ఇక ఐడీ‌ప్రూఫ్ క్రింద m-Aadhaar చాలు

m-Aadhaar యాప్ ద్వారా జనరేట్ అయ్యే ఆధార్ డేటాను ఇక నుంచి వ్యాలీడ్ ఐడీ‌ప్రూఫ్‌గా పరిగణిస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది. రైళ్లలో ప్రయాణించే సమయంలో ప్యాసెంజర్ల తమ m-Aadhaar డేటాను ఐడీప్రూఫ్ క్రింద చూపిస్తే సరిపోతుందని రైల్వే శాఖ తెలిపింది. m-Aadhaar యాప్ ఓపెన్ చేసి పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసిన తరువాత డిస్‌‌ప్లే అయ్యే డేటాను, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటెటీ క్రింద పరిగణిస్తామని ఇండియన్ రైల్వేస్ తెలిపింది.

Read More : మోటరోలా ఫోన్‌లకు Android Oreo అప్‌డేట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

M-Aadhaar యాప్..

భారత పౌరులకు తమ ఆధార్ వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేలా చేయటం కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా m-Aadhaar పేరుతో ఓ మొబైల్ యాప్‌ను ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ క్రింద్ ప్రమోట్ అయిన ఈ యాప్ ద్వారా యూజర్లు తమ ఆధార్ నెంబర్, ఫోటో, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను ఇన్‌స్టెంట్‌గా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది.

ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే..?

m-Aadhaar అప్లికేషన్‌ను ఉపయోగించుకోవాలంటే యూజర్ ముందుగా యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వద్ద తన మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే తమ ఆధార్ సమాచారాన్ని యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. డౌన్‌లోడ్ అయ్యే డేటాలో ఆధార్‌లో ఉన్న పేరు, డేటా ఆఫ్ బర్త్, అడ్రస్ అలానే ఫోటోగ్రాఫ్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లలో mAadhaar యాప్ కలిగి ఉన్న యూజర్లు ఇక పై ఆధార్ కాపీని తమ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రూఫ్ క్రింద యాప్‌లోని డేటాను చూపిస్తే సరిపోతుంది.

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు mAadhaar appను గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి అఫీషియల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ప్రస్తుతానికి mAadhaar app యాప్ సేవలు కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం iOS వర్షన్‌ను త్వరలోనే అందుబాటులోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.

బయో మెట్రిక్ డేటాను కూడా లాక్ చేసుకునే అవకాశం...

mAadhaar app ద్వారా యూజర్లు తమ బయోమెట్రిక్ డేటాను లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే వీలుంటుంది. బయోమెట్రిక్ డేటా అంటే..? ఆధార్ కార్డ్ తీసుకునే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ వేలిముద్ర అలానే రెటీనల్ స్కాన్ డేటాను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధమైన డేటాను టెక్నికల్ పరిభాషలో బయోమెట్రిక్ డేటా అని పిలుస్తారు.

మీ నుంచి సేకరించిన బయోమెట్రిక్ డేటాను..

ఆధార్ వెరిఫికేషన్ నిమిత్తం మీ నుంచి సేకరించిన బయోమెట్రిక్ డేటాను ఆధార్ వెరిఫికేషన్ నిమిత్తం ఉపయోగించటం జరుగుతుంది. అది ఎలా అంటే, ఉదాహరణకు మీరు కొత్త సిమ్‌కార్డ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ క్రింద ఆధార్ కార్డ్‌ను ఇచ్చారు. ఆ క్రమంలో మీ KYC వెరిఫికేషన్ నిమిత్తం సంబంధిత టెలికం కంపెనీ, మీ వేలి ముద్ర ఆధారంగా బయోమెట్రిక్ వివరాలను పరిశీలించటం జరుగుతుంది.

Aadhaar biometric authenticationను లాక్ అలానే అన్‌లాక్ చేయటం ఎలా..?

ముందుగా మీ కంప్యూటర్ నుంచి UIDAI వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన కాలమ్ క్రింద మరో సెక్యూరీటీ కోడ్ కాలమ్ మీకు కనిపిస్తుంది. అక్కడ పైన ఉంచిన సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. పేజీలో క్రింద కనిపించే Generate OTP పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్‌తో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో one-time password అందుతుంది. ఆ ఓటీపీని సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసి Verify ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు Enable biometric lockingను చెక్ చేసుకోండి. ఎనేబుల్ బయోమెట్రిక్ లాకింగ్‌ను చెక్ చేసిన తరువాత Enable ఆప్సన్ పై క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ బయోమెట్రిక్ వివరాలు లాక్ కాబడతాయి. ఒకవేళ లాక్ ను disable చేయాలనుకుంటే Enable biometric lockingను అన్ చెక్ చేసి disable పై క్లిక్ చేయండి. పై సూచనలను పాటించటం ద్వారా మీ Aadhaar biometric సమాచారాన్ని లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. తాజాగా అందుబాటులోకి వచ్చిన mAadhaar app ద్వారా కూడా ఈ ప్రొసీజర్‌ను కంప్లీట్ చేయవచ్చు.

one-time password ఆధారంగానే రిక్వస్ట్..

యూజర్ తన Aadhaar biometric డేటాను లాక్ చేయటం ద్వారా ఆధార్ సంబంధిత లావాదేవీలు అలానే రిక్వస్ట్‌లను one-time password ఆధారంగానే మేనేజ్ చేయగలుగుతారు. వీళ్లకు సంబంధించిన వేలి ముద్ర అలానే ఐరిస్ స్కాన్ లాక్ చేయబడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indian Railways To Now Accept m-Aadhaar as ID Proof for Travellers. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot