సహా బుకింగ్‌ హిస్టరీని కూడా తనిఖీ చేసుకోవచ్చు. దీంతో టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
indian railway will allow digital payments at station ticket counter from 1st april
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X