Home
News

Indian Railways Super App రైల్వే ప్రయాణికుల కోసం సూపర్‌ యాప్‌.. అన్ని సర్వీసులకు ఒకటే ప్లాట్‌ఫాం..!

భారతీయ రైల్వే.. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రైల్వే టికెట్‌ బుకింగ్‌, ట్రెయిన్‌ లైవ్‌ ట్రాకింగ్ సహా ఇతర సేవల కోసం వివిధ రకాల యాప్‌లను వినియోగిస్తున్నారు. అయితే ఈ సేవలు అన్ని ఇకపై ఒకే యాప్‌ ద్వారా అందించాలని రైల్వే భావిస్తోంది. ఇందుకు సంబంధించిన యాప్‌ విడుదల చేసేందుకు (Indian Railways Super App) ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భారతీయ రైల్వే శాఖ.. అనేక సేవలకు సంబంధించి ఒకటే రైల్వే సూపర్‌ యాప్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రైల్వే ఐటీ వ్యవస్థలకు సంబంధించిన CRIS (సెంటర్‌ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) అభివృద్ధి చేస్తోంది. నూతనంగా అందుబాటులోకి రానున్న యాప్‌ రైల్వేల ఫిర్యాదులు, అన్‌రిజర్వడ్‌ టికెట్‌ బుకింగ్‌, ట్రైయిన్ ఎంక్వైరీ, జియో లోకేషన్‌ ఆధారిత ట్రాకింగ్‌ సిస్టమ్ సహా ఇతర అనేక సేవలను అందిస్తుందని తెలుస్తోంది.

railways-to-launch-super-app news

ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌, ఐఆర్‌సీటీసీ ఇ-క్యాటరింగ్‌ పుడ్‌ ఆన్‌ ట్రక్‌, ఐఆర్‌సీటీసీ ఎయిర్‌ వంటి అనేక ప్రముఖ యాప్‌లు త్వరలో అందుబాటులోకి రానున్న సూపర్‌ యాప్‌లో ఇంటిగ్రేట్‌ చేయబడతాయి. ఈ యాప్‌ అభివృద్ధి సహా నిర్వహణ కోసం రూ.90 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్‌ 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో రైల్వే యాప్‌లో అత్యధిక ప్రజాదరణ పొందింది.

రైల్‌ కనెక్ట్ ద్వారా భారీ స్థాయిలో టికెట్ల బుకింగ్‌ : రైల్‌ కనెక్ట్ యాప్‌ ద్వారా 2023 ఆర్థిక సంవత్సరంలో 5,60,000 రైలు టిక్కెట్‌లను బుకింగ్‌ చేశారు. ఇది ఐఆర్‌సీటీసీ ద్వారా విక్రయించబడిన మొత్తం టికెట్లలో సగం. డిజిటలైజేషన్ మరియు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా సూపర్‌ యాప్‌ అభివృద్ధి వైపు రైల్వే శాఖ మొగ్గుచూపింది.

railways-to-launch-super-app news

ఈ సూపర్‌ యాప్‌ ద్వారా రైల్వే ప్రయాణికులు.. బుకింగ్‌, ఫిర్యాదులు నమోదు, జనరల్‌ టికెట్ల బుకింగ్‌, రన్నింగ్ స్టేటస్‌, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ ఇలా పలు యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకొనే ఇబ్బంది ఉండదని, రైల్వేకు సంబంధించిన అన్ని యాప్‌లు ఒకే గొడుగు కిందకు వస్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి. అయితే యూజర్ల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా యాప్‌ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాయి.

ప్రస్తుతం రైల్వే టికెట్లు బుకింగ్కు రైల్ కనెక్ట్‌ యాప్‌. ఫిర్యాదుల కోసం రైల్ మదద్‌ యాప్‌, జనరల్‌ టెకెట్ల బుకింగ్‌ కోసం యూటీఎస్‌ సహా మరిన్ని యాప్‌లు ఉన్నాయి. అయితే ఈ యాప్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది. యాప్‌ పేరు ఏం పెట్టనున్నారు వంటి వివరాలు ప్రస్తుతానికి తెలియరాలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Source : Economic Times

More from GizBot

Best Mobiles in India

English summary
Indian Railways planning to launch super app for all the services
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X